FAQ

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న: నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?
జవాబు: వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.

ప్రశ్న: నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను.ఇంటర్,డిగ్రీ,హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు.HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు.ఎందుకని??
జవాబు: మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.


ప్రశ్న: ఒకే విద్యా సంవత్సరం లో రెండు కోర్సులు చేయవచ్చా?
జవాబు: ఒకే విద్యా సంవత్సరం లో ఒక రెగ్యులర్ కోర్సు,ఒక దూర విద్యా కోర్సు చేయటానికి అనుమతి ఇవ్వండి,అంతేగానీ రెండు రెగ్యులర్ కోర్సులు చేయడానికి అనుమతి ఇవ్వవద్దని యూజీసి 28.12.12 న అన్ని యూనివర్సిటీ లకి లేఖ రాసింది.

ప్రశ్న: నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను.నాకు పెన్షన్ ఎంత వస్తుంది??
జవాబు: చివరి ములవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.

ప్రశ్న: ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని ELs జమచేయబడతాయి?
జవాబు: వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.

ప్రశ్న: మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??
జవాబు: సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.

ప్రశ్న: FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా?
జవాబు: FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.

ప్రశ్న: నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??
జవాబు: జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.*

ప్రశ్న: నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు?
జవాబు: SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.

***********

1. Voluntary Retirement (VR)  తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?
Ans: VR తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి VR అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.

2. VR  ఏయే కారణాలపై తీసుకోవచ్చు?
Ans: వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.

3. ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత VR తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?
Ans: 20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే VR కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.

4. ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక VR తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?
Ans: క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.

5. Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి VR కి దరఖాస్తు చేయవచ్చా?
Ans: Yes.


6. Medical Leave లో ఉండి,  స్కూల్లో జాయిన్ అయ్యాకే VR కి అప్లై చేయాలా? సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?
Ans: సెలవులో ఉండి  VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.

7. అక్టోబర్ 2018 నుంచి VR తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?
Ans: 11 వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!

8. VR తీసుకున్న తర్వాత GI కంటిన్యూ చేయవచ్చా? GI అమౌంట్ ఎంత వస్తుంది?
Ans: VR తవ్వాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.

9. చివరగా ఒక ప్రశ్న. 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య VR తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?
Ans: వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా VR తీసుకుంటే....
నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్
20>37.87% (చివరి మూలవేతనంలో)
21>39.4%
22>40.9%
23>42.4%
24>43.93%
25>45.45%
26>46.97%
27>48.48%
28>50%
(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది.                                                        సందేహాలు  --    సమాధానాలు

ప్రశ్న:భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు.ఒకరు రిటైర్మెంట్ అయ్యారు.పెన్షన్ వస్తుంది. రెండవ వారు మరణించిన వారి వారసులకి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారా??
జవాబు: మెమో.3548 ;GAD; తేదీ:24.3.12 ప్రకారం ఒకరికి పెన్షన్ వచ్చుచున్నందున కారుణ్య నియామకం వర్తించదు.

ప్రశ్న:-ఒక ఉద్యోగిని ఎంత కాలం సస్పెన్షన్ లో ఉంచవచ్చు?
జవాబు:-జీఓ.526 : GAD; తేదీ:19.8.08 ప్రకారం ఒక ఉద్యోగిని 2 సంవత్సరం లకి మించి సస్పెన్షన్ పీరియడ్ లో ఉంచకూడదు.

ప్రశ్న:ఒక మహిళా ఉద్యోగికి వివాహం కోసం డబ్బులు ఏమైనా అప్పుగా ఇస్తారా???
జవాబు:జీఓ.39 ; ఆర్థికశాఖ; తేదీ:15.4.15 ప్రకారం 75000/- అప్పుగా ఇస్తారు. దీనిని 70 వాయిదా లలో తిరిగి చెల్లించాలి.*

ప్రశ్న:-ప్రత్యేక ఆశక్తత సెలవులో ఉన్న వారికి జీతభత్యాలు ఎలా చెల్లించాలి?
జవాబు:-120 రోజుల వరకు పూర్తి జీతం,మిగిలిన కాలానికి సగం జీతం చెల్లిస్తారు.

