Wednesday 10 June 2020

CSIR INNOVATION AWARDS

స్కూల్​ పిల్లలకు లక్ష రూపాయల పోటీ: క్యాష్​ ప్రైజెస్​

*సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు*

ప్రైవేటు, గవర్నమెంట్​ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్​ఐఆర్​ (CSIR Council of Scientific and Industrial Research) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది. 12వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు. 18 ఏళ్లలోపు వయస్సుండాలి.

@ఫస్ట్ ప్రైజ్;                       రూ.లక్ష

@సెకండ్ ప్రైజ్(ఇద్దరికి)    రూ.50వేలు

@థర్డ్ ప్రైజ్(ముగ్గురికి)        రూ.30వేలు

@ఫోర్త్ ప్రైజ్(నలుగురికి)     రూ.20వేలు

@ఫిఫ్త్ ప్రైజ్(ఐదుగురికి)     రూ.10వేలు

 * పూర్తి వివరాలకు ciasc.ipu@niscair.res.in కు మెయిల్ చేయవచ్చు లేదా www.csir.res.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

* ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్ లేదా సొల్యూషన్.. ఏదైనా ఇంగ్లిష్ లేదా హిందీలో 5000 పదాలకు మించకుండా రాయాలి. మీ స్కూల్ ప్రిన్సిపల్ ధ్రువీకరణతో పంపించాలి.

* చివరి తేదీ; జూన్ 30 . ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.

* బెస్ట్ 15 ఎంట్రీలకు క్యాష్ ప్రైజ్‌తో పాటు సర్టిఫికెట్ అందిస్తారు.