Wednesday 28 April 2021

Teacher's Diary:28.04.21*🔊అ..ఆ..లు దిద్దకుండానే రెండులోకి...*

*💠సర్కారు బడుల్లో చేరిన వారి పరిస్థితి ఇది*

*🍥ఆ విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరంలో ఒక్కరోజు కూడా బడి ముఖం చూడలేదు. పలకా బలపం పట్టలేదు. కనీసం ఆ...ఆ..లు దిద్దలేదు. అంకెలు నేర్చుకోలేదు. అంటే ఒకటో తరగతిలో ఎలాంటి పునాది లేకుండానే వచ్చే ఏడాది రెండో తరగతిలోకి వెళ్లనున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను రానున్న 2021-22 విద్యా సంవత్సరంలో పైతరగతులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు రెండులోకి ప్రవేశించనున్నారు.రాష్ట్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి టీవీ పాఠాలు ప్రారంభించింది. అవి 3-10 తరగతుల వారికే పరిమితం చేసింది. ఒకటి, రెండు తరగతులకు టీవీ పాఠాలు ప్రసారం చేసినా వారు అర్థం చేసుకోలేరన్నది ప్రభుత్వ భావన. ఒకటో తరగతిలో తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులుంటాయి. తెలుగులో వర్ణమాల, రెండు మూడు అక్షరాలతో పదాలు, పదానికి తగిన బొమ్మను గుర్తించడం, బొమ్మలను చూసి కథలు చెప్పడం, వాక్యం, గేయంలోని పదాలను, అక్షరాలను గుర్తించడం, గణితంలో అంకెలు, చిన్న కూడికలు, తీసివేతలు నేర్పుతారు.  ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఒకటో తరగతిలోకి ప్రవేశించే ముందు మూడేళ్లు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువుతారు. కాబట్టి గతేడాది ఒకటో తరగతి చదవకున్నా వారి పరిస్థితి కొంత మెరుగని చెబుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో మొదటి రెండు మూడు నెలలు ఒకటో తరగతిలోని ప్రాథమికాంశాలను నేర్పేలా ప్రణాళిక అత్యంత ముఖ్యమని ఎస్‌జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖామ్రోద్దీన్‌ అభిప్రాయపడ్డారు.*

*💥విద్యాసంవత్సరం ప్రారంభాన్ని బట్టే ప్రణాళిక*

*🌀వచ్చే విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది కరోనా పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తారని, సకాలంలో ప్రారంభమైతే ఒకటి, రెండు తరగతులను కలిపి చెప్పడానికి వీలవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. విద్యాసంవత్సరం ప్రారంభాన్ని బట్టి ప్రణాళికలు ఉండాలన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) సంచాలకురాలు రాధారెడ్డి మాట్లాడుతూ ఒకటో తరగతిలో నేర్చుకొని అంశాలను నష్టపోకుండా తగిన విధంగా కృత్య పత్రాల(వర్క్‌ షీట్లు)ను రూపొందిస్తామన్నారు. కింది తరగతుల్లోని అంశాలపై పునశ్చరణ కోసం ఏటా నిర్వహించే 45 రోజులు ‘మూలాల్లోకి వెళ్దాం’ అనే కార్యక్రమంపై దృష్టి పెడతామని చెప్పారు.*
@@@@@

*🔊సీఏ ఇంటర్‌, ఫైనలియర్‌ పరీక్షలు వాయిదా*

*🍥మే నెలలో జరగాల్సిన సీఏ ఇం టర్‌, ఫైనలియర్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చా ర్టర్డ్‌ అకౌంటంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. సీఏ ఇంటర్‌ పరీక్ష లు మే 22 నుంచి జరగాల్సి ఉండగా ఫైనలియర్‌ పరీక్షలు మే 21 నుంచి జ రగాల్సి ఉంది. కొత్త తేదీలను పరీక్షలకు 25 రోజుల ముందు ప్రకటిస్తామని ఐసీఏఐ మంగళవారం పేర్కొంది.*
@@@@@@
*🔊ప్రభుత్వ బీమా పాలసీకి మరో చాన్స్‌*
*🍥తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకం కింద 53 ఏళ్లకు నిండటానికి ముందే చందాలు కట్టి పాలసీలు తీసుకోని వారికి ఆయా పాలసీలకు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారంతా పాలసీలకు దరఖాస్తు చే సుకోవడానికి ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ దాకా గడువునిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం జీవో జారీ చేశారు. ఇక 53 ఏళ్ల వయసు దాటి పరిమితికి మించి చందాలు కట్టిన వారికి ఆ చందా మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా విడుదల చేయాలని నిర్దేశించారు.  పదవీ విరమణకు ఐదేళ్లలోపు వారంతా పాలసీ తీసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం పదవీ విరమణ వయసును పెంచడంతో 53 ఏళ్లు దాటి న వారు కూడా పాలసీలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు.*
@@@@@
*🔊ఫీజులు కట్టాల్సిందే*

