1)👉 ప్రత్యేక విమానంలో సీయం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. రేపు BRS నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు
2)👉L.A.C వద్ద జరిగిన ఘర్షణలో భారత , చైనా జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి
3)👉 మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి.
4)👉 సుప్రీంకోర్ట్ జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణస్వీకారం చేసారు.
5)👉 కేరళలోని శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.
6)👉 ఉన్నత విద్యలోకి ప్రవేశించే విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు అనే అంశంపై లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అభిప్రాయపడింది.
7)👉 రామప్ప దేవాలయం పునరుద్ధరణ 2026 నాటికి పూర్తి చేస్తామని యునెస్కో ప్రకటించింది
8)👉 తొలి సక్సెస్ ఫుల్ స్టార్టప్ తెలంగాణ అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
9)👉 వరుసగా రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేసారు.
10)👉 ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో భాగంగా నేడు అర్జెంటీనా - క్రొయేషియా జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది.
🎯నేటి సూక్తి
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
వినయం లేని విద్య ,
సుగుణం లేని రూపం ,
ఉపయోగపడని ధనం ,
పరోపకారం చేయని జీవితం వ్యర్థం.
-స్వామీ వివేకానంద
🩺నేటి ఆరోగ్య సూత్రం🍎
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
అటుకులు తినడంవలన శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.శరీర కణాలకు ఆక్సీజన్ సాఫీగా అందేలా చేస్తాయి. షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.
మంచి పద్యం🔆
కాదనడెవ్వరితోడను
వాదాడగబోడు వెర్రివానివిధమునన్
భేదాభేద మెరుంగును
వేదాంత రహస్యములను వేమన నుడువున్ ||
👉తాత్పర్యము: తన గురువైన అభిరాముడు ఎవ్వరితోను వాదనకు దిగకుండగా, మంచి చెడ్డలను గ్రహిస్తూ, వేదాంత రహస్యములను వేమనకు బోధిస్తూ ఉండేవాడు. అభిరాముడు పైకి వెర్రివాడివలె కనిపించెడివాడు.
♦️నేటి ప్రశ్న♦️
1. గణతంత్ర వ్యవస్థను ఏదేశ రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందు పరిచారు?
A.ఫ్రాన్స్
2.ప్రాథమిక హక్కులను ఏదేశ రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందు పరిచారు?
A. అమెరికా
3. దంతవైద్యులు ఉపయోగించే దర్పణం ఏది?
A: పుటాకార దర్పణం
〰️〰️〰️〰️〰️〰️〰️〰️