Sunday 23 May 2021

TS Teacher's Diary: 23.05.2021



1)*🔊ఆగస్టులో SSC ఒరిజినల్‌ మెమోలు_*

*_🌀తప్పులకు అవకాశం లేకుండా ముద్రణ.. అప్పటిదాకా ఇంటర్నెట్‌ మెమోల వినియోగం_*

*_🍥ఎస్సెస్సీ విద్యార్థులకు ఆగస్టులో ఒరిజినల్‌ మెమోలు అందనున్నాయి. అప్పటివరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకోవచ్చని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. నకిలీ, బోగస్‌ మెమోలను అరికట్టడంలో భాగంగా బార్‌కోడ్‌తోపాటు మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్లను ముద్రిస్తున్నారు. కొన్ని కారణాలతో ఎస్సెస్సీ మెమోల్లో పేర్లు, ఇంటిపేరు, తల్లిదండ్రుల పేర్లల్లో అక్షరదోషాలు, ఇతర్రాత తప్పులు చోటుచేసుకొంటున్నాయి. ఒకసారి ముద్రించి ఇచ్చిన మెమోల్లో తప్పులు దొర్లితే మళ్లీ ముద్రించి ఇవ్వడం సమస్యలతో కూడుకున్నది. అందుకే ఆలస్యమైనా తప్పులు లేకుండా మెమోలు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు మొదటివారంలో మెమోలు అందజేస్తామని అధికారులు చెప్తున్నారు. స్కూల్‌ లాగిన్‌ ఐడీనుంచి ప్రింట్‌తీసి.. ప్రధానోపాధ్యాయులు సంతకం చేసిన మెమోలను ప్రస్తుతానికి వినియోగించుకోవచ్చని అంటున్నారు.
@@@@@

2).*🔊సృజనాత్మకతకు చక్కని సమయం*

*💫విద్యార్థులకు అంతర్జాల పోటీలు*

*🍥కరోనా వేళ ఇంటి వద్ద ఉన్న విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగంలోని సీఎస్‌ఐఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) విద్యార్థులకు ‘ఇన్నోవేషన్‌ అవార్డు’ పేరిట అంతర్జాల పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలకు సులువైన పరిష్కారం చూపేలా అద్భుతమైన ఆలోచనలకు రూపం ఇస్తే.. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పోటీల్లో విజయం సాధించవచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.*

*🌀విద్యార్థులను శాస్త్ర సాంకేతికత వైపు నడిపించేందుకు, సృజనాత్మకత అంశాలను ఆవిష్కరణలుగా మార్చేలా చేయడం కోసం 2002 నుంచి సీఎస్‌ఐఆర్‌ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో పోటీలను అంతర్జాల వేదికగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 18 సంవత్సరాలలోపు విద్యార్థులంతా దీనికి అర్హులు. నూతన ఆవిష్కరణల నమూనా వివరాలను హిందీ లేక ఆంగ్లంలో 5 వేల పదాలకు మించకుండా.. విద్యార్థులు వారి ప్రతిభకు పదును పెట్టి రచించాలి. పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌తో ధ్రువీకరించి, అన్ని రకాల ధ్రువపత్రాలను జత చేసి ciasc.ipu@niscair.res.in కు విద్యార్థుల ఆవిష్కరణల నమూనాలను ఈ నెల 31లోగా పంపించాలి. ఆవిష్కరణలను తెలిపే ఒక హార్డ్‌ కాపీని www.csir.res.in వెబ్‌సైట్‌లో ఉన్న చిరునామాకు పంపించాలి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 3100 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిలో 5.50 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా తమ చుట్టూ చూసే సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. పదును పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
@@@@@

3).*💠💉సెప్టెంబరు నాటికి పిల్లలకూ టీకా!*

*💫కేంద్ర అనుమతులపై అది ఆధారపడి ఉంటుంది*

*💥జూన్‌ నుంచి ట్రయల్స్‌ మొదలు పెట్టబోతున్నాం*

*🔶భారత్‌ బయోటెక్‌ వ్యాపారాభివృద్ధి విభాగాధిపతి డా.రేచస్‌ ఎల్లా*
-దేశంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన అందరికీ కొవిడ్‌ టీకా వేస్తున్నారని.. వైరస్‌లో వేరియంట్లు మారుతున్న కొద్దీ పిల్లలపై ప్రభావం పెరుగుతోందని ప్రఖ్యాత టీకా తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ వ్యాపారాభివృద్ధి విభాగాధిపతి డా.రేచస్‌ ఎల్లా అన్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 1 నుంచి పిల్లల మీద టీకా పరీక్షలు (పీడియాట్రిక్‌ ట్రయల్స్‌) మొదలు పెట్టబోతున్నామని చెప్పారు. సెప్టెంబరు చివరి నాటికి 18 సంవత్సరాల లోపు వారికీ టీకా అందుబాటులోకి రావొచ్చని అన్నారు. అది కేంద్ర ప్రభుత్వ అనుమతులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 70 కోట్ల కొవాగ్జిన్‌ టీకా డోసులు ఉత్పత్తి చేస్తామన్నారు. తయారీ యూనిట్లను బెంగళూరు, గుజరాత్‌కు విస్తరించనున్నట్టు తెలిపారు. శనివారం ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన చర్చలో డాక్టర్‌ రేచస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ అంకాలజిస్ట్‌ ప్రజ్ఞ చిగురుపాటి వక్తగా వ్యవహరించారు. ఎఫ్‌ఎల్‌వో అధ్యక్షురాలు ఉమా చిగురుపాటి నేతృత్వం వహించారు.
@@@@@

@    Today's Service Info :

        #    Maternity Leave

@    Today's TET & TRT Material Info :

        #    10th Class Physical Science TM