Monday 4 October 2021

Teachers Diary:dt.04.10.2021

 

1)*🔊బడులు తెరవడానికి.. అందాకా ఆగొద్దు!*

*🎙️ప్రపంచ బ్యాంకు*

*🍥 కొవిడ్‌తో తెరుచుకోని పాఠశాలల పునఃప్రారంభానికి.. విస్తృతస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవరకు ఆగాల్సిన అవసరం లేదని ప్రపంచ బ్యాంకు సూచించింది. లభిస్తున్న ఆధారాలను బట్టి పిల్లలకు కొవిడ్‌ సోకే అవకాశాలు తక్కువేనని, అలాగే వారిలో వ్యాధి తీవ్రం కావడం, మరణాల ముప్పు స్వల్పమేనని పేర్కొంది. సురక్షిత విధానాలతో స్కూళ్లు తెరవొచ్చని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే బడుల్లో విద్యార్థులు, సిబ్బంది ఇతరుల మధ్య వైరస్‌వ్యాప్తి ముప్పు తక్కువే ఉంటుందని ప్రపంచ బ్యాంకు విద్యా బృందం (ఎడ్యుకేషన్‌ టీమ్‌) తన ‘న్యూ పాలసీ నోట్‌’లో అభిప్రాయపడింది.*
@@@@@
2).🔊TS: అంగన్‌వాడీల్లో ‘ఇంటి భాష’లో బోధన*

*‘మైనార్టీ, గిరిజన, ఏజెన్సీ’ కేంద్రాల్లో ఉర్దూ, లంబాడ, గోండు, కోయ తదితర భాషలకు ప్రాధాన్యం*

*అంగన్‌వాడీలను గుర్తించాలని అధికారులకు సూచనలు*

*ఆయా భాషల్లో పుస్తకాలు ముద్రించాలని శిశు సంక్షేమశాఖ ఆదేశం*

 అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషలోనే బోధన చేపట్టాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు మరింత సులభంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలో దీనిని అమలు చేయాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధన, అభ్యసనకు సంబంధించిన పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అన్నీ తెలుగులో, ఒకట్రెండు ఇంగ్లిష్‌లో ఉంటున్నాయి.

వీటి ద్వారా మైనార్టీలు, గిరిజనులు అధికంగా ఉండే అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధన చేస్తున్నప్పటికీ వారు ఇంట్లో మాట్లాడే భాషలో చెప్పే అంశాలనే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మైనార్టీలు, గిరిజన తెగలున్న ఆవాసాలు, ఏజెన్సీలు తదితర ప్రాంతాల్లో పిల్లల మాతృ భాషలోనే బోధన సాగిం చాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ దిశలో చర్యలు తీసుకుంటోంది. రెండు రోజుల కిందట జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.

భాషల వారీగా కేంద్రాల గుర్తింపు..

రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 17.04 లక్షల మంది పిల్లలు నమోదు కాగా, రోజుకు సగటున 6 లక్షల మంది హాజరవుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి వారి మాతృభాషలో బోధన నిర్వహించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లోని అంగన్‌వాడీల్లో ఉర్దూ, గిరిజన తండాల్లో లంబాడ, ఏజెన్సీ ప్రాంతాల్లో గోండు, కోయ, కొలామ్‌ భాషల్లో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సీడీపీఓలకు ఒక ప్రణాళికను తయారు చేసి పంపించింది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక భాషల్లో పుస్తకాలను ముద్రించి ఆశ్రమ పాఠశాలల్లో అందుబాటులోకి తెచ్చారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ సహకారాన్ని తీసుకునేందుకు సంబంధిత అధికారులతో శిశు సంక్షేమ శాఖ చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరలో సమగ్ర ప్రణాళిక రూపొందించి పిల్లల మాతృ భాషలో బోధనను ప్రారంభించాలని ఆ శాఖ భావిస్తోంది.
@@@@@
3).*🔊కేజీబీవీ టీచర్లను పీఆర్సీలోకి తెస్తాం: పువ్వాడ*

*🍥కేజీబీవీ ఉపాధ్యాయులను పీఆర్సీ పరిధిలోకి తీసుకొస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. ఖమ్మం నగరంలోని ఆదివారం జరిగిన పీఆర్టీయూ జిల్లా స్వర్ణోత్సవ కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే అజెండాగా పీఆర్టీయూ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ప్రభుత్వంతో అనుసంధానంగా ఉంటూ ఉపాధ్యాయ సంక్షేమం కోసం వందల సంఖ్యలో ఉత్తర్వులు సాధించిన సంఘం పీఆర్టీయూ అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే సంఘాల వల్ల ఉపాధ్యాయులకు ఏమాత్రం ప్రయోజనం లేదని ఆయన అన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు*
@@@@@
4).🔊💉Vaccine for Children: ప్రాధాన్య క్రమంలోనే చిన్నారులకు టీకా!*

*🎙️కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా*

*🍥దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విస్తృతంగా కొనసాగుతోంది. 18ఏళ్ల వయసు పైబడిన వారిలో దాదాపు 69శాతం మందికి కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్‌ అందింది. ఇదే సమయంలో త్వరలోనే చిన్నారులకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, వారికి టీకా పంపిణీ ఏ విధంగా చేపట్టాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలోనే చిన్నారులకు టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న చిన్నారులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత సాధారణ పిల్లలకు వ్యాక్సిన్‌ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.*

*🌀‘కొవిడ్‌ బారినపడే ప్రమాదమున్న చిన్నారులు, ఒకవేళ వైరస్‌ బారినపడితే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చే పిల్లలను గుర్తించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. మరికొన్ని వారాల్లోనే ఈ జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. అంతేగాకుండా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి పిల్లలు ప్రయాణం చేయనవసరం లేకుండా స్థానికంగానే టీకా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ (NTAGI) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు.*

*🥏ఇక 12ఏళ్లకు పైబడిన చిన్నారుల కోసం జైడస్‌ క్యాడిలా రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) గత నెలలోనే అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇదే సమయంలో భారత్‌ బయోటెక్‌ 2ఏళ్లకు పైబడిన చిన్నారుల కోసం రూపొందించిన టీకా క్లినికల్‌ ప్రయోగాల సమాచారాన్ని ఇప్పటికే డీసీజీఐకి అందించింది. వీటి వినియోగంపైనా త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దేశంలో 18ఏళ్లకు కంటే తక్కువ వయసున్న చిన్నారుల సంఖ్య 44 కోట్లు ఉన్నట్లు అంచనా.*
@@@@@

Ad:

Smart Online Shop : 

EYEBOGLER Regular Fit Men's Cotton T-Shirt


    • Cotton Polyester Blend: 60% Cotton and 40% Polyester
    • Regular fit and dimensionally accurate size
    • Unique design with excellent durable fabric
    @ Best buy at Discount Price :  https://amzn.to/3F8iiYy