Pension Payment Order

 PPO పై సమాచారం


💐 *పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పి పి ఓ.  అంటే AG Office నుండి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్* 

👉 *సర్వీసులో ఉండగా రిటైర్మెంట్ కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ SR తో పాటు పంపినపుడు ఎ జి ఆఫీసు వారు  పరిశీలించి మనకు పెన్షన్ మంజూరుచేస్తూ జారీచేసే ఉత్తర్వులే పిపిఓ గా అంటాం.* 

✍️ *AG office వారు మనకు పెర్సనల్ కాపీ రిజిష్టర్ పోస్టులో పంపుతారు. మరొక కాపీ SRతో పాటు డిడివోకు పంపుతారు. మన పెన్షన్ ప్రపోజల్స్ ఓ సెట్ తో పాటు మరొక కాపీ సంబందిత జిల్లా ట్రెజరీ అధికారికి, మరొక కాపీ మనం పెన్షన్ పొందే ATO/STO కార్యాలయానికి పంపుతారు.మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వులు ఇస్తారు*.

🪷 *మనపర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ వ్రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిఉంటుంది. సర్వీసులో ఉన్నవారికి SR లాగ, రిటైర్ అయినవారికి పిపిఓ ఉంటుంది. అందువల్ల మన పిపివో ను ఒక రిజిష్టర్ రూపంలో రూపొందించు కోవడం మంచిది.*

🤨 *పిపిఓ ఒక్క పేజీ ( పాతవారికి కొన్ని పేజీలు) తో రిజిస్టర్ ఏంటీ ? అనుకుంటున్నారా?*

👉 *ఎలా రిజిష్టర్ గా తయారు చేయవచ్చు? చూద్దాం!!*

✍️ *ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు, రిటైర్ అయినతేది, హోదా, కార్యాలయం - రిటైర్ అయినప్పటి పే, పే స్కేల్, గ్రేడు, చిరునామా, పుట్టిన తేది, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెం, ఆధార్ నెంబరు, పాన్ నెంబర్, బ్లడ్ గ్రూప్, బ్యాంకు ఖాతా నెంబరు, బ్రాంచ్ వంటి పర్సనల్ డిటైల్స్   వివరాలు టైప్ చేసిగాని అందంగా వ్రాసి గాని పెట్టండి.*

🪷 *మన పిపిఓ ఆర్డర్ ముందు, వెనుక ఒక దళసరి పోలధిన్ పేపర్  పెట్టండి. తరువాత ఓ పది A4 సైజ్ కాంక్వెస్టు పేపర్లు / తెల్లకాగితాలు పెట్టండి* 

💐 *మీ ఆధార్, పెన్షన్ బ్యాంకు పాస్ బుక్ మొదటి రెండు పేజీలు, పేన్ కాపీ, EHS కార్డు స్కేన్ / జెరాక్సు కాపీలు పెట్టండి.*

💐 *మీ స్పవుజ్ ఆధార్ , పాన్ ,EHS కార్డు  స్కేన్ /జెరాక్సు కాపీలు పెట్టండి.*

💐 *తరువాత ఓ నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్బుక్ గా తయారు చేయించి మన వద్ద బద్రంగా ఉంచండి.*

 🧚‍♂️ *ఈ పిపిఓ రిజిష్టర్ ఉపయోగం ఏమిటి?* 

💐 *రివైజుడ్ పెన్షన్ ఫిక్సేషన్, పి ఆర్ సి ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్ లో రికార్డు చేసే వీలుంది.* 

💐 *పెన్షనర్ తదనంతరం ఫేమలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పిపివో ఒరిజనల్ ఇవ్వమని అడుగుతారు.* 

 💐 *మనం ఏదేని కారణంతో పిపివో కోల్పోతే  యస్ టి వో ద్వారా డిటివో గారికి  నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పిపివో పొందేవీలుఉంది.* 

💐 *PPO లో  ఏ అంశాలుంటాయి?*

💐 *అందరు సర్వీసు పెన్షనర్లు తమ పిపివో  ను ఓ సారి పరిశీలించుకోవాలి. అందు* 

🪷 *1.సర్వీసు పెన్షనర్ గా మన పేరు, పుట్టినతేదీ నమోదు చేయబడి ఉంటాయి. అవి సరిగా నమోదయిందా? లేదో పరిశీలించండి.*

🪷 *2) మన PPO లో Spouse / Family Pensioner పేరు, పుట్టిన తేదినమోదయి ఉంటుంది ఆవివరాలు  కరెక్టుగా ముద్రించబడిందా? లేదా? పరిశీలించండి.*

🪷 *3) PPO లో Spouse / Family Pensioner date of birth  note చేయబడి ఉంటుంది. ఉందా? అది కరెక్ట్ గా ఉందా? లేదా?"*

🪷 *4) మన పిపివో లో Service Pension (SP), Enhanced Family Pension (EFP), Family Pension అనే మూడు అంశాలు, వాటి ఎదురుగా వచ్చు మొత్తం నోట్ చేయబడి ఉంటుంది. అవికూడా గమనించండి!!*
వాటిగురించి చూద్దాం.