*🔶విద్యార్థులకు ప్రైవేటు కాలేజీల హుకుం*

*🔷ప్రభుత్వం వద్దన్నా సెలవుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు*

*🔶ఇంటర్‌బోర్డు ఆదేశాలు బేఖాతరు*
*🍥ఇంటర్‌బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా కొన్ని ప్రైవేటు కాలేజీలు వక్రమార్గాలను అనుసరిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనూ ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫీజులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం నుంచి మే 31 వరకు ఇంటర్‌బోర్డు వేసవి సెలవులుగా ప్రకటించింది. సెలవురోజుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఆదేశాలు జారీచేసింది. 2021-22 విద్యాసంవత్సరాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. జూన్‌ ఒకటి తర్వాత కాలేజీలు తెరవడం, విద్యాసంవత్సరం కొనసాగింపుపై స్పష్టతనిస్తామని అధికారులు ప్రకటించారు. రీ ఓపెన్‌ తర్వాత కాలేజీలు 30-40 రోజులు మాత్రమే నడిచాయి. ఈ కొద్ది రోజులకే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు రూ.50-80 వేలు ఫీజులుగా వసూలుచేశాయి.*

*🌀ఇవి చాలవన్నట్టు మిగతా బకాయిలను సైతం చెల్లించాలంటూ హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ఫీజు బకాయిలు కడితేనే సెకండియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతిస్తామని బెదిరిస్తున్నాయి. ఫస్టియర్‌ విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులకు ఫీజులకు లింకుపెట్టి ఇదే తరహా హెచ్చరికలు జారీచేశాయి. ఈ విషయం ఇంటర్‌బోర్డు అధికారులకు తెలియడం, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో తప్పనిసరై ఇంటర్నల్స్‌ మార్కులను అప్‌లోడ్‌కు సిద్ధపడుతున్నాయి. ఇక సెకండియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులను అవకాశంగా తీసుకొని ఫీజుల వసూలుకు తెగబడుతున్నాయి. ఇంటర్‌బోర్డు అధికారులు ఇలాంటి వాటిని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ స్పందిస్తూ.. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.*
@@@@@
*🔊‘డిగ్రీ’ సెలవులపై పరిశీలన!*

*🍥కరోనా వ్యాప్తి నేపథ్యంలో రా్రష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు సైతం సెలవులు ఇవ్వాలని కళాశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యామండలి నుంచి యూనివర్సిటీల వారీగా విద్యాసంవత్సరాన్ని ఎప్పటివరకు ఖరారుచేశారు, ఎప్పటివరకు సెలవులు ఇవ్వొచ్చు అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడగా, డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్నారు. అధ్యాపకులంతా విధులకు హాజరై ఆన్‌లైన్‌ తరగతులను పర్యవేక్షిస్తున్నారు. పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారని, సెలవులు ఇవ్వాలని అధ్యాపకులంతా విజ్ఞప్తిచేస్తున్నారు.*
@@@@@
*🔊టీజీయూజీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పెంపు*

*🌀తెలంగాణ గురుకులం అండర్‌గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీయూజీసెట్‌) ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. 2021-22 ఏడాదిగాను బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ఫస్టియర్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ గడువును మే 30 వరకు పొడిగిస్తూఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సోషల్‌ అండ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. www.tswreis.in  వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది*
@@@@@
👆*🔊విద్యాశాఖలో 9000 పోస్టులు!*

*💠7 వేలకుపైగా బోధన, 2 వేల బోధనేతర పోస్టులు*

*🌀ప్రభుత్వానికి నివేదిక సమర్పణ*
*🍥ఉద్యోగాల భర్తీపై విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. విభాగాల వారీగా లెక్కలు తీస్తున్నది. 9 వేలకుపైగా పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు అవకాశమున్నట్టు అధికారులు తేల్చారు. ఈ ఏడాది ప్రభుత్వం భర్తీచేసే 50 వేల ఉద్యోగాల్లో 20 శాతం వరకు విద్యాశాఖకు నుంచే ఉండనున్నాయి. శాఖలవారీగా ఖాళీలను గుర్తించిన అధికారులు ఓ నివేదికను తయారుచేసి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సమర్పించారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, ఆర్థికశాఖ అనుమతిస్తే నోటిఫికేషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో 7 వేల పైచిలుకు బోధన, మరో 2 వేలవరకు బోధనేతర సిబ్బంది పోస్టులున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టుల సంఖ్య మారవచ్చని చెప్తున్నారు.*
@@@@@
*🔊వివేకానంద విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం*

*🍥 చదువుకునే బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వివేకానంద విదేశీ విద్యా ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానించాలని మంగళవారం హైదరాబాద్‌లో కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీలోగా  ww.brahminparishad. telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోసుకోవాలని సూచించారు. శ్రీరామానుజ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద 18 మంది విద్యార్థులకు 2.50 లక్షలను విడుదల చేసింది. పారిశ్రామిక ప్రోత్సాహానికి ఎంపిక చేసిన 270 మందికి రూ.6.96 కోట్ల సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.*
@@@@@

*📜ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులకుఅనుమతి వచ్చాకే పదోన్నతులు*

*💫అప్పటివరకు వేచి చూసే ధోరణిలో విద్యా శాఖ*
 *♻️రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగాప్రధానోపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం సృష్టిస్తుందా? లేదా ఉన్న టీచర్ పోస్టులనే అప్గ్రేడ్ చేస్తుందా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పోస్టుల కోసం ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు ఎదురు చూస్తున్నారు. అవి వస్తే తమకు హెడ్మాస్టర్గా పదోన్నతి లభిస్తుందన్న ఆశతో టీచర్లు ఎదు రుచూస్తున్నారు. అంతేకాదు ఆయా పోస్టుల విషయంలో స్పష్టత వచ్చే వరకు ఇతర కేటగిరీల పోస్టుల్లోనూ పదోన్న తులు చేపట్టే అవకాశాలు కనిపించట్లేదు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రాథమిక పాఠశాలల్లో 10 వేల ప్రధానోపాధ్యాయుల పోస్టులకు అనుమతి ఇచ్చాకే పదోన్న తులు చేపట్టే అవకాశం ఉంది. అయితే ప్రాథమిక పాఠశా లల హెడ్మాస్టర్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టి స్తుందా? లేక ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులనే అప్ గ్రేడ్ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఉన్న 4,429లో ఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) హెడ్ మాస్టర్ పోస్టులను ఆ 10 వేల పోస్టులనుంచిమినహాయిస్తుందా...అవి అలాగే ఉండగా, అదనంగా 10 వేల పోస్టులను కొత్తగా కేటాయిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అప్పటివరకు ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పేలా లేవు*

