Tuesday 27 April 2021

Teacher's Diary : 27.4.21*🔊అసైన్‌మెంట్‌ పరీక్షలతో ఫీజులకు లింకు పెడితే చర్యలు*

*💫కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్‌ బోర్డు హెచ్చరిక*హైదరాబాద్‌,  *🌀ఇంటర్‌ అసైన్‌మెంట్‌ పరీక్షలు, ఫలితాలను ఫీజులతో ముడిపెట్టి విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాలేజీల యాజమాన్యాలను ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. ‘కరోనా కష్ట కాలంలోనూ ఫీజులం’ శీర్షికతో ఈ నెల 20న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఫీజుల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను వేదిస్తే కఠినంగా వ్యవహరించాలని ఇంటర్‌ బోర్డు ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్య ద్‌ ఉమర్‌ జలీల్‌ ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ఎథిక్స్‌, హ్యూమన్‌ వ్యాల్యూస్‌, ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్కు సంబంధించిన అసైన్‌మెంట్ల మార్కులను అన్ని కాలేజీల యాజమాన్యాలను మే-5లోపు ఇంటర్‌ బోర్డుకు సమర్పించాలని కోరారు.* 
*****
*🔊తొలి ఏడాది ఆధారంగా ద్వితీయ ఇంటర్‌ మార్కులు!*

*♻️పరీక్షల నిర్వహణ సాధ్యం కాకుంటే ఇదే మార్గం*

*🌀రికార్డులతోనే ప్రయోగ పరీక్షల మార్కులు*

*📝ప్రత్యామ్నాయాలపై ఇంటర్‌బోర్డు కసరత్తు*


 హైదరాబాద్‌: *🌍కరోనా తీవ్రత నేపథ్యంలో ఇంటర్‌ రెండో సంవత్సర పరీక్షల నిర్వహణ సాధ్యం కాకుంటే.. మొదటి ఏడాదిలో వచ్చినన్ని మార్కులనే విద్యార్థులకు రెండో ఏడాదిలోనూ ఇవ్వాలని ఇంటర్‌బోర్డు యోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు జరిగే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌ 1న సమీక్షించి కరోనా పరిస్థితులను బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అప్పటికి కరోనా తగ్గే అవకాశం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరీ ఆలస్యమైతే మళ్లీ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, వైద్య విద్యతో పాటు ఎన్‌ఐటీలు, ఐఐటీలు తదితరాల్లో ప్రవేశాలకు సమస్య అవుతుంది. జవాబుపత్రాల మూల్యాంకనానికి ప్రైవేట్‌ అధ్యాపకుల వెనకడుగు కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుంది. అంతేకాక ఈ విద్యా సంవత్సరంలో 20-25 రోజులే ప్రత్యక్ష తరగతులు జరిగినందున పరీక్షల నిర్వహణ కూడా సమంజసం కాదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్‌బోర్డు అధికారులు సైతం పరీక్షలు జరగకపోతే ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏ ప్రాతిపదికన మార్కులు ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నారు. తొలి ఏడాది మార్కుల ఆధారంగా ఇవ్వటమే తగిన ప్రత్యామ్నాయమన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ తమకు మార్కులు సరిపోవనుకున్న వారికి.. తదనంతరం పరీక్షలు జరిపినప్పుడు మళ్లీ రాసుకునే ఐచ్ఛికం కూడా ఇస్తారు.*

*🍥ప్రయోగ పరీక్షలూ లేనట్లే*
*విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు సైతం జరిగేలా లేవు. అలాంటప్పుడు విద్యార్థులు రాసే సైన్స్‌ రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్‌ మార్కులు కేటాయించాలని ఇంటర్‌బోర్డు భావిస్తోంది.*

*🌀ఫీజులకు ముడిపెట్టొద్దు*

*💫ఇంటర్‌ మొదటి సంవత్సర విద్యార్థులు పంపిన నైతిక, మానవీయ విలువలు; పర్యావరణ  విద్య అసైన్‌మెంట్‌ జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి మార్కులను మే 3వ తేదీలోపు ఇంటర్‌బోర్డుకు పంపాలని బోర్డు కార్యదర్శి జలీల్‌ కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. ఫీజులకు, మార్కులకు ముడిపెట్టవద్దని హెచ్చరించారు. రుసుములు చెల్లించనందున అసైన్‌మెంట్లను తీసుకోవడం లేదని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.*
****
*🔊1-9 విద్యార్థులు పైతరగతులకు..*

*📜జీఓ జారీ చేసిన విద్యాశాఖ*

హైదరాబాద్‌: *♻️కరోనా పరిస్థితుల కారణంగా 1-9 తరగతుల విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సోమవారం జీఓ జారీ చేశారు. ఈ తరగతులకు రాష్ట్రంలో డిటెన్షన్‌ విధానం లేనందున పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని, కరోనా మరింత విస్తరించకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి(2021-22) ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులు అందరూ ప్రమోట్‌ అవుతారు. జీఓ జారీతో పాఠశాల విద్యాశాఖ ఇన్‌ఛార్జి సంచాలకుడు జలీల్‌ సైతం పైతరగతులకు పంపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌జేడీలు, డీఈఓలను ఆదేశించారు.*

