Monday 3 May 2021

Teacher's Diary : 03.05.2021

1).
*🔊వారం, పది రోజుల్లో టెన్త్ గ్రేడింగ్*

*🌀ఎఫ్ఎ1 మార్కుల ఆధారంగానే ఇవ్వాలని నిర్ణయం*

*📝5.23లక్షల మంది మార్కులు సేకరించిన బోర్డు*

 *🌍రాష్ట్రంలో టెన్త్ స్టూడెంట్లకు గ్రేడింగ్స్ ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలుపె ట్టింది.స్టూడెంట్ల ఫార్మేటిన్అసెస్మెంట్-1 (ఎఫ్ఎ-1) మార్కుల వివరాలను సేకరించిన పరీక్షల విభాగం, దాని ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సీబీఎస్ఈ బోర్డు ఇంటర్నల్, ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ మార్కులను పరిగణలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వ నున్నట్టు ప్రకటించింది. దీంతో తెలంగాణలోనూ ఎఫ్ ఏమార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని అనుకుంటు న్నారు. నేడో, రేపో ఈ విషయమై సర్కారుకు లెటర్ రా యనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 నుంచి 26 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం తో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. స్టూడెంట్లంద రికీ అబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పరీక్షల విభాగం గ్రేడింగ్ ఇస్తుందని సర్కారు తెలిపింది. స్టేట్లో మొత్తం 5,46,865 మంది టెన్త్ స్టూడెంట్లు ఉండగా ఎగ్జామ్ ఫీజు 5,21,393 మంది కట్టారు. ఈ ఏడాది టెన్త్ స్టూబోర్డ్  స్తూడెంట్లకు కేవలం 45 రోజులపాటు మాత్రమే ఫిజికల్ క్లాసులు జరిగాయి. ఈ క్రమంలో కేవలం ఎఫ్ఎ-1 ఎగ్జామ్ ఒక్కటే జరిగింది. మిగిలిన అసెస్మెంట్లు జరగలేదు. దీంతో అనివార్యంగా ఆ మార్కులపై పరీ క్షల విభాగం అధికారులు ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ఎఫ్ఎ- మార్కులను ఎస్సెస్సీ బోర్డు వెబ్సైట్ మేనేజ్మెంట్ల ద్వారా అప్ లోడ్ చేయించారు. ఆ మార్కులు సరిగ్గా వేశారో లేదో తె లుసుకునేందుకు అన్ని స్కూళ్లలో ప్రత్యేక టీములు వేసి రీచెక్ చేయించారు. ప్రతి స్టూడెంట్ పాస్ అయినట్టేననీ, సర్కారుకు విషయం తెలిపి వారం, పది రోజుల్లో గ్రేడ్లు ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు.*
@@@@@@

2).*🔊లాక్‌డౌన్‌ విధింపును పరిశీలించండి*

*🌻ఆక్సిజన్‌ అదనపు నిల్వలను ఉంచండి*

*🎙️కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచన

దిల్లీ: *🌏కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోగులు ప్రాణవాయువు కోసం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసరాల కోసం ఆక్సిజన్‌ మిగులు నిల్వలు (బఫర్‌స్టాక్‌) ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నిర్వహించాలి. దేశవ్యాప్తంగా వికేంద్రీకరించాలి. వచ్చే నాలుగు రోజుల్లో అత్యవసర నిల్వలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల కేటాయింపులకు అదనంగా ఈ నిల్వలను నిర్వహించాలని స్పష్టం చేసింది.  ‘‘ప్రజల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ విధించే అవకాశాన్ని పరిశీలించండి. లాక్‌డౌన్‌ వల్ల తలెత్తే సామాజిక, ఆర్థిక ఇబ్బందుల గురించి మాకు అవగాహన ఉంది. ముఖ్యంగా పేదలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలుసు. అందువల్ల లాక్‌డౌన్‌ విధించేట్లయితే ఈ వర్గాల అవవసరాలు తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి’’ అని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రయోజనాల కోసం పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. వివిధ అంశాలపై సమాచారాన్ని కోరింది. సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.*

*★సామూహిక సమావేశాలు, సభలు, వైరస్‌ని సూపర్‌స్ప్రెడర్‌గా వ్యాపింపజేసే కార్యక్రమాలపై కఠిన నిషేధం విధించాలి.*

