Saturday, 6 September 2025

FAQ- Medical Leaves

సందేహాలు - సమాధానాలు 

FAQ- Medical Leaves

ప్రశ్న: 1
* ఒక ఉద్యోగి 6 సం కాలాన్ని పూర్తి చేసుకున్నాడు మరియు అతనికి 138 ELs మరియు 80 Half Pay Leaves కలవు. అతని ఆరోగ్యం ఇటీవల కాలంలో బాగా లేదు డాక్టర్లు రెస్ట్ కావాలి అని చెప్పారు, అతను Maximum  ఎన్ని Months మెడికల్ లీవ్ పెట్టవచ్చు ? తెలియజేయగలరు.

సమాధానము:
*ఎన్ని రోజులు మెడికల్ లీవ్ అవసరం అనేది అసిస్టెంట్ సివిల్ సర్జన్/సివిల్ సర్జన్ తెలుపుతూ సర్టిఫికేట్ ఇస్తారు. సాధారణంగా మరీ సుదీర్ఘకాలం సర్టిఫికెట్ ఇవ్వరు.
*డాక్టర్ సర్టిఫికెట్ ఆధారంగా పెట్టుకోవడమే. (ఏ తరహా సమస్యకు ఎంత కాలం అవసరం అనేది స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి)
*180 Days Maximum.

ప్రశ్న: 2
*6 నెలలు పెట్టుకోవచ్చా అయితే మరి పై మెసేజ్ లో మెడికల్‌ గ్రౌండ్లో సుదీర్ఘ కాలం సర్టిఫికెట్ ఇవ్వరు అని మెసేజ్ పెట్టారు?

సమాధానము:
*ప్రతీ అనారోగ్యానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఉదాహరణకు Covid నే తీసుకుంటే 14 రోజులు. 
ఫ్రాక్చర్ అయితే 4 వారాలు, 6 వారాలు, ఎనిమిది వారాలు.

*ఇలా ఒక్కో రకమైన అనారోగ్యం నుండి కోలుకుని సాధారణ స్థితి కి చేరుకోవడానికి ఎంత కాలం పడుతుంది అనే ప్రోటోకాల్స్ ప్రకారం వారు ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఏదో ఒక రోగం పేరు రాసి, వారికి తోచినంత కాలం రెస్ట్ కావాలి అని సర్టిఫికెట్ లు ఇచ్చేస్తే ఫ్యూచర్ లో ఏదైనా తేడా వస్తే, ఆ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ కూడా దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

*ఆ పీరియడ్ దాటిన తరువాత పేషెంట్ పరిస్థితిని బట్టి, మరింత కాలం అవసరమా కాదా అనేది నిర్ధారించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి extend చేస్తూ మరో సర్టిఫికెట్ ఇస్తారు.

*జెన్యూన్ అనారోగ్య కారణాలకు అసలు ఇలాంటి సందేహాలు రాకూడదు. ఎందుకంటే మనం డాక్టర్ చెప్పింది ఫాలో అవుతాం. డాక్టర్ ఎంత కాలం చెబితే అంతకాలం మనం సెలవులో ఉండాలి. (ఫిట్నెస్ లేకుండా విధుల్లో ఉండకూడదు). వైద్య కారణాలతో సెలవు పెడితే తిరిగి ఫిట్నెస్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే తప్ప విధుల్లో చేర్చుకోకూడదు.

*అందువల్ల ఎంత కాలం సెలవు అనేది వైద్య పరమైన ప్రోటోకాల్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప, మనకు నచ్చిన విధంగా లేక, అధికారులకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇవ్వడం ఉండదు.

*అలాగే సెలవుల కోసం అని ఏదో ఒక సర్టిఫికెట్ తెచ్చుకుని సెలవులు పెట్టేస్తే కొన్ని నష్టాలు ఉంటాయి. APGLI వంటి క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి.

*అలాగే సర్టిఫికెట్ జెన్యూన్ కాదు. అనారోగ్యం నిజం కాదు అని అధికారులు సందేహ పడితే కనుక మెడికల్ బోర్డు కు రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బోర్డు కనుక ఫేక్ అని తేల్చితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు.

*Other than medical leaves అధికారుల విచక్షణ మేరకు 180 days ఒకే సారి పెట్టుకోవచ్చు.

*ఇంక్రిమెంట్ వాయిదా పడదు. సాధారణ సమయానికే వస్తుంది. అయితే సెలవులో ఉండగా ఇంక్రిమెంట్ వస్తే, డ్యూటీ లో చేరిన తరువాత మాత్రమే జీతం లో కలుస్తుంది.

*లీవ్ శాలరీ ఎప్పుడూ సెలవు లోకి వెళ్ళే ముందు రోజు ఏ బేసిక్ మీద జీతం పొందుతున్నామో, అదే బేసిక్ పై సెలవు మొత్తం జీతం వస్తుంది.

ప్రశ్న: 3
*Emergency situation లో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందా? లేక కచ్చితంగా Asst Civil Surgeon దగ్గర తీసుకోవాలా!?*

సమాధానము:
*అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుండి ఉండాలి. (గెజిటెడ్ అయితే సివిల్ సర్జన్)*