Friday, 9 December 2022

Today's School Assembly : 09.12.2022


 
*✍🏻నేటి వార్తలు📜*


1)👉 మోదీ మ్యాజిక్ తో గుజరాత్ లో BJP విజయం సాధించింది. 182 సీట్లకు 156 సీట్లు కొల్లగిట్టిన బీజేపి. 

2)👉 హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిచింది. 68 స్థానాలకు 40 స్థానాలలో విజయం సాధించింది.

3)👉 TRS ఇకనుంచి BRS. పార్టీ పేరు మార్పునకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం.

4)👉 ఎయిర్ పోర్థ్ మెట్రోకు నేడు శంఖుస్థాపన. శిలా ఫలకాన్ని ఆవిష్కరించనున్న సీయం కేసీఆర్.

5)👉 మనఊరు -మన బడి పనులు వేగవంతం చేయాలని  కలెక్టర్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

6)👉  బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది

7)👉తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్ళను కేటాయిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది.
 
8)👉 ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంతర్జాతీయ జీ-20 సమావేశాలకు విశాఖ వేదిక కానుంది.

9)👉  ఫుట్ బాల్ ప్రపంచకప్ లో భాగంగా నేడు క్వార్టర్ ఫైనల్ లో బ్రెజిల్ క్రొయేషియాతో...అర్జెంటీన - నెదర్లాండ్ తో తలపడనున్నాయి.


*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ప్రార్థన చేసే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న"*
            -మదర్ థెరీసా
            
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*ఆకు కూరలు కంటి చూపుకి మంచిది. ఆకుకూరలు తినడంవలన జీర్ణశక్తిె మెరుగవుతుంది..*

*📚 జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q)భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుండి గ్రహించబడినవి?*
A:ఐర్లాండ్
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

                *🔥Today News*

> *Comments against Collegium not well taken: SC on criticism by govt functionaries*

> *EC accepts TRS’ name change to Bharat Rashtra Samithi*

> *Computer science students in US face a shrinking big tech job market*

> *Dina Boluarte, Peru’s first female president, pledges to heal nation’s wounds*

> *CBSE releases notice regarding preparation for Class 10, 12 practical exams will begin from January 1, 2023.*

> *NTA to not release JEE Main 2023 registration dates this week: Chief*

> *Rupee gains 3 paise to close at 82.44 against U.S. dollar*

> *FIFA World Cup: Dutch have Gaal to stop Messi in quarter-final*

             *🌻Proverb/ Motivation*

*It's better to be unique than the best because. Being the best makes you the number one but, being unique makes you the only one.*

              *💎నేటి ఆణిముత్యం💎*

*ఉదకము ద్రావెడు హయమును*
*మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్*
*మొదవుకడ నున్న వృషభముఁ*
*జదువని యా నీచుకడకుఁజనకుర సుమతీ!*

తాత్పర్యము: *ఓ సుమతీ! నీరు త్రాగెడి గుఱ్ఱము వద్దకు, క్రొవ్వుచే విజ్రుంభించు మదపు ఏనుగు వద్దకు, ఆవు దగ్గరున్న ఆంబోతు వద్దకు, విద్యనేర్వని మానవుని వద్దకు వెళ్ళరాదు. వెళ్ళినచో గుర్రము సకిలించును. ఏనుగు తొండంతో కొట్టును. ఆంబోతు పొడిచి చంపును. విద్యలేనివాడు వింత పశువు వలె ప్రవర్తించును. వీటి నుండి తప్పించుకొని వెళ్ళుట మంచిది.*