Wednesday 26 May 2021

TS Teacher's Diary:26.05.2021



1).*🔊1 నుంచే ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు*

*🌀మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం*

*🍥జూలై 5 వరకు తొలిదశ ఇంటర్‌ ప్రవేశాలు*

*📜షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు*

*💫సెకండియర్‌ అడ్మిషన్లపై త్వరలోనే నిర్ణయం*

🌍ఇటీవలే ఉత్తీర్ణులైన పదోతరగతి విద్యార్థులకు ఇంటర్‌బోర్డు శుభవార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదలచేసింది. జూన్‌ ఒకటో తేదీ నుంచే ఫస్టియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మంగళవారం ప్రకటన విడుదలచేశారు. మొదటి విడుత ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు మంగళవారం నుంచే ప్రారంభిం చినట్టు వెల్లడించారు. ఈ ప్రవేశాల ప్రక్రియ జూలై 5వ తేదీతో ముగుస్తుంది. ఇది మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్‌ మాత్రమే నని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎస్సెస్సీ విద్యార్థుల ఇంటర్నెట్‌ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించిన ఆయన, ఎస్సెస్సీ ఒరిజినల్‌ మెమోలు, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ప్రొవిజినల్‌ అడ్మిషన్లను ఆమోదిస్తామని స్పష్టంచేశారు. ఇతర వివరాల కోసం TSBIE/ acadtsbie. cgg. gov.in / tsbie.cgg.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.

♦️విద్యార్థులు నష్టపోకూడదనే..
ఏటా జూన్‌ 1 నుంచే ఇంటర్‌ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్‌ 1 నుంచే ఆన్‌లైన్‌ క్లాసులతోపాటు, మంగళవారం నుంచే ప్రవేశాలు ప్రారంభించారు. సెకండియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులపై నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి ప్రారంభిస్తామని జలీల్‌ వెల్లడించారు. టెన్త్‌ పాసైన విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు, కో ఆపరేటివ్‌, తెలంగాణ రెసిడెన్షియల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ఇంటెన్సివ్‌, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీలు, టీఎస్‌ మోడల్‌ జూనియర్‌ కాలేజీలు, కాంపొజిట్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఇవీ మార్గదర్శకాలు..🔰

🌀ప్రవేశాల్లో రిజర్వేషన్లను కచ్చితంగా పాటించాలి. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, వికలాంగులకు 3%, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు 5%, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాలో 3% చొప్పున సీట్లను భర్తీచేస్తారు. బాలికలకు ప్రత్యేక కాలేజీ లేని పక్షంలో 33.33% లేదా 1/3 సీట్లను వారికి కేటాయించేలా ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలి.

💫ఎస్సెస్సీ జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం కాలేజీలు ఎలాంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించరాదు. ఒక వేళ నిర్వహిస్తే సదరు కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటిలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తమ ఆధార్‌ నంబర్‌ను సమర్పించాలి.

🛍️ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు తమకు మంజూరైన సీట్లకు మించి ప్రవేశాలు కల్పించరాదు. ఒక్కో సెక్షన్‌కు 88 మంది మించకుండా చూసుకోవాలి. అంతేకాకుండా అదనపు సెక్షన్లు మంజూరైన తర్వాతే చేర్చుకోవాలి. బోర్డు ఉపసంహరించుకున్న కోర్సు కాంబినేషన్లలో అడ్మిషన్లు తీసుకోరాదు.

💫ప్రవేశాల సమయంలో కాలేజీలు తమకు మంజూరైన సెక్షన్లు, ఒక్కో సెక్షన్‌లో ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్యను ప్రదర్శించడంతోపాటు, రోజువారీగా ఖాళీ సీట్ల సంఖ్యను అప్‌డేట్‌ చేయాలి.
జోగినిల పిల్లలకు ప్రవేశాలు కల్పించేటప్పుడు తండ్రి పేరు స్థానంలో తల్లిపేరు రికార్డుల్లో ఉంటే అదే పేరును కొనసాగించవచ్చు.

🍥విద్యార్థులు ఆలస్యంగా ప్రవేశాలు తీసుకుంటే ఆయా వ్యవధికిగాను తాసిల్దార్‌ నుంచి లోకల్‌ క్యాండిడేట్‌/ రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ ఫర్‌ గ్యాప్‌ను సమర్పించాలి.