ప్రశ్న:కమ్యూటెడ్ సెలవును హాఫ్ పే లీవ్ గా మార్చుకోవచ్చా?
జవాబు:జీఓ.143 తేదీ:1.6.68 ప్రకారం వీలులేదు.

ప్రశ్న;-బీసీ క్రిమిలేయర్ పరిధిలోకి ఎవరు వస్తారు?
జవాబు:-కేవలం గ్రూప్--1&11 సర్వీసులో ఉన్న ఉద్యోగులు మాత్రమే వస్తారు.టీచర్లు క్రిమిలేయర్ పరిధిలోకి రారు మరియు 6 లక్షల ఆదాయం కలిగిన బీసీ ఉద్యోగుల0దరూ క్రిమిలేయర్ పరిధిలోకి రారు.*

ప్రశ్న : PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి??
జవాబు:PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.

ప్రశ్న:-నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి జరుగుతుంది??
జవాబు:-మెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒక సారి పదోన్నతి తిరస్కరించవచ్చు.ఐతే జీఓ.145 ; జీఏడి ; 15.6.04 ప్రకారంమరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చరు

ప్రశ్న:స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??
జవాబు:-స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.

ప్రశ్న:సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??
జవాబు:సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.

ప్రశ్న:-ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా?
జవాబు:-అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.

ప్రశ్న:LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??
జవాబు:LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.

ప్రశ్న: UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?
జవాబు: FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.

ప్రశ్న: SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా?*
జవాబు: DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.

ప్రశ్న: మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీఅ0బర్సుమెంట్ వర్తిస్తుందా?
జవాబు: APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.

ప్రశ్న: నాకు మొదటి సారి అమ్మాయి.తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా?
జవాబు: జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.

ప్రశ్న: అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు.వాస్తవమా?? కదా?
జవాబు: జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు.అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.

ప్రశ్న : ఉన్నత విద్య కోసం DEO అనుమతి తో డెప్యూటషన్ లో ఉన్న SC, ST టీచర్స్ కు AGI మంజూరు చేయవచ్చా?
జవాబు:మంజూరు చేయవచ్చు.
GO. no.342 dt:30.08.1977 ద్వారా ఉన్నత విద్య కోసం ఇచ్చిన డెప్యూటషన్ కాలం onduty గానే పరిగణిస్తారు

ప్రశ్న : సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చు ?
జవాబు : సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు  అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No122 తేది:11-04-2016)

 ప్రశ్న : మరణించిన ఫ్యామిలి మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చు ?
జవాబు : మరణించిన ఫ్యామిలి మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.20,000 ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు.  పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు.(G.O.Ms101తేది: 21-04-2015)
 ఫ్యామిలి పెన్షనర్ చనిపోతే కుటుంబంలో ఎవరూ లేనిచే వారసులకు చెల్లిస్తారు.(G.O.Ms.No.136 తేది:29-06-2011)

 ప్రశ్న : కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వరిస్తుందా ?
జవాబు : వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
(G.O.Ms.No.87 తేది:28-02-2004)

 ప్రశ్న : ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు ?
జవాబు : ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు  నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No.38 తేది:28-05-2013)

ప్రశ్న : ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?
జవాబు: వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు.అయితే ప్రభుత్వ  Cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా) తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు.ఆ తరువాత ఇక చేర్చరు

ప్రశ్న: నేను జులై 14 న ఉద్యోగంలో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి?
జవాబు: జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.

ప్రశ్న: నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి?
జవాబు: FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.


ప్రశ్న: డైస్ నాన్ కాలం అంటే ఏమిటి?
జవాబు: FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.*
FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.

