Monday 5 October 2020

Guidelines for Reopening of Schools

Govt of India

Ministry of Education

Guidelines for Reopenig of Schools

@  స్కూళ్లు తెరిచిన రెండు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వొద్దని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరిచేందుకు అనుమతించిన నేపథ్యంలో సంబంధిత మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కరోనా పరిస్థితులను బట్టి అక్టోబర్‌ 15 నుంచి పాఠశాలలు తెరువాలా వద్దా అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. అయితే ఆన్‌లైన్‌ తరగతులు మాత్రం తప్పని సరిగా ప్రారంభం కావాలని పేర్కొంది.

స్కూళ్లను పునరుద్ధరించే పక్షంలో తప్పని సరిగా పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించాలని వెల్లడించింది. 

1. స్కూలులోని అన్ని చోట్ల పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాలి. 

2. దీని కోసం పలు బృందాలను స్కూళ్లు ఏర్పాటు చేసుకోవాలి. 

3. స్కూళ్లు సొంతంగానే నిబంధనలు, ప్రోటోకాల్స్‌ తయారు చేసుకోవాలి.

4. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు ఉండాలి.

5. తరగతిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు తప్పని సరిగా ధరించాలి.

6. విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్‌, కమ్యూనిటీ సభ్యులు, హాస్టల్‌ సిబ్బంది శానిటైజ్‌ పద్ధతులు పాటించాలి.

7. అన్ని తరగతుల విద్యా క్యాలెండర్‌కు మార్పులు చేయాలి.

8. డాక్టర్‌, నర్సు, ఆరోగ్య సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలి.

9. విద్యార్థులు, స్కూలు సిబ్బందికి సిక్‌ లీవ్‌, హాజరులో వెసులుబాటు కల్పించాలి. 

10. స్కూళ్లు తెరిచిన రెండు నుంచి మూడు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వకూడదు. 

11. ఐసీటీ వినియోగం, ఆన్‌లైన్‌ విద్యను తప్పనిసరిగా కొనసాగించాలి. 

12. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులు స్కూలుకు హాజరుకావాలి. 

13. భౌతికంగా కన్నా ఆన్‌లైన్‌ విద్యను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి. 

14. విద్యార్థుల హాజరులో ఈ మేరకు సౌలభ్యం కల్పించాలి.

Download :

@ Guidelines for Reopening of School