@@@@@
2).*🔊ఈ ఏడాదీ నెట్టింట్లోనే పాఠాలు!*

*🔶నూతన విద్యాసంవత్సరానికి రోడ్‌మ్యాప్‌*

*🔷మూడు దశల్లో సన్నద్ధమవ్వాలన్న కేంద్రం*

*🔶డిజిటల్‌, ఆన్‌లైన్‌ ఏర్పాట్లకు ఆదేశాలు*

*🔷తెలంగాణ విద్యా విధానాలకు ప్రశంసలు*

*🍥కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని కేంద్రం రాష్ర్టాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కొవిడ్‌ యాక్షన్‌ప్లాన్‌తోపాటు, రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది. ఇందుకు తగిన ఏర్పాట్లను రాష్ర్టాలు చేసుకోవాలని ఆదేశించింది. రేడియో, టీవీ, యాప్‌లు, పోర్టళ్లు, ఈ లైబ్రరీలు, వాట్సాప్‌, లౌడ్‌స్పీకర్లలో పాఠ్యాంశాల ప్రసారం తదితర విధానాలను అమలుచేయవచ్చని సూచించింది. నూతన విద్యా సంవత్సరాన్ని మూడు దశల్లో కొనసాగించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. అవి నిర్వహణ దశ (మెయింటనెన్స్‌ ఫేజ్‌), పునరుద్ధరణ దశ (రీస్టోర్‌ ఫేజ్‌), అభివృద్ధి దశ (గ్రోత్‌ ఫేజ్‌). ఈ దశల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికను కూడా కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ర్టాలు తమ అవసరాలు, ఏర్పాట్లను బట్టి ప్రత్యేకంగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌, డిజిటల్‌ క్లాసుల నిర్వహణతో పాటు, డ్రాపౌట్లు, పాఠ్యపుస్తకాల వివరాలను అందజేయాలని ఆదేశించింది. 2030 నాటికి ప్రీప్రైమరీ నుంచి సీనియర్‌ సెకండరీ వరకు 100శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) లక్ష్యంగా నిర్దేశించుకోవాలని, ఈ దిశలో డ్రాపౌట్ల సంఖ్యను గణనీయంగా నివారించాలని పేర్కొన్నది.*

*💥మూడు ఫేజ్‌లివే..*

*👉మెయింటనెన్స్‌ ఫేజ్‌లో మే-జూలై మాసాల్లో మధ్యాహ్న భోజనం అమలు, ఎస్‌ఎస్‌ఏ నిధుల కేటాయింపు, మొబైల్‌యాప్‌లు అందుబాటులోకి తేవడం, టీచర్లకు శిక్షణ, విద్యార్థుల నమోదు, సర్వే, డ్రాపౌట్ల నివారణ, వీక్లీప్లాన్‌ల రూపకల్పన.*

*👉రీస్టోర్‌ ఫేజ్‌లో భాగంగా నవంబర్‌లో నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే, రాష్ట్రస్థాయిలో స్టూడెంట్‌ రిజిస్టర్‌ తయారీ, మూల్యాంకన విధానంలో మార్పులు చేపట్టాలి. బిడ్జికోర్సులను రూపొందించి, స్వల్పకాలిక శిక్షణనివ్వాలి. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. డిజిటల్‌ తరగతుల నిర్వహణకు కంటెట్‌ తయారీలో నిమగ్నమవ్వాలి.*

*👉గ్రోత్‌ ఫేజ్‌లో భాగంగా యాక్షన్‌ ప్లాన్లపై సమీక్ష, మార్పులు చేర్పులు. పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయిలో విద్యార్థుల సామర్థ్య పరీక్ష.*

*♦️తెలంగాణ విధానానికి కితాబు*

*♦️పలు రాష్ర్టాల్లో అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను సైతం కేంద్రం రోడ్‌మ్యాప్‌లో ఉదహరించింది. దీంట్లో తెలంగాణలో అత్యంత వేగంగా డిజిటల్‌ పాఠాలను తయారుచేసి, అమలు చేస్తున్న విధానం సైతం చోటు చేసుకున్నది. టీవీ పాఠాలు రూపొందించేందుకు ప్రత్యేకంగా నిపుణులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణనివ్వడం, టీవీల్లో ప్రసారం చేయడం బాగున్నట్లు కితాబిచ్చింది.*