*★రూ.50 లక్షల కరోనా బీమా వర్తించిన 22 లక్షల మంది వైద్య ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటి వరకు మరణించిన వారికి సంబంధించిన 287 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇంకా ఎన్ని క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి, వాటిని ఎంత కాలంలో పరిష్కరిస్తారు?*

*★కొవిడ్‌ సోకిన వైద్య ఆరోగ్య సిబ్బందికీ సరైన పడకలు, ఆక్సిజన్‌, అత్యవసర మందులు దొరకడం లేదని తెలిసింది. మరికొందరిని పాజిటివ్‌గా తేలిన పది రోజుల్లోపే విధులకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యుల సేవలను గుర్తించేందుకు వీలుగా జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాలి. వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి.*

*★ఆరోగ్యానికి ముప్పు కలగకుండా విధులు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిందీ తెలియలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిష్కరించాలి.*

*★వైద్య సిబ్బందికి అవసరమైన ఆహారం, పని విరామ వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి స్థలం, రవాణా సౌకర్యం అందించడం, కొవిడ్‌కు గురైనప్పుడు జీతాలు, సెలవుల్లో కోతలు విధించరాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక సమయం విధులు నిర్వహించిన వారికి ఓవర్‌టైం అలవెన్స్‌ ఇవ్వాలి.*

*★మహమ్మారి నియంత్రణ కోసం ఇప్పటి వరకు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలి.*

*★ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా అర్థించే వారిని అధికార యంత్రాంగం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ విషయం అధికార యంత్రాంగానికంతటికీ తెలిసేలా ప్రతి జిల్లా కలెక్టర్‌కు పంపాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.*

*★దిల్లీ ఆక్సిజన్‌ సమస్యను మే 3వ తేదీ అర్ధరాత్రిలోపు పరిష్కరించండి.*

*★ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లోపు ఒక జాతీయ విధానాన్ని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించాలి. కేంద్ర ప్రభుత్వం అలాంటి విధానం ఖరారు చేసేంత వరకూ స్థానిక చిరునామా లేదనో, గుర్తింపుకార్డు లేదనే కారణంతో రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా నిరాకరించడానికి కానీ, అత్యవసర మందులు తిరస్కరించడానికికానీ వీల్లేదు.*

*★ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిన కార్యాచరణను, ప్రొటోకాల్స్‌ను పునఃసమీక్షించాలి. ఆక్సిజన్‌ లభ్యత, వ్యాక్సిన్ల అందుబాటు, వాటి ధరలు, అందుబాటు ధరల్లో అత్యవసర మందుల లభ్యతతో పాటు, ఈ ఆర్డర్‌లో పేర్కొన్న అన్ని అంశాలపైనా కేసు తదుపరి విచారణ జరిగే 10వ తేదీ లోపు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన అఫిడవిట్లు అన్నింటినీ అమికస్‌క్యూరీకి ముందుగా అందించాలి.*
@@@@@@

3).*🔊రెండో డోసు వ్యాక్సిన్ వారికి ఉచితం.. కేంద్రం కీలక ప్రకటన*

న్యూఢిల్లీ: *🌍కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 30, అంత కన్నా ముందు ప్రైవేట్ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మొదటి వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, 45 ఏండ్లకు పైబడిన ప్రయారిటీ గ్రూపు వారు రెండో వ్యాక్సిన్ డోసును గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా పొందవచ్చునని తెలిపింది. అంతే కాకుండా ఆ ప్రయారిటీ గ్రూపు వారు వారికి నచ్చినట్టుగా ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లలో అక్కడ నిర్దేశించిన రేట్ల ప్రకారం ధర చెల్లించి వ్యాక్సిన్ రెండో డోసును వేయించుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ రెండో డోసు విషయాన్ని వారి ఇష్టం మేరకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్థాని ఆదివారం ఓ ప్రకటన తెలిపారు.
@@@@@

4) 🌹పాలీసెట్ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా🌹

🌷పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 1 నుంచి ప్రారంభించాల్సిన దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేశారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ సి. శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 12వ తేదీన పాలీసెట్ -2021 నిర్వహించనున్నట్లు, మే 1 నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటించామని ఆయన తెలిపారు. అయితే కరోనా కారణంగా దరఖాస్తులను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.