Wednesday 10 June 2020

G.O.Ms.No.57 dt: 9.6.2020 Transport Facility to the Children of the Habitation without Schools

*21,964 మంది విద్యార్థులకు రవాణా భత్యం*
*- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం*
     *పాఠశాలలకు అందుబాటు లేని విద్యార్థులకు రవాణాభత్వం ఇస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ  ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్రరాంచంద్రన్ జీవో ఆర్టీ నెంబర్‌ 57 ను విడుదల చేశారు. విద్యాశాఖ చట్టం నిబంధనల ప్రకారం ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లకు యూపీఎస్‌, ఐదు కిలోమీటర్లలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. ఇలా లేకుంటే ఆయా గ్రామాల విద్యార్థులు, పాఠశాలలున్న గ్రామాల్లోకి వెళ్లి చదువుకునేందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వాలు భరించాలని చట్టంలో ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 2243 ప్రాంతాలకు చెందిన 21,964 మంది విద్యార్థులకు ఈ ఏడాది ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున రవాణా భత్వం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
@ G.O.Ms.No: 57. Dt. 9.6.2020 Providing Transport facility to the children of the Habitation without Schools