సందేహాలు - సమాధానాలు
# FAQ - SUMMER HOLIDAYS:
ప్రశ్న: నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?
జవాబు: వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.
ప్రశ్న: ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని ELs జమచేయబడతాయి?
జవాబు: వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.
ప్రశ్న: వేసవి సెలవులలో ఎంఇఓ కార్యాలయంలో సర్వీసు రిజిష్టర్, బిల్లులు చేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవు వస్తుందా?
జవాబు: బిల్లులు, ఎస్ఆర్ ల బాధ్యత ఉపాధ్యాయులది కాదు. కాని వేసవి సెలవులలో మీ ఎంఈవో ఆ విధమైన డ్యూటీ చేయమని ఉత్తర్వులు ఇస్తే జీవో 35; తేదీ. 16.01.1981 ప్రకారం మీకు సంపాదిత సెలవు జమచేయవలసి ఉంటుంది.