Tuesday, 6 December 2022

Today's School Assembly 6.12.22


*06-12-2022*
 *🔥Today News*

> *Charity is welcome, but the intention should not be religious conversion: Supreme Court*

> *RBI's monetary policy committee starts deliberations amid expectations of moderate rate hike*

> *War and sanctions threaten to thrust Russia’s economy back in time*

> *Telangana entrepreneur’s solution to handloom weavers’ physical distress wins state award*

> *CLAT 2023: Admit card to release tomorrow*

> *NEET SS Counselling 2022: Choice filling for round 1 commences -December 7th*

> *Digital lending: No clarity, awaiting RBI response, say bank & fintechs*

             *🌻Proverb/ Motivation*

*Honest relations are just like water. No color, no shape, no place, no taste but still very important for life.*

              *💎నేటి ఆణిముత్యం💎*

*నవ్వకుమీ సభలోపల*
*నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్*
*నవ్వకుమీ పరసతితో*
*నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!*

తాత్పర్యము: *ఓ సుమతీ! పెద్దల సభలయందు నవ్వరాదు, తల్లి, తండ్రి, యజమానుల యందు నవ్వరాదు. ఇతరుల భార్యయైన స్త్రీలను చూచి నవ్వరాదు, బ్రాహ్మణులందు పరిహాసముగా నవ్వరాదు అని భావం.*

       *🌷Today's GK*

Q: *.......... canal gets water from Sutlej and Beas rivers in India.*

A: *Indira Gandhi Canal**

*🔍నేటి వార్తల ముఖ్యాంశాలు🔎* 

*1.తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు ఎంసెట్‌లో సత్తాచాటేందుకు ఏప్రిల్‌, మే మాసాల్లో ఇంటెన్సివ్‌ రెసిడెన్షియల్‌ సమ్మర్‌ కోచింగ్‌ ఇవ్వనున్నారు.*  

*2.పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.* 

*3.తెలంగాణ రాష్ట్రంలోని మూడో వంతు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉంది. పాఠశాల విద్యాశాఖ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.* 

*4.ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ.. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం వెతుకుతున్నది.*

*5.ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్‌బస్‌ బెలుగా.. దుబాయ్‌లోని మాక్టోం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని పటాయ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నది.* 

*6.ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న సెమేరు అగ్నిపర్వతం బద్దలైంది. భారీగా లావా ఎగసి పడుతుండటంతో అధికారుల సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించారు.*

*7. కరోనా వైరస్‌ మానవ నిర్మితమని చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో పని చేసిన అమెరికా సైంటిస్ట్‌, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. చైనా ప్రభుత్వం నిర్వహించే వుహాన్ ఇన్సిస్ట్యూట్‌ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నుంచే రెండేళ్ల కిందట కరోనా వైరస్‌ లీక్‌ అయ్యిందని తన తాజా పుస్తకం ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’లో పేర్కొన్నారు.*

*8.ఫిఫా ప్రపంచకప్‌లో సోమవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ప్రిక్వార్టర్స్‌ పోరులో క్రొయేషియా 4-2 తేడాతో జపాన్‌(పెనాల్టీ షూటౌట్‌)పై విజయం సాధించింది.* 

*👉నేటి సూక్తి.* 

*నీకంటూ ఒక స్థానం లేనప్పుడు ఇంట్లోనే కాదు వీధిలోను లోకువే*

*🔆మంచి పద్యం🔆*

*హీనగుణమువాని నిలుజేరనిచ్చిన*
*నెంతవానికైన నిడుము గలుగు*
*ఈఁగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా*
*విశ్వదాభిరామ! వినుర వేమ!*

*👉భావం: నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైన కష్టము కలుగుతుంది. ఈగ కడుపులోకి వెళితె వికారమును కలిగిస్తుంది.*

*♦️నేటి ప్రశ్న♦️*

*Q.విశ్వానికి సూర్యుడు కేంద్రమనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?*

*A.కోపర్నికస్*

             *🌻Proverb/ Motivation*

*Honest relations are just like water. No color, no shape, no place, no taste but still very important for life.*

              *💎నేటి ఆణిముత్యం💎*

*నవ్వకుమీ సభలోపల*
*నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్*
*నవ్వకుమీ పరసతితో*
*నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!*

తాత్పర్యము: *ఓ సుమతీ! పెద్దల సభలయందు నవ్వరాదు, తల్లి, తండ్రి, యజమానుల యందు నవ్వరాదు. ఇతరుల భార్యయైన స్త్రీలను చూచి నవ్వరాదు, బ్రాహ్మణులందు పరిహాసముగా నవ్వరాదు అని భావం.*

                 *🌷Today's GK*

Q: *.......... canal gets water from Sutlej and Beas rivers in India.*

A: *Indira Gandhi Canal*