CCL


పరిహార సెలవు: (C.C.L.) 

@ ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేసిన ఉద్యోగి ఈ సెలవునకు అర్హుడు. ఈ సెలవు ఒకే సారి 7 రోజులకు మించి నిల్వయుండరాదు. సం॥లో 10రోజులకు మించి వాడుకోరాదు. ప్రభుత్వ మెమో నెం13112/58.F&Pdt:1.3.1958)

@ ఈ సెలవును పనిచెసిన దినము నుండి 6 నెలల లోపు గాని, యాజమాన్యము అనుమతించినప్పటి నుండి 6 నెలల లోపు గాని వాడుకోవాలి. పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం జీ.వో. 50 తేదీ: 1-02-1968 ద్వారా కల్పించబడినది

@ కాంపెన్సేటరీ సెలవు మామూలు క్యాజువల్ సెలవులున్నా మంజూరు చేయవచ్చు. (మెమో నెం.934 పూల్ బి/
63-2 8: 26-04-1968).