Tuition Fee Reimbursement

TUITION FEE REIMBURSEMENT




◆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 4 వ తరగతి ఉద్యోగులు మరియు నాన్-గెజిటెడ్ ఉద్యోగులందరికి ఈ సదుపాయం వర్తిస్తుంది.

◆1978 నుండి ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

◆ ఎల్‌కెజి నుండి ఇంటర్మీడియట్ / 12 వ తరగతి చదువుతున్న పిల్లలకు ఇద్దరికి మించకుండా వర్తిస్తుంది.

◆రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో మాత్రమే పిల్లలు చదువుతూ ఉండాలి.

◆ ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజు ఉండదు కాబట్టి ఆయా పాఠశాలలలో చదివే వారికి ఈ వర్తింపు ఉండదు.

◆ట్యూషన్ ఫీస్ రేయింబర్స్మెంట్ చేయమని కోరుతూ DDO కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు తో పాటుగా పాఠశాల నుండి స్టడీ సర్టిఫికెట్, పాఠశాల గుర్తింపు కాపీ,ఫీజు చెల్లింపు రసీదులను జత చేయాలి.

◆ పదవ పే రివిజన్ కమిషన్, 2015,  ట్యూషన్ ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను
 సంవత్సరానికి ఒక్కో పిల్లవాడికి రూ .1000 / - నుండి రూ .2500 / - (రూ. రెండు వేల మరియు ఐదు వందల మాత్రమే) పెంచుతూ ప్రతిపాదన చేసింది

◆తెలంగాణ రాష్ట్రం 10 వ PRC రికమండేషన్ ప్రకారం ఈ మొత్తాన్ని 2500/-కి పెంచుతూ ఉత్తర్వులు సంఖ్య 27 తేదీ 24.09.2015 విడుదల చేసింది.

◆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ PRC కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ట్యూషన్ ఫీజు రేయింబర్స్మెంట్  ఒక్కో విద్యార్థికి సంవత్సరం కి రూ.27000/-(ఇరవై ఏడు వేల రూపాయలు)ఇద్దరికి మించకుండా వర్తిస్తుంది.

@  బిల్లు TPTC Form-47 లో డ్రా చేయాలి.

@ ఇటీవల ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దీనిపై Memo.No. 9782/593/A/Admin.I/2017 తేది:23.7.2018 ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది.
@ 010 పద్దు ద్వారా జీతాలు డ్రా చేస్తున్న నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులు అర్హులు.
@ ఉద్యోగుల పిల్లలు చదివే పాఠశాల రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందియుండాలి.
@ భార్య,భర్త ఇరువురు ఉద్యోగస్థులైన ఒకరు మాత్రమే ఈ రియంబర్స్మెంట్ ను క్లయిం చేయాలి.
@ ఉద్యోగంలో ఒకరు గజిటెడ్,మరొకరు నాన్ గజిటెడ్ ఉంటే ఈ రియంబర్స్మెంట్ వర్తించదు.
@ ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటే రియంబర్స్మెంట్ వర్తించదు.
@ అకడమిక్ సంవత్సరం పూర్తయిన తరువాత ఒరిజినల్ ఫీజు రశీదులు జతచేయాలి.
@ పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అటెస్టేషన్ తప్పనిసరి.

@ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్,తెలంగాణ Memo.No.F4/565/2014 తేది:22.9.2018 ప్రకారం 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ను మాత్రమే అనుమతించాలని. తదుపరి ఉత్తర్వులు అందేవరకు 2015-16 నుండి అరియర్స్ ను అనుమతించకూడదని ఆదేశాలు జారీచేసింది.

Related GOs & Proc : 








Visit: