Wednesday 5 May 2021

Teacher's Diary : 05.05.2021



*1). 🔊విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తే ప్రాతిపదిక*

*📜పీఎస్‌హెచ్‌ఎం పోస్టులపై విద్యాశాఖ స్పష్టత*

*💫సంఖ్య అధికంగా ఉన్న స్కూళ్లకే మంజూరు!*

*🌍ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టుల మంజూరుపై స్పష్టత వచ్చింది. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరుచేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది.ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నది. ప్రస్తుతం ఉన్నవాటిని కలుపుకుని 10 వేల కు తగ్గకుండా ప్రాథమిక పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టులు మంజూరుచేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఇప్పుడున్న 4,429 లో ఫీమేల్‌ లిట్రేచర్‌(ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం) పోస్టులు మినహాయిస్తే కొత్తగా 5,571 పోస్టులు సృష్టించాల్సి ఉన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 52,563 మంది ఎస్జీటీలు పనిచేస్తున్నారు.* 

🍥పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల సృష్టితో తమకు పదోన్నతి దక్కుతుందనే ఆశతో కొంతమంది ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ చొప్పున ఉండాలి. కానీ, రాష్ట్రంలో 17 మందికి ఒక టీచర్‌ చొప్పున మాత్రమే పనిచేస్తున్నారు. ఈ లెక్కన విద్యార్థులసంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలకే పోస్టులు మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

@@@@@

2). *_🔊ఆగస్టు 1 తరవాతే విద్యార్థి వీసాల పరిశీలన

*_🎙️అమెరికా కాన్సులేట్‌ ప్రకటన

🍥అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ కంటే ముందు వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్వహించలేమని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ మంగళవారం ప్రకటించింది. ఆగస్టు ఒకటో తేదీ వరకు అమెరికాలో ప్రవేశించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు  నుంచి ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థుల వీసా దరఖాస్తుల ప్రక్రియను పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే ఆ తేదీ నుంచి పరిశీలిస్తామని తెలిపింది.

@@@@@

3). ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. సిఎం కెసిఆర్ ఐసోలేషన్ లో వుంటున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎం వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం  కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు  రెండింటిలోనూ నెగిటివ్ గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని తేలింది.  దాంతో  సిఎం కెసిఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు.

@@@@@

4).*🔊ఆన్‌లైన్‌ తరగతుల ఫీజులు తగ్గేనా?*

*🌀సుప్రీం తీర్పుతో రాజస్థాన్‌ ప్రైవేట్‌ పాఠశాలలు తగ్గించాల్సిన పరిస్థితి*

*🍥రాష్ట్రంలోనూ వర్తింపజేస్తే 34 లక్షల మంది తల్లిదండ్రులకు ఊరట*

💫‘‘కరోనా పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ తరగతుల వల్ల విద్యార్థులు స్కూళ్లలో పలు సౌకర్యాలను పొందలేదు. అందువల్ల 2020-21 విద్యా సంవత్సరానికి 15 శాతం ఫీజు తగ్గించండి’’ అని రాజస్థాన్‌లోని ప్రైవేట్‌ పాఠశాలలకు సోమవారం సుప్రీంకోర్టు ఆదేశమివ్వగా ఈ తీర్పు రాష్ట్రంలో వర్తింపజేయాలనే డిమాండ్‌ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడా అమలు చేస్తే లక్షలాది మంది తల్లిదండ్రులకు ఊరట లభిస్తుందని తల్లిదండ్రుల సంఘాలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ విధానంలో పాఠాలు బోధించగా రాజస్థాన్‌ ప్రభుత్వం అక్కడ 30 శాతం ఫీజులు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. దానిపై ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 15 శాతం రుసుములు తగ్గించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలోనూ ఫీజులు తగ్గిస్తే దాదాపు 34 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే రాష్ట్రంలో 2019-20లో తీసుకున్న ట్యూషన్‌ ఫీజునే 2020-21లో వసూలు చేయాలని ప్రభుత్వం జీవో 46 జారీ చేసింది. అన్నిటికీ కలిపి ఒకటే రుసుముగా తీసుకుంటున్నందున ప్రత్యేకంగా ట్యూషన్‌ ఫీజు ఎంత అన్నది స్పష్టత లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదేశాల వల్ల దక్కిన ప్రయోజనం దాదాపు శూన్యమని తల్లిదండ్రుల సంఘాలు పేర్కొంటున్నాయి.*

