Saturday 4 July 2020

Regional Rural Banks Recruitment - 2020

*తెలుగులో గ్రామీణ  బ్యాంకు పరీక్షలు*

*ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9వేల పైచిలుకు ఆఫీసర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి  ఐబీపీఎస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత ఐబీపీఎస్‌ - ఆర్‌ఆర్‌బీ  మాదిరిగానే  ప్రాంతీయ భాషల్లో కూడా నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియంలో చదువుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం...*

*తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు భర్తీ చేయనున్న బ్యాంకులు:*

*▪️ఆంధ్రప్రదేశ్‌:▪️*

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ (కడప)

సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ (చిత్తూరు)

చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ (గుంటూరు)

*▪️తెలంగాణ:*

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (వరంగల్‌)

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (హైదరాబాద్‌)

*ఉద్యోగాలు*

ఆఫీస్‌ అసిస్టెంట్లు (మల్టీపర్పస్‌)

అసిస్టెంట్‌ మేనేజర్లు (స్కేల్‌ - ఐ ఆఫీసర్లు)

జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు & స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు (స్కేల్‌ - ఐఐ ఆఫీసర్లు)

సీనియర్‌ మేనేజర్లు (స్కేల్‌ - ఐఐఐ ఆఫీసర్లు)

*ఖాళీల వివరాలు*

మొత్తం 9638 ఖాళీలను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 403, తెలంగాణలో 599 ఖాళీలు ఉన్నాయి.

చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌: ఆఫీస్‌ అసిస్టెంట్లు 122, అసిస్టెంట్‌ మేనేజర్లు 63, సీఏ 1, జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు 57

సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌: ఆఫీస్‌ అసిస్టెంట్లు 48, అసిస్టెంట్‌ మేనేజర్లు 102, ఐటీ ఆఫీసర్లు 2. జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు 8

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌: ఆఫీస్‌ అసిస్టెంట్లు 178, అసిస్టెంట్‌ మేనేజర్లు 124, అగ్రికల్చరల్‌ ఆఫీసర్లు 5, జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు 47, సీనియర్‌ మేనేజర్లు 10

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌: ఆఫీస్‌ అసిస్టెంట్లు 235

*👉ఇంటర్వ్యూ*

ఇంటర్వ్యూలను నాబార్డ్‌, ఐబీపీఎ్‌సల ఉమ్మడి సహకారంతో గ్రామీణ బ్యాంకులు నిర్వహించుకుంటాయి. ఇంటర్వ్యూకి 100 మార్కులు కేటాయించారు. ఇందులో అభ్యర్థులు కనీసార్హత సాధించాలి.

*పోస్టులవారీ అర్హతలు*

ఆఫీస్‌ అసిస్టెంట్లు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత ప్రాంతాల స్థానిక భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

అసిస్టెంట్‌ మేనేజర్లు, సీనియర్‌ మేనేజర్లు, జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు: ద్వితీయ శ్రేణి మార్కులతో  ఏదైనా డిగ్రీని అర్హతగా చెప్పినప్పటికీ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌,  అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌, ఫారెస్ట్రీ, యానిమల్‌ హజ్‌బెండ్రీ, వెటరినరీ సైన్స్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, పిసీ కల్చర్‌, అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ ్క్ష కార్పొరేషన్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, లా, ఎకనామిక్స్‌, అకౌంటెన్సీ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

స్పెషలిస్టు ఆఫీసర్లు: ఐటీ ఆఫీసర్లకు 50 శాతం మార్కులతో బీఈ / బీటెక్‌ (ఎలకా్ట్రనిక్స్‌ / కమ్యూనికేషన్‌ / కంప్యూటర్‌ సైన్స్‌ / ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఏఎ్‌సపీ, పీహెచ్‌పీ, సీ++, జావా, వీబీ, వీసీ, ఓసీపీ తదితర సర్టిఫికెట్లు అవసరం.

ఛార్టర్డ్‌ అకౌంటెంట్లకు సీఏ కోర్సు, లా ఆఫీసర్లకు లా డిగ్రీ, ట్రెజరీ మేనేజర్లకు ఎంబీఏ (ఫైనాన్స్‌), మార్కెటింగ్‌ ఆఫీసర్లకు ఎంబీఏ (మార్కెటింగ్‌) కోర్సులు పూర్తికావాలి. అగ్రికల్చరల్‌ ఆఫీసర్లకు డిగ్రీ (అగ్రికల్చర్‌ / హార్టీకల్చర్‌ / డెయిరీ / యానిమల్‌ హజ్‌బెండ్రీ / ఫారెస్ట్రీ / వెటరినరీ సైన్స్‌ / అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌).

పోస్టులకు నిర్దేశించిన విధంగా అనుభవం తప్పనిసరి. ఆఫీస్‌ అసిస్టెంట్‌  మినహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు ఉంటాయి.

*ఆన్‌లైన్‌ పరీక్షల విధానం*

@ ఆఫీస్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ మేనేజర్లకు ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్స్‌ ఉంటాయి. వీటిని హిందీ, ఇంగ్లీషుతోపాటు స్థానిక భాషా మాధ్యమాల్లో కూడా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు తెలుగులో; తెలంగాణ అభ్యర్థులు తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చు.

@జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు, స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు, సీనియర్‌ మేనేజర్లకు సింగిల్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. లాంగ్వేజ్‌ సంబంధిత పేపర్లు మినహా అన్నింటినీ హిందీ, ఇంగ్లీషు మాధ్యమాల్లో నిర్వహిస్తారు. లాంగ్వేజ్‌ పేపర్లను ఆ భాషల్లోనే ఇస్తారు.

@ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

@ మెయిన్‌, సింగిల్‌ లెవెల్‌ ఎగ్జామ్స్‌లో కటాఫ్‌ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

@ ప్రిలిమినరీ ఎగ్జామ్‌: ఇందులో మొత్తం 80 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. మొత్తం మార్కులు 80. పరీక్ష సమయం 45 నిముషాలు. నిర్ణీత క టాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి మెయిన్‌ ఎగ్జామ్‌కు అనుమతిస్తారు.

@ మెయిన్‌, సింగిల్‌ లెవెల్‌ ఎగ్జామ్స్‌: పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. విభాగానికి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 200. పరీక్ష సమయం రెండు గంటలు.

@ స్పెషలిస్ట్‌ ఆఫీసర్లకు పై విభాగాలతోపాటు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ విభాగం కూడా ఉంటుంది. విభాగానికి 40 చొప్పున మొత్తం 240 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 200. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

*ముఖ్య సమాచారం*

దరఖాస్తు ఫీజు: రూ.850

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 21

వెబ్‌సైట్‌: www.ibps.in