@@@@@

3) *🔊పాఠశాల నాయకత్వంపై ఆన్‌లైన్‌ కోర్సు*

*🌀ఉపాధ్యాయులకు అత్యంత ఉపయోగం*


*🍥కరోనా దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో విద్యాసంస్థలు మూత పడ్డాయి. ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల నాయకత్వంపై ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. వేసవి అయినందున ఉపాధ్యాయులు ఈ కోర్సును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోని విద్యా ప్రణాళిక పరిపాలన జాతీయ సంస్థ ఆధ్వర్యంలో న్యూపా(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) పాఠశాల నాయకత్వం, నిర్వహణ, అభివృద్ధి అనే అంశంపై ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహిస్తుంది.*


*💥బదిలీలు పదోన్నతులకు...*

*💫ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు కోసం జాతీయ స్థాయిలో నాయకత్వ కేంద్రం ఏర్పాటు కాగా దానికి అనుబంధంగా రాష్ట్రంలో పాఠశాల నాయకత్వ అకాడమీని గతేడాది ఏర్పాటు చేసి సమన్వయకర్తను నియమించారు. ఉపాధ్యాయులందరూ ఈ కోర్సును విధిగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోర్సును పూర్తి చేసిన వారికి బదిలీలు, పదోన్నతులు, పురస్కారాల్లో ప్రాధాన్యం కల్పించే అవకాశాలున్నాయి. ప్రధానోపాధ్యాయలుగా పదోన్నతికి ఈ కోర్సును తప్పనిసరి చేసే అవకాశం ఉంది.*

*💥పది రోజుల్లో సర్టిఫికెట్‌..*

*🥏న్యూపా పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌ కోర్సు పూర్తి చేయాలంటే ముందుగా పీఎస్‌ఎల్‌ఎమ్‌.ఎన్‌ఐఈపీఏ.ఏసీ.ఇన్‌ అనే వెబ్‌ సైట్‌ను ముందుగా తెరవాలి. నమోదు ఆప్షన్‌లో మన వివరాలన్నింటిని ఎంటర్‌ చేయాలి. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, మెయిల్‌ చిరునామా, పాఠశాల, ఉపాధ్యాయుడి, చరవాణి నెంబర్‌, రాష్ట్రం, జిల్లా వివరాలు నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి. కోర్సు అయిదు అధ్యాయాలుగా ఉంటుంది. మొదటి అధ్యయనం ఓపెన్‌ చేయగానే స్టడీ మెటీరియల్‌, ప్రశ్నావళి ఉంటాయి. స్టడీ మెటీరియల్‌ కోర్సు కోసం చదవాల్సిన విషయాలన్నీ ఉంటాయి. అనంతరం ప్రశ్నావళిని ఓపెన్‌ చేస్తే మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. వీటిని పూర్తి చేస్తే మొదటి అధ్యాయం పూర్తవుతుంది. ఇదే విధంగా వివిధ అయిదు అధ్యాయాలుంటాయి. కోర్సు పూర్తయిన మూడు నుంచి పది రోజుల్లో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ అందిస్తారు.*

*💥కోర్సు అధ్యాయాలు ఇవే..*

*♦️పాఠశాల నాయకత్వంపై దృక్పథం,  ♦️స్వీయ అభివృద్ధి, ♦️ బోధన అభ్యసన ప్రక్రియను మార్చడం, ♦️బిల్డింగ్‌, లీడింగ్‌ జట్లు, ♦️ప్రముఖ ఆవిష్కరణలు,♦️ ప్రముఖ భాగస్వామ్యాలు పాఠశాల పరిపాలన, ♦️ పాఠశాల అభివృద్ధి ప్రణాళికను ఏకీకృతం చేయడం*
@@@@@

4) *దూరవిద్య ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు*

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో దూర విద్యావిధానంలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును అధికారులు పొడిగించారు. రూ.50 ఆల‌స్య‌ రుసుముతో ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు. పూర్తి వివ‌రాల కోసం https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌ను చూడ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

@@@@@

@ Today's Service Info :

        # Half Pay Leave

@  Today's TRT & TET Material Info :

        # 10th Class Maths EM