*♦️ఒక్క రూపాయి తగ్గించలేదన్న అసంతృప్తి*

*♻️కొవిడ్‌ పరిస్థితులను చూస్తే వచ్చే విద్యా సంవత్సరానికి తరగతి గది బోధన కనీసం ఆగస్టు/సెప్టెంబరు వరకు ఉండకపోవచ్చని అంచనా. ప్రైవేట్‌ పాఠశాలలు జూన్‌ నుంచి ఆన్‌లైన్‌ పాఠాలను ప్రారంభించనున్నాయి. గతంలో పలు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులకు ఒక్క రూపాయి తగ్గించలేదన్న అసంతృప్తి, ఆగ్రహం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఫీజుల నియంత్రణపై ఆచార్య తిరుపతిరావు కమిటీ 2017లో ఇచ్చిన సిఫార్సులపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. తల్లిదండ్రులకు సుప్రీం తీర్పు ఊరటనిస్తుందని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ అభిప్రాయపడ్డారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు మాట్లాడుతూ బడ్జెట్‌ పాఠశాలలు రాయితీ ఇచ్చినా తల్లిదండ్రులు తమకు ఫీజులు చెల్లించలేదని చెప్పారు.*
 
*🍥ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తాం*

*🌀సుప్రీం తీర్పును ఇక్కడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. జూన్‌లోపే నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే హెచ్‌ఎస్‌పీఏ తరఫున హైకోర్టుకు వెళ్తాం.* TPTF

@@@@@

5).*🔊జేఈఈ మెయిన్‌ మే సెషన్‌ వాయిదా*

 *🍥ఈ నెల 24 నుంచి 28 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్షను వాయిదా వస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులకు తగిన అవకాశం ఇవ్వడం కోసం ఎన్‌టీఏ ఈ ఏడాది నాలుగు సెషన్లలో ఈ పరీక్ష తలపెట్టింది. ఇప్పటికే రెండు సెషన్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తయ్యాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగిన పరీక్షకు 6,20,978 మంది, మార్చి 16 నుంచి 18వరకు జరిగిన పరీక్షకు 5,56,248 మంది హాజరయ్యారు. మూడో సెషన్‌ ఏప్రిల్‌ 27, 28, 30 తేదీల్లో జరగాల్సి ఉండగా, కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు చివరి సెషన్‌ ఈ నెల 24, 25, 26, 27, 28 తేదీల్లో జరగాల్సి ఉండగా, కొవిడ్‌ విజృంభణ కారణంగా దీన్నీ వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ప్రస్తుతం వాయిదాపడిన ఏప్రిల్‌, మే సెషన్లను రీషెడ్యూల్‌ చేస్తామని, మే సెషన్‌కు సంబంధించిన నమోదు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేదీ త్వరలో చెబుతామని ఎన్‌టీఏ పేర్కొంది. ప్రస్తుతం మిగిలిన ఖాళీ సమయాన్ని విద్యార్థులు మరింత బాగా ఉపయోగించుకొని పరీక్షకు సమాయత్తం కావాలని సూచించింది. ఎన్‌టీఏ అభ్యాస యాప్‌ ద్వారా నమూనా పేపర్లు రాసి, ఇంట్లోనే సాధన చేయాలని పేర్కొంది.

@@@@@

6).*🔊కేంద్ర సిబ్బందికి వర్క్‌ ఫ్రమ్‌ హోం*

న్యూఢిల్లీ, *🌏కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో.. కేంద్ర విభాగాల్లో పనిచేసే సిబ్బంది పనివేళలు, హాజరుకు సంబంధించి గతనెల్లో విడుదల చేసిన మార్గదర్శకాలే మే నెలాఖరువరకు అమల్లో ఉంటాయని కేంద్రం వెల్లడించింది. అండర్‌ సెక్రటరీ, అంతకంటే కిందిస్థాయి సిబ్బంది విషయంలో 50శాతం హాజరు తప్పనిసరని పేర్కొంది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం అనుకున్న స్థాయిలో కరోనా నియంత్రణలోకి రానందువల్ల కేంద్ర సిబ్బంది గతంలో మాదిరిగానే సరళతరమైన పనివేళలు పాటించవచ్చని తెలిపింది. ఆఫీసుల్లో రద్దీని నివారించడానికి షిప్ట్‌ల విధానాన్ని పాటించవచ్చని పేర్కొంది. దివ్యాంగులు, గర్భిణీలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేద ని, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటినుంచే పనిచేయవచ్చని తెలిపింది. ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది.

