Saturday, 6 September 2025

Promotion Pay Fixation


PROMOTION PAY FIXATION

💦 *ప్రమోషన్ పొందిన ఉద్యోగుల Pay Fixation కు సంబంధించిన సమాచారం*

* *🔰ప్రమోషన్ ఫిక్సేషన్ అనేది వ్యక్తికి వర్తించే నిబంధనల ప్రకారం మూడు విధాలుగా చేయవచ్చు.*

* *🔺ప్రస్తుత బేసిక్ పే ప్రమోషన్ స్కేల్‌కు 3 బేసిక్స్ కంటే తక్కువగా ఉంటే, పే మొదట ప్రమోషన్ స్కేల్‌లో ఫిక్స్ చేయబడుతుంది.

* *🔖ఒక ఉద్యోగి ప్రమోషన్ పొంది, అతని/ఆమె బేసిక్ పే ప్రమోషన్ స్కేల్‌లోని ప్రారంభ బేసిక్ పే కంటే ఎక్కువగా ఉంటే, అతను/ఆమె ప్రమోషన్ ఫిక్సేషన్‌ను రెండు విధాలుగా ఎంచుకోవచ్చు.

* *📍a) వ్యక్తి తన ప్రమోషన్ తేదీ నుండి ఆప్షన్ ఇవ్వాలనుకుంటే, FR 22(B) కింద ప్రమోషన్ ఫిక్సేషన్ చేయబడుతుంది మరియు ఆ తేదీన అతనికి/ఆమెకు రెండు ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. అతని తదుపరి AGI (ఆన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్) ఒక సంవత్సరం తర్వాత మంజూరు చేయబడుతుంది. (ఇంక్రిమెంట్ తేదీ మారుతుంది)

* *📍b) వ్యక్తి తన ఇంక్రిమెంట్ తేదీ నుండి ఆప్షన్ ఇవ్వాలనుకుంటే, ప్రమోషన్ తేదీన FR 22(a)(i) కింద ప్రమోషన్ ఫిక్సేషన్ చేయబడుతుంది (ఒక ఇంక్రిమెంట్ మాత్రమే మంజూరు చేయబడుతుంది) మరియు తర్వాత అతని/ఆమె ఇంక్రిమెంట్ తేదీన ప్రమోషన్ ఫిక్సేషన్ సవరించబడుతుంది. అంటే, కింది కేడర్‌లో ఒక ఇంక్రిమెంట్ (నామినల్‌గా) మంజూరు చేయబడుతుంది & సాధారణ AGI & FR 22(B) మంజూరు చేయబడతాయి. అతని తదుపరి AGI ఒక సంవత్సరం తర్వాత మంజూరు చేయబడుతుంది. (ఇంక్రిమెంట్ తేదీ కింది కేడర్‌లోని తేదీ వలెనే ఉంటుంది)

* *📌ఒక వ్యక్తి ఒకే కేడర్‌లో 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి, SPP-IIకి అర్హత పొందితే, అతను/ఆమెకు SPP-II స్కేల్ మంజూరు చేయబడినా/SPP-II స్కేల్‌కు అర్హత ఉన్నప్పటికీ మంజూరు చేయకపోయినా, అతను/ఆమె తదుపరి స్థాయి కేడర్‌కు ప్రమోషన్ ఫిక్సేషన్‌కు అర్హులు. FR 22(a)(i) తో పాటు FR 31(2) ప్రకారం ఫిక్సేషన్ చేయబడుతుంది, అంటే ప్రమోషన్ తేదీన అతనికి/ఆమెకు ఒక ఇంక్రిమెంట్ మాత్రమే మంజూరు చేయబడుతుంది. కింది కేడర్‌లో అతనికి/ఆమెకు ఏ AGI అయితే ఉందో అది కొనసాగుతుంది.

*వేతన స్థిరీకరణ సందేహాలు సమాధానాలు:
------------------------------------------------------------ 

🍁 సందేహం: SGT క్యాడర్ లో 24 సం|| సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఆగస్టు 2025 లో ప్రమోషన్ పొందారు వారికి వేతన స్థిరీకరణ ఏ పద్ధతిలో చేయాలి?

సమాధానం: SGT క్యాడర్ లో 24 సం|| సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు అర్హతలు కలిగి ఉన్నట్లయితే సదరు ఉపాధ్యాయుని అంగీకారంతో నిమిత్తం లేకుండా FR-22(a)(i) ప్రకారం వేతన స్థిరీకరణ చేయాలి. ఈ రూల్ ప్రకారం ప్రమోషన్ పొందిన నెలలో ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. FR-31(2) ననుసరించి లోయర్ క్యాడర్ లోని ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుంది.
 
