Wednesday, 7 December 2022

Today's School Assembly : 07.12.2022

 

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*🔍నేటి వార్తల ముఖ్యాంశాలు🔎* 

*1.ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్పీఆర్బీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.*

*2.వచ్చే విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ముద్రించిన ద్విభాషా పుస్తకాలను అందజేయనున్నారు. వచ్చే ఏడాది ఇంగ్లిష్‌ మీడియాన్ని 9వ తరగతి వరకు పొడిగించనుండటంతో ప్రత్యేకంగా పుస్తకాలను సిద్ధం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.* 

*3.శీతాకాల విడిది కోసం ఈ నెల 24న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  హైదరాబాద్ రానున్నారు.*

*4.ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.*

*5.నేటి నుంచి 17 రోజుల పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నా నేపథ్యంలో నిన్న  ఢిల్లీలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)లు భేటీ అయ్యాయి.* 

*6.ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రకటించిన 100 మంది ప్రభావశీలుర మహిళల జాబితాలో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ అయిన తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉండటం విశేషం.*

*7.కర్ణాటకలోని హట్టి ప్రాంతంలో బంగారు గనుల కింద అతి విలువైన ప్లాటినం, కాపర్‌-పల్లాడియం మిశ్రమ లోహ నిల్వలు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్‌ఐ) పరిశోధకులు తేల్చారు.*

*8. చైనా గూఢచార నౌక ‘యువాన్‌ వాంగ్‌ 5’ హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది.*

*9.అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు.*

*10.ఫిఫా ప్రపంచకప్‌ లో జరిగిన ప్రిక్వార్టర్స్‌ పోరులో బ్రెజిల్‌ 4-1తో కొరియాపై ఘన విజయం సాధించింది.* 

*11.భారత క్రికెట్‌ చరిత్రలో పురుషుల మ్యాచ్‌లకు మహిళలు అంపైర్లుగా వ్యవహరించనున్నారు.వృందా రాఠి, జనని నారాయణన్‌, గాయత్రి వేణుగోపాలన్‌ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు తొలిసారి మహిళా అంపైర్లుగా విధులు నిర్వహించనున్నారు.*


*👉నేటి సూక్తి.* 

*చేసిన చెడ్డ పనులకే కాదు చేయని మంచి పనులకు కూడా మనం సంజాఇషీ ఇచ్చు కోవాలి*


*🔆మంచి పద్యం🔆*

*స్త్రీల ఎడ వాదులాడక*

*బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ*

*మేలైన గుణము విడువకు*

*ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!*

*👉తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు.*


*♦️నేటి ప్రశ్న♦️*

*1. ఇస్రోకి చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) ఎక్కడ ఉంది?*

*A. తిరువనంతపురం*

*2.మానవ శరీరంలో ‘ఆడమ్స్ ఆపిల్’ అని ఏ గ్రంథిని పిలుస్తారు?*

 *A. థైరాయిడ్*