*సీనియార్టీ జాబితాల రూపకల్పనలో పాటించే నియమ నిబంధనలు*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1.*398 ఉపాధ్యాయులు : వీరి సీనియారిటీని డేట్-ఆఫ్ రెగ్యులరైజేషన్ నుండి పరిగణిస్తారు.
2. *610 G.O ఉపాధ్యాయులు: వీరికి సర్వీస్ ప్రొటెక్షన్ ఉన్నందున వారి జాయినింగ్ తేదీని, మరియు మెరిట్ ను పరిగణలోకి తీసుకుంటారు.
3.*అన్ ట్రైన్డ్ ఉపాధ్యాయులు: వీరి యొక్క ట్రైనింగ్ పూర్తయిన/ ఉత్తీర్ణత పొందిన చివరి పరీక్ష తేదీ నుండి ప్రమోషన్ కు సర్వీసు లెక్కించబడుతుంది.
4 *స్పెషల్ విద్యా వాలంటీర్లు గా నియామకం అయిన ఉపాధ్యాయుల విషయంలో వీరు మే 2005లో ఉత్తీర్ణత పొందినప్పటికీ నవంబర్ 2005లో రెగ్యులరైజేషన్ అయినందున నవంబర్ 2005 నుండి వీరి యొక్క సర్వీసు( ప్రమోషన్స్ కి) పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
*5. ఎయిడెడ్ ఉపాధ్యాయులు: వీరి మొదటి నియామక తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిన తేదీ వరకు గల సర్వీసులో 50% సర్వీసును ప్రమోషన్స్ కు సర్వీసు గా లెక్కించబడుతుంది.
6. *SGT నుండి ప్రమోషన్ ద్వారా కాకుండా డైరెక్ట్ SA పొందిన ఉపాధ్యాయులకు
పే ప్రొటెక్షన్ మాత్రమే ఉంటుంది సర్వీస్ పరంగా ట్రాన్ఫర్ లేదా పదోన్నతులలో సర్వీస్ వాడుకునే అవకాశం లేదు.
7. *అంతర్ జిల్లా స్పౌస్ బదిలీ ఉపాధ్యాయులకు:- కొత్త జిల్లాకు వచ్చి చేరిన తేదీ నుండి వీరి యొక్క సర్వీస్ ప్రమోషన్ కు పరిగణలోకి తీసుకొనబడుతుంది.
8. *317 స్పౌజ్ తరువాత మ్యూచువల్ ద్వారా వచ్చిన ఉపాధ్యాయులకు:-
వీరి సర్వీసు కూడా అంతర్ జిల్లా బదిలీల ద్వారా వచ్చిన ఉపాధ్యాయుల వారిగానే పరిగణించబడుతుంది. వీరు చేరిన జిల్లాలోని తేదీ నుండే ప్రమోషన్ కు సర్వీసు ను పరిగణించబడుతుంది.
*అడక్వసి పూర్తిగాని సందర్భంలో ప్రతి వందకు ఎస్సీ వారికి 15%, ఎస్టి వారికి 10 శాతం ,వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు ప్రమోషన్లకు వర్తించును.*