@@@@@

7). *🔊పాలిటెక్నిక్‌లకు’31 వరకు వేసవి సెలవులు*

హైదరాబాద్‌, *🌍కొవిడ్‌ దృష్ట్యా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలకు బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కాలేజీలతోపాటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో సెకండ్‌ షిఫ్ట్‌ కింద నడుస్తున్న ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలన్నింటికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు.*

*8). 📝9న క్యాట్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌*

*కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నెల 9న టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నట్టు టైమ్‌ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 6 గంటలకు రెండు సెషన్లల్లో ఎగ్జామ్‌ ఉంటుందని పేర్కొన్నది. ఆసక్తిగలవారు www.time4education.com వెబ్‌సైట్‌ ద్వారా పేర్లను నమోదుచేసుకోవచ్చని వెల్లడించింది.

9). *🔊టీవీ మరింత ప్రియం!*

*🍥మరో 3-5 శాతం పెరగనున్న ధర*

న్యూఢిల్లీ: *🖥️టెలివిజన్ల ధరలు మరో 3-5 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. టీవీల తయారీలో కీలకమైన ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం. గత ఏడాది అక్టోబరులో మోదీ సర్కారు ఈ ప్యానెళ్ల దిగుమతిపై 5 శాతం సుంకం విధించింది. ఈ సుంకాన్ని మూడేళ్లలో 10-12 శాతానికి పెంచాలనుకుంటోంది. దేశీయంగా ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధానోద్దేశం. కానీ, కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌లు టీవీ కంపెనీల ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలకు గండికొడుతున్నాయి. దాంతో చాలా కంపెనీలు ఈ ప్యానెళ్ల కోసం ప్రధానంగా చైనా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాదిలో టీవీల ధరలు ఇప్పటికే రెండుసార్లు పెరిగాయి. జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి కంపెనీలు ధరలు పెంచాయి

@@@@@

10).*🔊సార్‌.. ఆక్సిజన్‌ ఉందా?*

*బెడ్స్‌ ఎక్కడ ఖాళీ ఉన్నాయి?*

*సైబరాబాద్‌ కంట్రోల్‌ రూంకు కాల్స్‌*

*వెంటనే స్పందిస్తున్న సిబ్బంది*

*ప్లాస్మా, అంబులెన్స్‌ సేవలు*

*బాధితులు సంప్రదించాల్సిన సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూం నంబర్‌: 9490617440*

*అత్యవసర వైద్యసేవలు, అంబులెన్స్‌ కొరకు సంప్రదించాల్సిన నంబర్‌: 9490617431*

హైదరాబాద్‌ సిటీ, మే 4(ఆంధ్రజ్యోతి): ‘‘సార్‌.. మా అంకుల్‌కు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఆక్సిజన్‌ కావాలి. ఎక్కడ, ఎవరిని సంప్రదించాలో తెలియడంలేదు. దయచేసి ఆక్సిజన్‌ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్‌’’... ఇది సోమవారం అర్ధరాత్రి శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన నవీన్‌ (పేరు మార్చాం) కొవిడ్‌ కంట్రోల్‌ రూంకు చేసిన ఫోన్‌ కాల్‌. ఈ కాల్‌ అందుకున్న కంట్రోల్‌ రూం సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆక్సిజన్‌ కిట్‌తో ఉన్న అంబులెన్స్‌ను నవీన్‌ చెప్పిన చిరునామాకు పంపించగా.. ఆ అంబులెన్స్‌ పేషెంట్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించింది.  ఇలా కేవలం నవీన్‌ మాత్ర మే కాదు ఎంతో మంది బాఽధితులు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌లు చేస్తున్నారు. రోజుకు 350-400 ఫోన్‌ కాల్స్‌ వస్తుండగా.. వాటిలో 200లకు పైగా ప్లాస్మాకోసం వస్తున్నాయని, మిగిలినవి అంబులెన్స్‌ సర్వీసులు, ఆక్సిజన్‌ ఎక్కడ దొరుకుతుంది? ఏ ఆస్పత్రిలో  బెడ్స్‌ ఖాళీలున్నాయనే సమాచారం కోసం వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌.. మార్చిలోనే కొవిడ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కంట్రోల్‌ రూంలో 24/7 సేవలు కొనసాగిస్తున్నారు.  కరోనా రోగులు, కరోనాలేని అత్యవసర రోగులకూ సేవలు అందిస్తున్నారు. అవసరమైన వారికి ప్లాస్మా, అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 

*రండి.. ఆపత్కాలంలో ఆదుకుందాం* 

ఆస్పత్రి యాజమాన్యాలు ఉచితంగా అంబులెన్స్‌లు అందించడం, ఇతర సంస్థలు, ఎన్జీవోలు కొవిడ్‌ సేవల్లో తమ పాత్ర పోషించడం సంతోషంగా ఉందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. మిగిలిన సంస్థలు కూడా ముందుకొచ్చి ఈ ఆపత్కాలంలో బాధిత ప్రజలను ఆదుకోవాలని కోరారు