Surrender Leave


సరెండర్ లీవు (Surender Leave)

సరెండర్ లీవు (Surrender Leave) కు సంబంధించిన నియమాలు :

     నిర్వచనం: ఆర్జిత సెలవు (Earned Leave) ఖాతాలో నిలువ ఉన్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి, దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను “సరెండర్ లీవ్” అంటారు.

    అర్హత: ఈ సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, మరియు నాలుగవ తరగతి ఉద్యోగులకు వర్తిస్తుంది. అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది.

    సెలవుల పరిమితి మరియు గ్యాప్: ఒక సంవత్సరానికి 15 రోజుల చొప్పున గాని, లేదా రెండు సంవత్సరాలకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేయవచ్చు. దీని కోసం 12 లేదా 24 నెలల విరామం (గ్యాప్) ఉండాలి.

    నగదు చెల్లింపు విధానం: సరెండర్ సెలవు జీతాన్ని నెలవారీ పద్ధతిపై లెక్కించాలి. నెలలో ఎన్ని రోజులు ఉన్నా (28/29/30/31), ఒక నెలకు 30 రోజులుగానే పరిగణించి నగదు చెల్లిస్తారు.

    వేతనం మరియు అలవెన్సులు: సరెండర్ లీవు కాలానికి పూర్తి వేతనం మరియు ఇతర అలవెన్సులు మంజూరు చేయబడతాయి, కానీ IR (Interim Relief) చెల్లించబడదు. ఇంటి అద్దె అలవెన్సు (HRA) కూడా లభిస్తుంది.

    మినహాయింపులు: సరెండర్ లీవు జీతం నుండి GPF అడ్వాన్సు, ప్రభుత్వ అడ్వాన్సులు లేదా సహకార సంస్థల బాకీలను మినహాయించకూడదు.

    దరఖాస్తు మరియు మంజూరు:   ఉద్యోగి దరఖాస్తు చేసిన తేదీ నుండి మాత్రమే సరెండర్ లీవును అనుమతించాలి, అంతకు ముందు తేదీ నుండి అనుమతించకూడదు.   ఉపాధ్యాయులకు సంబంధించి, ఆర్జిత సెలవును మంజూరు చేసే అధికారియే సరెండర్ లీవును కూడా అనుమతించవచ్చు.

    ముఖ్యమైన గడువు: సరెండర్ లీవు మంజూరైన 90 రోజుల లోపల బిల్లును నగదు కోసం సమర్పించాలి. లేనిపక్షంలో మంజూరైన ఉత్తర్వు రద్దవుతుంది.

    పదవీ విరమణ: పదవీ విరమణ తేదీకి సమీపంలో ఉన్న వారికి కూడా దీనిని మంజూరు చేయవచ్చు, అయితే మంజూరైన తేదీకి మరియు విరమణ తేదీకి మధ్య కనీసం 30 రోజుల డ్యూటీ పీరియడ్ ఉండాలి.

    నమోదు: సరెండర్ లీవు వివరాలను ఉత్తర్వు సంఖ్యతో సహా ఉద్యోగి సర్వీసు పుస్తకంలో మరియు ఆర్జిత సెలవు పట్టికలో ఎర్ర సిరాతో నమోదు చేసి అటెస్ట్ చేయాలి.

***
Frequently Asked Questions 

@    సరెండర్  లీవ్  అంటే ఏమిటి  మరియు ఎవరు అర్హులు ?

    ఆర్జిత సెలవు (Earned Leave) ఖాతాలో నిలువవున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు రూపేణా పొందుటను “సరెండర్ లీవ్” అంటారు. ఈ సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, మరియు నాలుగవ తరగతి ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.

@    సరెండర్ లీవ్  కింద ఎన్ని రోజులు సెలవులను సరెండర్ చేయవచ్చు  మరియు గ్యాప్ ఎంత ఉండాలి ?

    ఒక సంవత్సరానికి 15 రోజుల చొప్పున గాని, లేదా రెండు సంవత్సరాలకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేయవచ్చు. 15 రోజులు సరెండర్ చేస్తే 12 నెలల విరామం, 30 రోజులు సరెండర్ చేస్తే 24 నెలల విరామం (గ్యాప్) ఉండాలి.    

@ఖాతాలో మిగిలిఉన్న అర్జిత సెలవులను సరెండర్ చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది
(G.O.Ms. No. 418, dt: 18-4-1979)


@ ప్రతి ఆర్థిక సం లో 15 రోజులకు మించకుండా లేదా రెండు ఆర్థిక సంవత్సరముల కు ఒక పర్యాయము 30 రోజుల సరెండర్ చేసుకొనవచ్చును.

    (In respect of the employees who are having 286 days and above of E.L. to their credit as on 30th June of every year, they are permitted to surrender without following the gap of 12 months.)

@ సెలవులు ప్రతినెలా సరైండర్ చేయుట కోసం ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు.


@నెలలో ఎన్ని రోజులున్నా 30 రోజులు గానే పరిగణించి సరెండర్ లీపును నిర్ణయిస్తారు
(G.O.Ms. No. 306. F& P. dt 8-11-1974)

DOWNLOAD :