*♻️ఇతర శాఖల్లో పదోన్నతులు కల్పించినా...*

*🍥రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు చేప టాలని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దాంతో కొన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించారు. అయితే విద్యా శాఖలో మాత్రం పదోన్నతులు ఇవ్వలేదు. అయితే ఇటీవల పదోన్న తుల ప్రక్రియ వేగవంతం చేయాలని విద్యా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పదోన్నతుల కోసం విద్యాశాఖ కసరత్తు చేసింది. అయితే ఆ తర్వాత సీఎం కేసీఆర్ పీఎ స్ హేచ్ఎం పోస్టులు ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు విద్యా శాఖ కొత్త పోస్టుల సృష్టి కోసం ఆర్థిక శాఖకు ప్రతి పాదనలు పంపింది. మరి ఆర్థిక శాఖ కొత్త పోస్టులను సృష్టించి అనుమతిస్తుందా..? ఉన్న పోస్టులనే అప్ డ్ చేసేందుకు అనుమతిస్తుందా? ఇస్తే ఎన్ని పోస్టులకు అనుమ తిస్తుందనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పోస్టులను అప్ గ్రేడ్ చేస్తే వాటిల్లో ఎస్జీటీలకు పదోన్నతులు ఇస్తారు. ఆ మేరకు ఎస్ఓటీ పోస్టులు తగ్గిపోతాయి కాబట్టి తగ్గిన మేరకు ఎసీటీ పోస్టులను సృష్టించి, టీచర్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ) ద్వారా భర్తీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కొత్తగా పీఎస్చ్ఎం పోస్టులను సృష్టిస్తే వాటిల్లో ఎస్టీలకు పదోన్నతులు కల్పిస్తారు. పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన ఎస్జీటీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అర్హులైన ఎస్టీలకు పీఎస్ పోస్టుల్లో పదోన్నతులు పొందిన వారు పోగా, మిగతా వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలి. స్కూల్ అసిస్టెంట్లకు హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలి. అయితే ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, పండిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్, పీఈటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ (పీఈటీ), స్కూల్ అసిస్టెంట్ నుంచి హైస్కూల్శాఖ కసరత్తు చేసింది. అయితే ఆ తర్వాత సీఎం కేసీఆర్ పీఎ సాచ్ఎం పోస్టులు ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు విద్యా శాఖ కొత్త పోస్టుల సృష్టి కోసం ఆర్థిక శాఖకు ప్రతి పాదనలు పంపింది. మరి ఆర్థిక శాఖ కొత్త పోస్టులను సృష్టించి అనుమతిస్తుందా..? ఉన్న పోస్టులనే అప్ డ్ చేసేందుకు అనుమతిస్తుందా? ఇస్తే ఎన్ని పోస్టులకు అనుమ తిస్తుందనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పోస్టులను అప్ గ్రేడ్ చేస్తే వాటిల్లో ఎస్జీటీలకు పదోన్నతులు ఇస్తారు. ఆ మేరకు ఎస్ఓటీ పోస్టులు తగ్గిపోతాయి కాబట్టి తగ్గిన మేరకు ఎసీటీ పోస్టులను సృష్టించి, టీచర్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ) ద్వారా భర్తీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కొత్తగా పీఎస్చ్ఎం పోస్టులను సృష్టిస్తే వాటిల్లో ఎస్టీలకు పదోన్నతులు కల్పిస్తారు. పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన ఎస్జీటీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అర్హులైన ఎస్టీలకు పీఎస్ పోస్టుల్లో పదోన్నతులు పొందిన వారు పోగా, మిగతా వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలి. స్కూల్ అసిస్టెంట్లకు హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలి. అయితే ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, పండిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్, పీఈటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ (పీఈటీ), స్కూల్ అసిస్టెంట్ నుంచి హైస్కూల్శాఖ కసరత్తు చేసింది. అయితే ఆ తర్వాత సీఎం కేసీఆర్ పీఎ సాచ్ఎం పోస్టులు ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు విద్యా శాఖ కొత్త పోస్టుల సృష్టి కోసం ఆర్థిక శాఖకు ప్రతి పాదనలు పంపింది. మరి ఆర్థిక శాఖ కొత్త పోస్టులను సృష్టించి అనుమతిస్తుందా..? ఉన్న పోస్టులనే అప్ డ్ చేసేందుకు అనుమతిస్తుందా? ఇస్తే ఎన్ని పోస్టులకు అనుమ తిస్తుందనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పోస్టులను అప్ గ్రేడ్ చేస్తే వాటిల్లో ఎస్జీటీలకు పదోన్నతులు ఇస్తారు. ఆ మేరకు ఎస్ఓటీ పోస్టులు తగ్గిపోతాయి కాబట్టి తగ్గిన మేరకు ఎసీటీ పోస్టులను సృష్టించి, టీచర్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ) ద్వారా భర్తీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ కొత్తగా పీఎస్చ్ఎం పోస్టులను సృష్టిస్తే వాటిల్లో ఎస్టీలకు పదోన్నతులు కల్పిస్తారు. పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన ఎస్జీటీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అర్హులైన ఎస్టీలకు పీఎస్ పోస్టుల్లో పదోన్నతులు పొందిన వారు పోగా, మిగతా వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలి. స్కూల్ అసిస్టెంట్లకు హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలి. అయితే ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, పండిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్, పీఈటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ (పీఈటీ), స్కూల్ అసిస్టెంట్ నుంచి హైస్కూల్హెడ్మాస్టర్ పోస్టుల్లో దాదాపు 15 వేల మందికి పదోన్న తులు ఇవ్వొచ్చని విద్యా శాఖ అంచనా వేసింది. వాటికి పీఎ సాచ్ఎం పోస్టులు కలిస్తే 20 వేల మందికిపైగా టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. అయితే పీఎస్ హెచ్ఎం పోస్టులు ఎన్ని ఇస్తారన్న దానిపై స్పష్టత వచ్చాకే పదోన్నతు లపై ముందుకెళ్లే అవకాశం ఉందని, పదోన్నతుల సంఖ్య పైనా స్పష్టత వస్తుందని విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.*

*💫4,429 స్కూళ్లలోనే హెచ్ఎం పోస్టులు..*

*🌍రాష్ట్రంలో 28,040 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 31 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 18,217 ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4.429 ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టులు ఉన్నాయి. అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సృష్టించినవే. ఇంకా 13,788 ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ పోస్టులే లేవు. ఉన్న పోస్టుల్లోనూ ప్రస్తుతం 2.386 మంది ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు మాత్రమే పని చేస్తున్నారు. మంజూరైన పోస్టుల్లో ప్రస్తుతం ఉన్న హెచ్ఎంలు పోగా మిగతా 2,043 పోస్టుల్లో ఎలకు హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. మరోవైపు ఇటీవల సీఎం కేసీఆర్ 10 వేల పీఎస్చ్ఎం పోస్టులను ఇస్తామని ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 4.429. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు పోగా, మరో 5,571 పోస్టులను సృష్టించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పోస్టులను కొత్తగా సృష్టిస్తారా? లేదా ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న టీచర్ పోస్టుల్లో ఒక దాన్ని పీఎన్హెచ్ఎం అప్గ్రేడ్ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. విద్యా శాఖ మాత్రం కొత్త పోస్టుల సృష్టికే ప్రతిపాదనలు పంపింది. మరోవైపు. ఇప్పుడున్న ఎల్ఎస్ఎల్ హెచ్ఎం పోస్టులు కాకుండా అదనంగా 10 వేల పోస్టులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.*
@@@@@