TSGLIT.S.GOVERNMENT LIFE INSURANCE

(రివైజ్డ్ స్కేల్స్ ననుసరించి టి.ఎస్.జి.ఎల్.ఐ రేట్లు - రూల్స్)

1).  |ప్రభుత్వం, G.O.MS.No.92 , Fin.  తేదీ: 16.08.2021 ద్వారా TSGLI ప్రీమియం స్లాబ్ రేటు క్రింద తెలిపిన విధంగా తేదీ: 1.8.2021 నుండి పెంచబడినది.

 ఈ స్లాబు రేటు ప్రకారమేకాక Maximum రు.20,000/- లేదా బేసిక్ పే పైన 20% వరకు ఏది తక్కువగా ఉంటె అది  ప్రీమియం చెల్లించవచ్చు (జివో నె౦. 92 , తేది : 16.08.2021 , జీవో నెం. 26, తేదీ: 22.2.1995), మున్సిపల్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు TSGLI స్కీమును వర్తింపచేస్తూ GO.Ms.No. 25, తేదీ: 3.3.2011న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.


 2).  19 సం.ల పైన 56 సం. లోపు వయసు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు, 10సం. సర్వీసు పూర్తిచేసిన వర్క్ ఛార్జ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమ జీతాల నుండి జీవో మేరకు ప్రీమియం రికవరీ చేసి కొత్తగా గానీ, అదనముగా గానీ ప్రతిపాదన ఫారములు (Proposal Forms) సమర్పించి (56 సంల లోపు  వారు మాత్రమే) పాలసీలు పొందాలి. అయితే 56 సం॥ల వరకు కొత్తగా లేక అదనపు ప్రీమియం చెల్లించడానికి అవకాశము కల్పిస్తూ ఆర్థిక శాఖ ఆమోదించబోతున్నది. ప్రతిపాదన పత్రములోని అన్ని ప్రశ్నలకు సరియైన అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను. గుర్తులు లేదా గీతలు అంగీకరించబడవు. (గర్భిణి  స్త్రీలు ప్రసవించిన 6 నెలల తరువాతే బీమాకు అర్హులు) ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్న వారు 48 సం.లు దాటిన మరో పాలసీ తీసుకోవచ్చును. (మెమో నెం.29335/342/A2/ Admn-ll/10  dt : 5.3.2010.  GO.Ms.No. 199  đt: 30.7.2013 మేరకు ఉద్యోగి 1 సం. వరకు వేచి వుండకుండ మొదటి నెల జీతంలో TSGLI ప్రీమియం మినహాయించవచ్చు. 

3).  (ఏ ) GO.Ms.No. 43, dt : 28.1.89,
       (బి ) G.O.Ms.No. 368, dt : 15.11.1994,
       (సి )GO.Ms.No. 22, đt  : 24.3.2000 
       (డి ) G.O.(P) No. 423, đt  : 29-11-2005 ప్రకారం ఉద్యోగుల జీతాల నుండి ప్రీమియంను మినహాయించి, ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని జిల్లా బీమా కార్యాలయాలకు పంపవలసిన పూర్తి బాధ్యత  DDO  దే అని స్పష్టంగా ఆదేశాలున్నాయి. 

4) . ప్రభుత్వ సర్క్యులర్ మెమో నెం. 19921 - A/356/Admn.lI/91 తేదీ: 22.8. 1992 ప్రకారం ప్రీమియం మినహాయించి, ప్రతిపాదన ఫారములు (Proposal Foms) సమర్పించని / లేదా అసంపూర్తిగా పూరించిన లేదా 56 సం.లు వయస్సు నిండిన పిదప సమర్పించినా / లేదా చనిపోయిన తరువాత పంపిన వారికి పాలసీలు జారీచేయరు. అట్టి మొత్తములను అనధికార మొత్తములుగా (Unauthorised amounts) భావిస్తూ వారికి గానీ, వారి వారసులకు గానీ అట్టి మొత్తమును మాత్రమే వాపసు చేయుదురు. పాలసీలోని పరిణతి తేదీ కంటే ముందు పట్టాదారు మరణిస్తే వారి వారసులకు బీమా మొత్తము బోనస్ తో కలిపి చెల్లించెదరు. 

5). TSGLI శాఖ తన పాలసీదారులకు ఆసియాలోనే అత్యధిక బోనస్ అనగా ప్రతి రూ.1000/- బీమా మొత్తమునకు ప్రస్తుతము అమలులో వున్న రేటు ప్రకారం రూ. 100/- బోనస్లను చెల్లిస్తున్నది. (G.0.Ms.No -75 ఫైనాన్స్, తేదీ : 4.4.2014)

6)TSGLI నుండి రుణము : అనారోగ్యం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటికి తాను చెల్లించిన  ప్రీమియం /ప్రస్తుత విలువలో 90%కు మించకుండ, 1000/-లకు తగ్గకుండ రుణం పొందవచ్చు. కాని డైరెక్టర్ ఇన్సూరెన్సు వారు పాలసీదారు వినతి పత్రమునకు తృప్తి చెందితేనే మంజూరి చేస్తారు. రుణమును 12 నుండి 48 వాయిదాలలోతిరిగి చెల్లించాలి. వడ్డి 10% చెల్లించాలి. ఋణములు మరియు పరిణితి చేందిన సొమ్ములు ఆన్లైన్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయును.