ప్రశ్న: అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడుకి ఇప్పించవచ్చునా?
జవాబు: టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.*
కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహించలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.

ప్రశ్న:నేను,నా భార్య ఇద్దరం టీచర్లం.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా?
జవాబు:చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.

ప్రశ్న: EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా?
జవాబు: EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.*
కానీ వ్యక్తిగత కారణాల తో EOL ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా EOL కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.*

ప్రశ్న:నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి?
జవాబు: FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.*

ప్రశ్న: నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..?
జవాబు: మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.*
GO MS No:262, Dt:25-8-1980.
ప్రశ్న: వేసవి సెలవులలో ఎంఇఓ కార్యాలయంలో సర్వీసు రిజిష్టర్, బిల్లులు చేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవు వస్తుందా?_
జవాబు: బిల్లులు, ఎస్ఆర్ ల బాధ్యత ఉపాధ్యాయులది కాదు. కాని వేసవి సెలవులలో మీ ఎంఈవో  ఆ విధమైన డ్యూటీ చేయమని ఉత్తర్వులు ఇస్తే
జీవో 35; తేదీ. 16.01.1981  ప్రకారం మీకు సంపాదిత సెలవు జమచేయవలసి ఉంటుంది._

ప్రశ్న: హైస్కూల్ ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తే హెచ్ఎం అలవెన్స్ ఇస్తారా?
జవాబు: ఎఫ్ఆర్ *49* ప్రకారం ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయుడిగా *15* రోజులు అంతకన్నా ఎక్కువ కాలం పనిచేస్తే ఎఫ్ఏసి అలవెన్స్ మంజూరు చేయబడుతుంది.

ప్రశ్న: ఒకే డీఎస్సీకి చెందిన *A, B* అను ఇరువురు ఉపాధ్యాయులలో *A* అను ఉపాధ్యాయుడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పదోన్నతి రిలింక్విష్ చేశారు,  *B* పదోన్నతి స్వీకరించారు.  తదుపరి  *A*   పదోన్నతి పొందారు.  *B* ఉపాధ్యాయుడు  *A*  ఉపాధ్యాయుడితో  *స్టెప్ అప్* పొందవచ్చునా?
జవాబు: అవకాశం లేదు.  సీనియర్ అయిన ఉపాధ్యాయుడు ప్రస్తుత కేడర్ లో మరియు ఫీడర్ కేడర్ లో రెండింటిలోను సీనియర్ అయివుండాలి._

ప్రశ్న: ఏ.పీ.జి.ఎల్.ఐ  పెంపుదలకు ఏ సర్టిఫికెట్లు జతచేయాలి. ఎంత వరకు పెంపుదల చేసుకోవచ్చు._
జవాబు: మూలవేతనంలో  *20%*  వరకు పెంపుదల చేసుకోవచ్చు. మీ మూలవేతనం ప్రకారం చెల్లించవలసిన మొత్తం చెల్లించేటట్లయితే ఎలాంటి సర్టిఫికెట్లు జతపరచనవసరం లేదు. అంతకుమించి పెంచుకొనేటట్లయితే *"గుడ్ హెల్త్ సర్టిఫికెట్"* జతచేయవలసి ఉంటుంది.

ప్రశ్న: *నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12 సం.లు సర్వీసు పూర్తి చేసితిని 12 సం.లు స్కేలు రావడానికి నేను EOT, GOT పరీక్షలు పాస్ అయ్యాను. నాకు12 సం.లు ఇంక్రిమెంట్ ఏ తేదీ నుంచి ఇస్తారు?
సమాధానం: *ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12 సం.లు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT, GOT పరీక్షలు వ్రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేస్తారు.


ప్రశ్న: *నాకు 50 ఇయర్స్ దాటినవి. నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?
సమాధానం: *G.O.Ms.No.93, Dt.03.04.2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది. అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12 సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT, GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.

