Monday 20 April 2020

ఉద్యోగుల ఏప్రిల్ 2020 వేతనాల్లో కూడా 50% కోత

🔷పింఛనుదారుల కుటుంబాలకు చెల్లింపు..75%

 ♦కరోనా విస్తృతి, అధ్వాన్య రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో ఏప్రిల్ నెల వేతనం కూడా ఉద్యోగులకు కోత పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ G.O.Ms.No. 32 dt.20.04.2020 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీస్ అధికారుల వేతనాల్లో 60 శాతం, అన్ని రకాల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, నాల్గో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో 10 శాతం వేతనాలు కోత పడనున్నాయి. అయితే ఇవి కోతలు కాదని తాత్కాలిక చెల్లింపుల వాయిదానేనని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెల కూడా ఎపిడెమిక్ డిసీజెస్ యాక్టు 1897(సెక్షన్-2) ప్రకారం ఉద్యోగుల వేతనాల్లో కొంత భాగాన్ని వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నది. 
*  Memo No.2978 dt. 27.03.2020 Admission of Pay Bills through Online
* G.O.Ms.No. 27 dt.30.03.2020 Govt Employees March 2020 - Deferment of 50% in gross salary
* G.O.Ms.No. 28 dt. 03.04.2020 Payment of full salary to Medical & Police Departments
* G.O.Ms.No. 30 dt.07.04.2020 Deferment of Payment Exemption GHMC Regular & Outsource Emp.
* G.O.Ms.No. 45 dt. 22.03.2020 Covid-19 Lockdown Orders - Certain Instructions 
* G.O.Ms.No. 46 dt. 23.03.2020 Covid - 19 Lockdown further Orders