.7) TSGLIలో పాలసీ పొందిన తర్వాత పాలసీదార్లకు అనుకోకుండా శాశ్వత అంగవైకల్యం కలిగినచో,  శాశ్వత వైకల్య ప్రయోజనం లభించును.
 వైకల్య వివరాలు : -
(ఏ ) తిరిగి పొందలేని విధంగా రెండు కళ్లద్బష్టి పోవడం.
(బి ) మడమల వద్ద గాని, వాటికి ప గీన గాని పాదాలు తొలగించబడటం.
(సి ) మణికట్టు వద్ద కాని లేదా వాటికి పైన కాని చేతులు తొలగించబడటం.
(డి ) మడమ వద్ద కాని పైన కాని ఒక పాదం తొలగించడటం మరియు మణికట్టు వద్ద కాని, దానికి పైన కాని ఒక చేయి తొలగించబడటం
పై శాశ్వత వైకల్యాలు సంభవించిన వెంటనే అధికారులకు లిఖిత పూర్వకముగ తెలియజేసి 90 రోజుల లోపుధికారి సర్టిఫికెట్ పంపించాలి.
వైకల్య ప్రయోజనం : - చెల్లించు ప్రీమియం రూ॥ 30/- లేదా అంతకన్న ఎక్కువ ప్రీమియం చెల్లించున్నచో  ప్రీమియం నుండి రూ॥ 30/-లు తగ్గించి మిలిగిన ప్రీమియం చెల్లించాలి.

8) ఒక ఉద్యోగి ఉద్యోగంలో చేరేనాటికి ఉండే వయస్సును బట్టి అతను ప్రీమియంగా చెల్లించే ప్రీమియం విలువను బట్టి అతనికి వీద్యోగ విరమణ నాటికి (58 సం॥ల వయస్సు నాటికి) అదే భీమా మొత్తములు  లభిస్తాయి.

9) ఒకవేళ పాలసీ బాండ్ పోతే ఒక నెలలో రూ॥ 5/-లు అదనంగా ప్రీమియం మినహాయించి ఆ షెడ్యూల్నుఅఫిడవిట్తో జతపరచి  జిల్లా కార్యాలయంలో ఇచ్చిన నూతన బాండ్ ఇచ్చును.

10) TSGLI website : http://tsgli.telangana.gov.in/

11) For any queries please contact
Telangana State Government Life Insurance Secretariat, Hyderabad.
Phone Numbers: 040-24754314
Email ID: dir_tgli@telangana.gov.in

************
********
TSGLI ముఖ్యాంశాలు:

@ 56 సంవత్సరాల వయస్సు నిండిన వారు కొత్త పాలసీ చేయుటకు అర్హులు కాదు.

@ Enhance చేసిన ప్రిమీయం Proposals ను 56 సంవత్సరాల వయస్సు నిండకముందే జిల్లా ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయాలి.

@ ఇన్సూరెన్స్ కార్యాలయం వారికి ఉద్యోగి ప్రిమీయం ఎప్పటినుండి Enhance చేసాడనే అంశం తో పనిలేదు. Application 56 సం౹౹ లోపు కార్యాలయంలో ఆందజేసారా లేదా అనేది ముఖ్యం.

@ 56 సం౹౹ లోపు ప్రిమీయం పెంచినప్పటికీ సకాలంలో కార్యాలయంలో అప్లికేషన్ దాఖలు చేయనట్లయితే, అలాంటి పెంచిన మొత్తానికి బాండ్ ఇవ్వరు. కానీ పెంచిన మొత్తం సొమ్మును తరువాత ఉద్యోగి ఖాతాలో జమచేయబడుతుంది.

@ పై సందర్భంలో Enhance చేయకముందు ఎంతైతే మొత్తం కట్ అవుతుందో అంతే మొత్తాన్ని కట్ చేయాల్సిందిగా DDO కి సమాచారం అందించాలి.

@ తదుపరి Form.12 ను పూరించి దానికి ఉద్యోగి సాలరీ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ జతచేసి జిల్లా ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేస్తే Enhance అమౌంట్ మీ ఖాతాలో జమచేస్తారు.
*******

Related GOs & Proc :


G.O. Ms.No.34 Dt.9.4.15 TSGLI Loan Sanctioning and Interest Collection Guidelines
G.O.Ms.No. 409 dt.14.02.2015 APGLI-Permission for Payments through CNIB in respect of Loans and Claims to the Policy Holders of TGLI Department
G.O.Ms.No.190 Dt: 22.01.2015 TSGLI Sanction an amount Rs.40Crs towards Loans settlement of Claims
G.O.Ms.No. 26 dt: 22.02.1995 Ceiling Limit on the Maximum Premium up to 20%