✍️ *1.Service Pension (SP) ఇది మనలెంక్త్ ఆఫ్ సర్వీసు, బేసిక్, పే ఆధారంగా నిర్ధారించబడుతుంది. సర్వీసు పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత కల అలవెన్సులు చెల్లింపబడతాయి . PRC అమలైనప్పుడు మన Service Pension (SP) రివైజ్ కాబడుతుంది.*

💐 *2. Enhanced Family Pension (EFP)ఉద్యోగి/ సర్వీసు పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్ కు ఇచ్చేది Enhanced Family Pension. వివరంగా ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేక పెన్షనర్ గా ఉండగా మరణించినా వారి వారసులకు కొంతకాలంపాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు.*  *రిటైర్మెంట్ వయస్సు 58 గా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ( ఏదిముందైతే అది) వచ్చేవరకు, రిటైర్ అయి సర్వీసు పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు ( ఏదిముందైతే అది) వచ్చేవరకు  Family Pensioner కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. దీనినే Enhanced Family Pension అంటాం. అది ఎప్పటివరకూ చెల్లింపబడేది PPO లో రికార్డు చేయబడి ఉంటుంది. 2020 PRC లో కూడా దీనిని నిర్ధారిస్తూ  ప్రభుత్వం సర్కులర్ మెమో జారీ చేసింది.*

🪷 *3.Family Pension. సర్వీసు పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేది Family Pension . దీనిపై డి.ఆర్ . / ఐ.ఆర్ వంటివి చెల్లింపబడతాయి. సర్వీసు పెన్షనర్స్ లానే వీరికి కూడా PRCలలో  బేసిక్ పెన్షన్  రివైజ్బూ చేయబడతాయి. Family Pensioner కు కూడా వారి వయస్సు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించబడుతుంది.*

👏 *ఈ అంశాలు మీ PPO లో కరెక్ట్ గా ఉంటే సంతోషం.*

✍️ *కరెక్ట్ గా లేకపోతే ఏమౌతుందిలే అనే ధోరణి వద్దు. వాటిని సరి చేయించుకోవలసిందే. లేనిచో మన తదనంతరం వారికి ఫ్యామిలీ పెన్షన్ రావడంలోగాని, AQP మంజూరు విషయంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.*

👉 *ఉదాహరణకు ఇటీవల ఓ సర్వీసు పెన్షనర్ మరణించారు. వారివారసులు STO గార్ని కలసి ప్యామలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు. STO. PPO చూడగా సామ్రాజ్యం అని పేరుంది. ఆధార్ లో, ఆస్తులలో, బ్యాంక్ ఖాతాలో వారిపేరు సాంబమ్మ గా ఉంది. కావునా చెల్లదని PPO లో పేరు మార్పుకోరుతూ AG Office కు దరఖాస్తు చేసుకోవసలిందిగా సూచించారు.*

*మనవారసులకోసం మనం ఉండగానే  ఇటువంటివి సరిచేయించుకోవడం ఉత్తమం. సులువు కూడా!!*

👉 *Spouse / Family Pensioner పేరు సరిగా లేకపోతే  తగిన ఆధారాలతో మనం చివరరిటైర్ అయిన చోట DDO ద్వారా PPO లో పేరు సరి/ నోట్ చేయమని దరఖాస్తుతో బాటు SR, Original PPO AG Office కు దరఖాస్తు పంపి సరి చేయించుకోవాలి.*

👉 *Date of Birth. విషయం లో Spouse / Family Pensioner యెక్క Date of Birth పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి. అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది. గతంలో  2005 కు పూర్వం Spouse పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేది వేయక పోవడం లేదా సుమారుగా వయస్సు వేయడం చేసేవారు. అందువల్ల PPO లో పుట్టిన తేది చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం ఉంది. Date of Birth నోట్ కాకపోయినా, తేడా పడినా సంబంధిత దృవపత్రాలు అనగా స్టడీ సర్టిఫికెట్, ఆధార్, పాన్, వైద్యుడు దృవీకరించిన వయస్సు దృవపత్రం వంటివాటిని  జతచేసి పిపివో నకలు జతచేసి సంబంధిత యస్ టివో గారిని కోరితే నమోదు చేస్తారు. లేదా ifms లో TS Treasury Sites లో ఒక incident raise చేస్తే సరి చేస్తారు. ఇవి సర్వీసు పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవడం అవసరం.*

