Thursday 23 April 2020

గిరిజనులకు 100% కోటా చట్టవిరుద్ధం

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో టీచింగ్‌ పోస్టులపై సుప్రీం కోర్టు*
*50 శాతం మించరాదని తీర్పు*
*2000 నాటి నిర్ణయం కొట్టివేత*

న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని పాఠశాలల్లో  టీచింగ్‌ పోస్టులలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం చట్టవిరుద్ధమని, ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాలు చేస్తూ చేబ్రోలు లీలా ప్రసాద్‌ రావు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు 152 పేజీల తుది తీర్పు వెలువరించింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2000వ సంవత్సరంలో నాటి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.*

*ఇందిరా సహానీ కేసు తీర్పును ఉటంకిస్తూ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16(1)ని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ఉల్లంఘించిందని పేర్కొంది. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్లు కల్పించడం వివక్షతో కూడినదని, ఇది ఆర్టికల్‌ 16కు విరుద్ధమని పిటిషనర్‌ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. అయితే ఇప్పటి వరకు జరిగిన నియామకాలకు రక్షణ కల్పించింది.*

షెడ్యూల్డ్‌ ఏరియాల్లోని పాఠశాలల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ 1986లో నాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాన్ని 1989లో ట్రైబ్యునల్‌ రద్దు చేసింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను 1998లోనే అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ఇది కాదని 2000లో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి కొట్టేశాక మళ్లీ ఎందుకు జారీ చేశారంటూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ అప్పీలుకైన రూ.5 లక్షలను ఏపీ, తెలంగాణలు భరించాలని కోర్టు ఆదేశించింది.

@22-04-2020 రోజునాడు సుప్రీంకోర్టు 5 గురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం, ఏజన్సీ ఏరియాలో (షెడ్యూల్డ్ ఏరియాలో) 100% టీచర్ ఉద్యోగాలు ఏజన్సీ ఏరియా గిరిజనుల ద్వారా మాత్రమే నింపాలని చెబుతున్న GOMS No. 3 of 2000 ను రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటిస్తూ, ఆ జీవోను కొట్టి వేస్తూ, ఈ జీవో ద్వారా ఇప్పటికే జరిగిన నియామకాలను కొనసాగించాలని, ఇక ముందు నియామకాలు మాత్రం ఈ జీవో ద్వారా చేయవద్దని ఆదేశించింది. ఈ క్రింది జడ్జిమెంట్ ను  పరిశీలించండి.*