ప్రశ్న : హిస్టరెక్టమి' ఆపరేషన్ అనంతరం కేన్సర్ అని తేలినది. రోజులపాటు వైద్య కారణాలపై సెలవులు సమ
మరికొన్నిపొడిగించుకోవచ్చునా ?
సమా॥| అవును జోడించుకోవచ్చును. A.P. Leave Rules లోని Rule 6 ఈ విధంగా సూచిస్తున్నది. Leave may be granted in combination or continuation of already taken leave whether the same kind or other kind
of leave admissible under these rules.

ప్రశ్న : | నేను 2006 డి.యస్.సి. ఉపాధ్యాయుడను. నేను 2015లో 61రోజులపాటు జీతనష్టపు సెలవు పెట్టాను. ఆ
కాలానికి అర్థవేతన సెలవులు జమ అవుతాయా ?
సమా :  ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలలోని రూల్ 13(a) ప్రకారం సర్వీసులో dies-non కాలానికి తప్ప అన్ని రకాల
వేతన సెలవులు జమఅవుతాయి.

ప్రశ్న : మా పెదనాన్న ప్రభుత్వ ఉద్యోగి, చెల్లెలు ఇన్సర్వీస్ B.Ed చేయడానికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందవచ్చునా ?
సమా॥ వీలులేదు. తాత లేక తండ్రి ఉద్యోగస్థులయితే ఉద్యోగికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొంది ఇన్సర్వీస్ B.Ed. చేయడానికి వీలుపడదు. కాని ప్రస్తుత తరంలో .ఎంతమంది అన్నదమ్ములు ఉద్యోగస్థులు ఉన్నప్పటికీ వారందరికి ఈ అవకాశం ఉంటుంది.

సం|| 1-9-2004 కంటే ముందు ప్రభుత్వ సర్వీసులో ఉండి వేరొక కొత్త ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగులను A.P Revised Pension Rules-1980 క్రింద పరిగణిస్తారా (లేదా) నూతన పెన్షన్ క్రింద పరిగణిస్తారా ?
సమా : రెండు ఉద్యోగాలలో ఒకే రకమైన నియమ నిభందనలు అమలులో ఉన్నట్లయితే అట్టి ఉద్యోగులకు APRPR - 1980 వర్తిస్తాయి .

ప్రశ్న: *SGTలలో 50 సం.లు దాటినవారు EOT, GOT పాస్ కాకుండా 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?
సమాధానం: *కారు. వారు కూడా G.O.Ms.No.93, Dt.03.04.2010 ప్రకారం అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ప్రశ్న: నా భార్య టీచర్. ఆమె మరణించినది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఎవరు పొందుతారు?
సమాధానం: భార్యాభర్తలు ఇద్దరూ టీచర్లు అయి, భార్య మరణించిన సందర్భంలో భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు & పెన్షన్ భర్త తీసుకోవచ్చు.  అలా కాకుండా భార్య మరణించిన తరువాత సమర్పించే ఫారాలు లో నామినీ గా కొడుకు పేరు రాస్తే (కొడుకు కి 18 సంవత్సరం లు పైన ఉండాలి) భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు మొత్తం కొడుకు తీసుకుంటాడు.

ప్రశ్న :  నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గ్రేడ్-I॥ప్రిన్సిపాల్ గా పనిచేయుచున్నాను. నాకు 7-5-2018 నాడు Censure' అవార్డు చేశారు. అందువల్ల గ్రేడ్ - I ప్రినసిపాల్ ప్రమోషన్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం తరువాత ప్రమోషన్ .కోసం దరఖాస్తు చేసుకొనవచ్చునా ?
సమా: G.O.Ms. No. 53, GAD, తేది : 4-7-1997 ప్రకారం Censure శిక్ష ప్రభావం కేవలం ఒక సంవత్సరం మాత్రమే
ఉంటుంది. మీరు ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకో వచ్చును. తదుపరి ఎప్పుడు ప్రమోషన్ చేపట్టినా మీకు ఇవ్వవలసి ఉంటుంది.