ఉదా: 1998లో నియామకమైన ఒక ఉపాధ్యాయుడు ఆగస్టు 2025 లో పదోన్నతి పొందాడు. 2022 లో 24 సం|| సర్వీసు పూర్తి చేసినాడు. సదరు ఉపాధ్యాయునికి లోయర్ క్యాడర్ లో ఇంక్రిమెంట్ నవంబర్ లో ఉన్నది. ఆగస్టులో FR-22(a)(i) ప్రమోషన్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి FR-31(2) ప్రకారం వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ లో మంజూరు చేయబడుతుంది. (చూడుడు DTA Lr. No. F2/10068/2022 Dt: 28.9.2024)
----------------------------------------------------------

🍁 సందేహం: SGT క్యాడర్ లో 24 సం|| సర్వీసు పూర్తి చేసి అర్హతలు లేనట్లయితే అట్టి ఉపాధ్యాయునికి FR- 22(b) వర్తిస్తుందా?

SGT క్యాడర్ లో 24 సం|| సర్వీసు పూర్తి చేసి అర్హతలు లేనట్లయితే సదరు ఉపాధ్యాయులకు FR-22(b) వర్తిస్తుంది. 
(చూడుడు Fin. Le. No. 3234/511/A1/HRM/2024 Dt: 18.12.2024)
----------------------------------------------------------

🍁 సందేహం: 
లోయర్ క్యాడర్ లో 24 సం.|| సర్వీసు పూర్తికాని ఉపాధ్యాయులు ఏ తేదీకి ఆప్షన్ ఇచ్చుకుంటే లాభదాయకం?
 
లోయర్ క్యాడర్ లో 24 సం.|| సర్వీసు పూర్తికాని ఉపాధ్యాయులు వేతన స్థిరీకరణ సమయంలో FR-22(b) వర్తింపజేయాలి. కావున సదరు ఉపాధ్యాయులు ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకుంటేనే ప్రయోజనకరం. ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇస్తే FR-22(a)(i) ప్రకారం ప్రమోషన్ పొందిన నెలలో ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. తదుపరి లోయర్ క్యాడర్ లో ఇంక్రిమెంట్ నెలలో మరొక ప్రమోషన్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. వార్షిక ఇంక్రిమెంట్ యధావిధిగా మంజూరు అవుతుంది.
-----------------------------------------------------------

🍁 సందేహం: 
ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ పొందిన తేదీ ఒకే నెలలో ఉన్నట్లయితే ఉపాధ్యాయుడు దేనికి ఆప్షన్ ఎంచుకుంటే లాభదాయకం?
 
ఒకే నెలలో ప్రమోషన్ తేదీ ఇంక్రిమెంట్ తేదీ ఉన్నట్లయితే సదరు ఉపాధ్యాయుడు ప్రమోషన్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకుంటే లాభదాయకం.

ఉదా: ఒక ఉపాధ్యాయునికి లోయర్ క్యాడర్లో ఆగస్టు నెలలో ఇంక్రిమెంట్ ఉన్నది. అదే నెలలో ప్రమోషన్ పొందితే సదరు ఉపాధ్యాయుడు ప్రమోషన్ తేదీకి ఆప్షన్ ఇవ్వడం వల్ల ఆగస్టు నెలలో FR-22(b) ప్రకారం రెండు ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు. తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ ఒక సంవత్సరం అనగా 1.8.2026 న మంజూరు అవుతుంది.
------------------------------------------------------------
 
🍁 సందేహం: ఒక ఉపాధ్యాయుడు జూలై నెలలో జన్మించాడు. అతడు ఆగస్టు నెలలో ప్రమోషన్ పొందినాడు. లోయర్ క్యాడర్ లో నీ యొక్క వార్షిక ఇంక్రిమెంటు నవంబర్ లో ఉన్నది. ప్రమోషన్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకుంటే రిటైర్ అయ్యే సమయంలో ఒక ఇంక్రిమెంట్ బెనిఫిట్ అవుతుంది అంటున్నారు.సమంజసమేనా?

G.O.Ma.No.235 Fin Dt: 27.10.1998 ప్రకారం ఉద్యోగ విరమణ మరుసటి నెల ఇంక్రిమెంట్ ఉన్నచో అట్టి ఇంక్రిమెంట్ ను నోషనల్ గా కేవలం పెన్షన్ ఫిక్సేషన్ కు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఎక్కువ సంవత్సరాలు సర్వీసు ఉన్న ఉద్యోగులు ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవడమే లాభదాయకం.
-----------------------------------------------------------

🍁 సందేహం:
లోయర్ క్యాడర్ లో 24 సం.|| సర్వీసు పూర్తయి అర్హతలు ఉన్న ఉపాధ్యాయుడు 24 సం.|| ఇంక్రిమెంట్ పొందకుండా ఉండి ప్రమోషన్ పొందితే ప్రస్తుత ప్రమోషన్ పోస్టులో 24 సం.|| మంజూరు చేయవచ్చునా?

చేయవచ్చును సదరు ఉపాధ్యాయుడి దగ్గర నుండి 24 సం.|| పూర్తయినట్లుగా లెటర్ తీసుకుని,నాన్ డ్రావెల్ సర్టిఫికెట్ ఆధారంగా లోయర్ క్యాడర్ లో 24 సం.|| స్కేలు మంజూరు చేసి తదుపరి FR-22(a)(i) ప్రకారం ఫిక్సేషన్ చేయాలి.