Saturday 25 April 2020

*పదో తరగతి వరకు ఆన్‌లైన్‌లో పుస్తకాలు*

*🌎వచ్చే 2020 - 21విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాలన్నీ డిజిటలైజేషన్‌ చేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను www.scert.telangana.gov.in  వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు T-SAT యాప్‌లో వీడియోల రూపంలో పాఠాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ దఫా ప్రైవేట్‌ పాఠశాలలు ట్యూషన్‌ ఫీజులు పెంచినా, మొత్తం రుసుము ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి తెచ్చినా 18004257462 టోల్‌ఫ్రీ నంబరుకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చన్నారు.    commr.edn.greviance@gmail.com కు సైతం మెయిల్‌ పంపొచ్చని ఆమె సూచించారు.
  1 నుండి 10 వ తరగతి వరకు అన్ని  సబ్జక్ట్స్ పాఠ్య పుస్తకాల కొరకు  ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి . 

* SCERT TELANGANA I to X CLASS All Subject & Medium wise e-Text Books