PRC 2020


 Telangana State PRC 2020 

    రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛన్‌దారుల వేతనాల సవరణపై ప్రభుత్వం శుక్రవారం పది (జీవో నం.51 - 60వరకు) ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,21,037 మంది ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, పింఛన్‌దారులకి 30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కానుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.13 వేల నుంచి రూ.19 వేలకు.. గరిష్ఠ వేతనం రూ.1,10,850 నుంచి 1,62,070కు పెరిగింది. 2018 జులై మొదటి తేదీ నుంచి పీఆర్‌సీ అమల్లోకి వస్తుంది. ఆ తేదీన ఉన్న డీఏ 30.392 శాతం మూలవేతనంలో కలుస్తుంది. మొత్తం 30 శాతం ఫిట్‌మెంట్‌తో కలిపి ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను ప్రభుత్వం ప్రకటించింది. 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగించేందుకు ఆదేశించింది. పెరిగిన వేతనాలు జూన్‌ నెల నుంచి (జులైలో చెల్లింపు) అందనున్నాయి. ఏప్రిల్‌, మే నెలల బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లిస్తామని పేర్కొంది.

@    2018 జులై 1 నుంచి నోషనల్‌ బెనిఫిట్‌, 2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ బెనిఫిట్‌, 2021 ఏప్రిల్‌ 21 నుంచి నగదు ప్రయోజనాలు (క్యాష్‌ బెనిఫిట్‌) అమలు చేస్తామని తెలిపింది.

@ 1.4.2020 నుంచి 31.3.21 వరకు ఉద్యోగుల బకాయిలు వారి పదవీవిరమణ తర్వాత చెల్లిస్తామంది.  

@    పింఛన్‌దారులకు 1-4-2020 నుంచి 31-5-2021 వరకు చెల్లించాల్సిన బకాయిల(ఎరియర్స్‌)ను 36 వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది.

@    70 ఏళ్లు పైబడిన పింఛన్‌దారులకు 15% అదనపు పింఛను ఇవ్వనున్నారు.

@     తాజా పీఆర్‌సీ  ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం :
    ►50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధి+ దానికి ఎనిమిది కిలోమీటర్ల పరిధి లోపల 24% హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 30 శాతంగా ఉంది)

    ►రెండు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు.. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్‌లలో 17 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. (వీటిలో ఇప్పటివరకు 20 శాతంగా ఉంది)

    ►యాభై వేల నుంచి రెండు లక్షల మధ్య జనాభా ఉన్న పెద్ద పట్టణాలు/మున్సిపాలిటీలు: ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిద్దిపే ట, జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాం డూరు, వనపర్తి, గద్వాల, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, జనగాం, కొత్తగూడెం, పాల్వంచ, జూలపల్లి, బాదేపల్లి, నస్పూర్, షాద్‌నగర్‌లలో 13 శాతం ఇస్తారు. (వీటిల్లో ఇప్పటివరకు 14.5 శాతంగా ఉంది)

    ►యాభై వేల లోపు జనాభా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాలు.. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నారాయణపేట, మెదక్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్, షామీర్‌పేట, శంషాబాద్‌లలో 13 శాతం అమలు చేస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 14.5 శాతంగా ఉంది)

    ►50 వేలకన్నా తక్కువ జనాభా ఉన్న మండలాలు, గ్రామాల్లో 11 శాతం ఇస్తారు. (ఇక్కడ ఇప్పటివరకు 12 శాతంగా ఉంది)

@    2018 జులై తర్వాత పదవీ విరమణ చేసినా 2020 పీఆర్‌సీ ప్రకారమే పింఛన్‌ అందిస్తామని వివరించింది. కనీస పింఛన్‌ను రూ.6,500 నుంచి రూ. 9,000కి పెంచింది.

@     రిటైర్‌మెంట్‌ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెరిగింది. 

@     పింఛన్‌దారుడు, కుటుంబీకుల వైద్య భత్యం నెలకు రూ.350 నుంచి రూ.600 కానుంది.

@     1.9.2004 తర్వాత నియమితులైన సీపీఎస్‌ ఉద్యోగులకు కుటుంబ పింఛను అమలు.

@    ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15,600, రూ.19,500, రూ.22,750గా ఉండనున్నాయి. వీరికి పెంచిన వేతనాలు జూన్‌ నెల నుంచే అమలవుతాయి.

DOWNLOAD :