ప్రశ్న :  మా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు అక్టోబర్ లో పదవీ విరమణ గా వించబోతున్నారు. ఆమె
ఖాతాలో 500 అర్థవేతన సెలవులున్నాయి. పదవీ విరమణ సమయంలో వీటిని నగదుగా మార్చుకొనవచ్చునా ?
సమా :  మార్చుకోవచ్చును. రాష్ట్ర ప్రభుత్వం G.O.MS. No. 109, Finance, తేది : 29-7-2015 ద్వారా అర్థవేతన సెలవులను నగదుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. అయితే రోజుల పరిమితికి లోబడి లెక్కిస్తారు.
అర్థవేతన సెలవు పొందడానికి సూత్రం  =  పదవీ విరమణ తేదికి అర్థవేతనం + అర్థవేతనంపై ఆ రోజుకు చెల్లిస్తున్న DA/30 X అర్థవేతన సెలవులు.

ప్రశ్న : నా వయస్సు 54 సం.లు, B.Sc. TTC అర్హతలతో 2006 నుంచి LFL HM గా పనిచేస్తున్నాను. 2018 సంవత్సరంలో 12 సంవత్సరముల స్కేలు పొందడానికి అర్హత ఉన్నదా ?
సమా :  లేదు. ఆటోమాటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ఉత్తర్వులు G.O.MS No. 38, ఆర్థిక, తేది : 15-4-2015 ప్రకారం SPP - (A) (సం.) స్కేలు మంజూరు చేయాలంటే తదుపరి ప్రమోషన్ పోస్టుకు  అవసరమైన విద్యార్హతలు కలిగి యుండాలి. (LFL HM) తదుపరి ప్రమోషన్ పోస్టు (హైస్కూల్ HM) ప్రమోషన్ పొందాలంటే B.Ed. ఉండాలి. మీకు B.Ed. లేదు కనుక 12 సంవత్సరముల స్కేలు పొందే అర్హత లేదు.

సందేహాం:
B.Sc.B.Ed అర్హతలతో SGT గా నియామకం కాబడి SA (ఫిజికల్ ఎడ్యుకేషన్) ప్రమోషన్ అర్హతలైన B.PEd కి ఇన్ సర్వీసులో ఆన్ డ్యూటీ పై వెళ్ళడానికి అవకాశం ఉంటుందా?
సమాధానం:
DSE ఉత్తర్వులు Rc.No.3596/Ser-4-3/2016 తేది: 27.1.2016 ప్రకారం తదుపరి ప్రమోషన్ పోస్టుకు అర్హత గల సందర్భాలలో ఇన్ సర్వీసులో మరొక కోర్సుకు ఆన్ డ్యూటీపై వెళ్లడానికి అవకాశము లేదు.

 సందేహం:
అనారోగ్య కారణాలతో దీర్ఘకాలికంగా మంజూరుచేసే ప్రత్యేక అర్ధవేతన సెలవును చికిత్స కొరకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చా? లేక 6 నెలలు ఒకే దఫా వినియోగించుకోవాలా?*

✳ సమాధానం:
G.O.Ms.No.234 F&P తేది: 29.08.1975
G.O.Ms.No.386 F&P తేది: 06.09.1976
G.O.Ms.No.590 F&P తేది: 06.08.1980 మరియు
1933 సెలవు నిబంధనలు రూలు 28 మరియు 29 ల ప్రకారం వైద్య నిపుణుల సిఫారసు మేరకు కొన్ని దీర్ఘకాలిక చికిత్సలు అవసరమైన వ్యాధులకు, చికిత్స కొనసాగుతున్న సమయంలో  నిల్వయున్న అర్ధవేతన సెలవులను మొత్తంగా 6 నెలలకు మించకుండా వినియోగించుకుని పూర్తి వేతనం పొందవచ్చు. 6 నెలలు ఒకే దఫా వినియోగించుకోవాల్సిన అవసరం లేదు.

For More FAQ available at --------------->     GOs DIARY