👏గమనిక- *మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపుసమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన తేది తరువాత మార్పు చేయాలనుకుంటే చెల్లదు. అలా మార్పు చేసి AQP పొందిన చాలామంది FP లు రికవరీలు చెల్లించిన సందర్భాలున్నాయి. కావున ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి.*

👉 *పెన్షనర్స్ వారి PPO లో spouse పేరు తేడా పడినా/ స్పెల్లింగ్ తేడా పడినా/ సర్ నేమ్ మాత్రమే ఉంది అసలు పేరు నమోదు కాబడపోయినా/  spouse  Date of Birth అసలు నమోదు కాబడపోయినా/ తేడా పడినా వీటిని పిపివో లో సరి చేయించుకోవాలి.*

👉 *మనం  రిటైర్మెంట్ కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ SRతో జతచేసి HOD ద్వారా AG/ State  Audit Office కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. అలా పంపే ప్రపోజల్ల్స్ లో  Spouse పూర్తిపేరు, DOB ఆధార్ /PAN/ TCలేదా Study Certificate లలో ఒకేవిధంగా ఉండే విధంగా చూసుకోవాలి. SR లో Family Members Details పూర్తివివరాలతో నమోదు చేయించుకోవాలి. వీటిఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్ లో డిస్క్రిప్ట్వ్ రోల్సు తయారుచేయడం జరుగుతుంది.*

👉 *కావున PPO లో పేరు DOB తేడా గా నమోదైన వారు వారివారి S R,  Pension proposals లో ఉన్న వివరాలు ppo లో వివరాలతో పోల్చి చూడండి.*

*👉ఈక్రింది రెండు అంశాలు చూడండి*

☝️1) *మీరుపంపిన Pension proposals లో కరెక్ట్ గా ఉండి PPO లో తేడాగా నమోదై ఉన్న చో  మీరు ఆ వివరాలను తెలియచేస్తూ ఒక లెటర్ AG గారిని ఉద్దేశిస్తూ వ్రాసి మీ ఒరిజనల్ SR, PPO, మీవద్ద ఉన్న Pension proposal set xerox attach చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా ఋజుమార్గంలో AG Office హైదరాబాద్ కు పంపుకోవాలి. వారు వెరిపై చేసి సరి చేసి revised PPO పంపుతారు.*

☝️2) *ఒకవేళ మీరు పంపిన Pension proposals లోనే మీ Spouse పేరు గాని DOB గాని తేడాగా వ్రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియచేస్తూ ఒక లెటర్ AG గారిని ఉద్దేశిస్తూ వ్రాసి  మీ ఒరిజనల్ పిపివో జతచేసి, మీ SR లో  మీ DDO గారిచే Family members details enter  చేయించి, మీ Spouse name, Date Of Birth వివరాలు ఒకేవిధంగా ఉన్న TC / Study certificate, Aadhar, PAN xerox  Attested కాపీలు జతచేసి, Discripitive rolls మూడు కాపీలు తయారుచేసి జతచేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా ఋజుమార్గంలో AG Office హైదరాబాదుకు పంపుకోవాలి. వారు వెరిపై చేసి సరి చేసి revised PPO పంపుతారు.*

☝️3) *ఒక వేళ మీ spouse పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మరోపేరు పెట్టుకొని ఆపేరు PPO లో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ అఫిడ్ విట్, దినపత్రికలలో ప్రకటన, గజిట్ పబ్లికేషన్ కాపీలు SR కు జతచేసి HOD ద్వారా ఋజు మార్గంలో AG కి మీ దరఖాస్తు ద్వారా పంపాలి.*

☝️4) *Service pensioner spose death అయి Re marrage చేసుకుంటే సదరు భార్య పేరును PPO లో ఎంటర్ చేయుటకు First wife death certificate, Remarrage registration certificate 2nd wife name & Date of Birth వివరాలు* *ఒకేవిధంగా ఉన్న TC / Study certificate, Aadhar, PAN xerox  Attested కాపీలు జతచేసి, Discripitive rolls* *మూడు కాపీలు తయారుచేసి జతచేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా ఋజుమార్గంలో AG Office హైదరాబాదుకు పంపుకోవాలి. వారు వెరిపై చేసి సరి చేసి revised PPO పంపుతారు.*

☝️5) *మీ Spouse name Date of Birth correct గా మీ PPO లో నమోదై ఉండి మనకు cfms నుండి మంత్లీ జారీచేయబడే Payslips లో పేరు తేడా పడినా పుట్టిన తేది నమోదు కాకపోయినా  మీసంబంధిత STO గారికి సదరు తేడాలు PPO ప్రకారం సరి చేయమని లేఖవ్రాసి PPO, Spouse Aadhar / Pan Study certificate xerox కాపీలు జతచేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు. వారు పరిశీలించి సరి చేస్తారు.*