Today's School Assembly: 12.12.22
*✍🏻నేటి వార్తలు📜*
1)👉 నేడు ఢిల్లీకి KCR. ఈ నెల 14న BRS కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు
2)👉 హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన ఇండియన్ రేసింగ్ లీగ్ విజేతగా చెన్నై టర్బోరైడ్స్ నిలిచింది.
3)👉 రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది.
4)👉 హిమాచల్ ప్రదేశ్ 15 వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణస్వీకారం చేసారు.
5) గుజరాత్ సీయంగా నేడు భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
6)👉 ప్రాక్టికల్స్ కు జంబ్లింగ్ విధానంపై ఇంటర్మీడియట్ బోర్డు యోచిస్తుంది.
7)👉 వచ్చే ఏడాదికి లక్షన్నర డిగ్రీ సీట్లు కుదించనున్నారు.
8)👉 RTC కి కొత్త బస్సులు రానున్నాయి. సుధీర్ఘ కాలం తర్వాత వెయ్యి బస్సులు కొనుగోలు.
9)👉 అతి వ్యాయామంతొ యువతకు గుండెపోటు వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
10)👉 నాసా పంపిన ఓరియాన్ 25 రోజులపాటు చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆదివారం సురక్షితంగా భూమికి చేరింది.
11)👉ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఫ్రాన్స్ సెమిఫైనల్ కు చేరింది
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*1.లేవండి ! మేల్కొనండి. గమ్యం చేరేవరకు విశ్రమించకండి*
-స్వామి వివేకానంద
*2. ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయానిస్తున్నావని అర్దం చేసుకో*
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*సీజనల్ లో దొరికే పండ్లను అస్సలు మిస్ కాకూడదు. చలికాలంలో దొరికే రేగిపండ్లవల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.*
*📚 జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*♦️నేటి ప్రశ్న♦️*
*1. దేశీయ యుద్ధ ట్యాంకు అర్జున్ను తయారు చేసిన సంస్థ పేరేంటి?*
*A. డిఆర్డిఓ*
*2. జాతీయ స్థాయి రికార్డులను నమోదు చేసే పుస్తకం పేరేంటి?*
*A.లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్*
*3. డైనమైట్ ను కనుగొన్నది ఎవరు?*
A: ఆల్ఫ్రేడ్ నోబెల్.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🔆మంచి పద్యం🔆*
*ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి*
*మూగచింతపల్లె మొదటి యిల్లు*
*ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు*
*విశ్వదాభిరామ వినురవేమ!*
*👉తాత్పర్యము: కొండవీడుకి పశ్చిమంగా ఉన్న మూగచింతపల్లి గ్రామంలో మొదటి ఇల్లు తన నివాసమని, రెడ్డి కులంలో జన్మించానని వేమన తెలియ బరుస్తున్నాడు.*