@@@@@
*🔊సదువులెట్ల సాగాలె*

*📚విద్యాభ్యాస పంథా మారాల్సిందే*

*🖥️ఆన్‌లైన్‌ చదువులో యాక్టివిటీ పెరగాలి*

*🌀వచ్చే విద్యాసంవత్సరంపై విద్యావేత్తల చర్చోపచర్చలు*

హైదరాబాద్‌, *🌍సరిగ్గా ఏడాది కిందట కరోనా వచ్చింది.. పరీక్షలన్నీ ఆగిపోయినయ్‌. దేశంలో బోధన రంగం ఆన్‌లైన్‌కు మారింది. మధ్యలో కొన్ని రోజులు స్కూళ్లు, కాలేజీలవైపు అడుగులుపడ్డాయి. ఏడాది గడిచింది, మళ్లీ అదే సమస్య. రెండోవేవ్‌ అంటూ వచ్చిన కరోనా వల్ల పరీక్షలన్నీ ఆగిపోతున్నయ్‌. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఐటీఐ నుంచి ఐఐటీ వరకు, డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని పరీక్షలు అటకెక్కుతున్నయ్‌. గతంలో ఇదే సమస్య. ఇప్పుడూ ఇదే సమస్య. అప్పుడూ గందరగోళమే, ఇప్పుడూ అదే పరిస్థితి. ఇప్పటికే రెండేండ్లు గడిచిపోయాయ్‌. త్వరలో మరో విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో బోధన కొనసాగకుండా, పరీక్షలు రాయకుండా విద్యాసంవత్సరాలు గడిచిపోతే ప్రతిభానైపుణ్యాల మాటేమిటి? ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైనా యాక్టివిటీ ఎంత ఉంది? విద్యాశాఖ ఏం చేయాలి? టీచర్లు ఎలాంటి ప్రణాళికలు రచించాలి? అన్న సమాధానాలు వెతకాలని విద్యావేత్తలు చెప్తున్నారు. ఆ దిశగా విద్యాశాఖ చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. ముందుగానే విద్యాసంవత్సరం ప్రారంభించాలని, వారంలో రెండు రోజులు ప్రత్యక్ష తరగతులు, రెండు రోజులు ఆన్‌లైన్‌ క్లాసులు, మరో రెండు రోజులు అసైన్మెంట్లు, ప్రాజెక్టు ఇస్తూ ముందుకు సాగాలని ఎన్సీఈఆర్టీ సభ్యుడు పీ మురళీమనోహర్‌ సూచించారు. 4జీ, 5జీలను ఉపయోగించుకొని మూరుమాల ప్రాంతాల విద్యార్థులకూ విద్యను అందించాలని వెల్లడించారు.*

*🌍ఆన్‌లైన్‌ బోధనకు టీచర్లను సన్నద్ధం చేయాలి*
*కరోనా ఎంతకాలముంటుందో తెలియదు. ఇప్పటికే పిల్లలు రెండేండ్లు నష్టపోయారు. ఇంకా నష్టపోయే ప్రమాదముంది. ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నా యాక్టివిటీ సరిగ్గా లేదనే వాదనలు ఉన్నాయి. అంటే.. పిల్లలకు ఆసక్తిరేపేలా, ఉత్సుకత పెంచేలా బోధన జరుగటం లేదనే అర్థం. నా మట్టుకు నేను పాఠం చెప్పిన.. నా పని అయిపోయిందన్న భావనలో టీచర్లు ఉంటున్నారు. ఇది సరికాదు. గ్రూపు డిస్కషన్లు పెట్టాలి. వీలైనంతమేర పిల్లలను భాగస్వాములను చేయాలి.*
– ప్రొఫెసర్‌ తిరుపతిరావు, ఉస్మానియా పూర్వ వైస్‌చాన్స్‌లర్‌


*💫ఆసక్తిగా వినే ఏర్పాట్లు చేయాలి*

*🍥ప్రత్యక్ష తరగతి గది బోధన, ఉపాధ్యాయుడి సమక్షంలో నేర్చుకున్న దానితో పొల్చితే ఆన్‌లైన్‌ క్లాసులు అంత ప్రభావం చూపవు. ఆన్‌లైన్‌ క్లాసుల పంథాను మార్చి, విద్యార్థులు ఆసక్తిగా వినేలా బోధించేందుకు ఏర్పాట్లు చేయాలి.*
– *🎙️కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ*

@@@@
*🔊ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు జ్యోతిబా పూలే సొసైటీ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం*

హైద‌రాబాద్ : *🌍ఇంట‌ర్మీడియ‌ట్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు అర్హ‌త‌గ‌ల బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీ అభ్య‌ర్థుల నుండి మహాత్మా జ్యోతిబా ఫూలే సొసైటీ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్‌ విద్యా సంస్థల సంఘం సోమవారం బాలురు, బాలికల కోసం జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అదేవిధంగా విద్యార్థినుల కోసం డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం యూజీ కోర్సుల ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. దరఖాస్తులను మే 31 వరకు http://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.*
@@@@
*🔊డీఎడ్ కాలేజీలకు వేసవి సెలవులు*

హైదరాబాద్,  *🌍రాష్ట్రంలోని డీఎడ్ కాలేజీలకు విద్యాశాఖ అధికారులు వేసవి సెలవులు ప్రకటిం చారు. ఇవి కూడా జూనియర్ కళాశాలలతో సమానం కావడంతో మంగళవారం నుంచి మే 31 వరకు సెలవులు ప్రకటిస్తూ సోమ 'వారం పాఠశాల విద్యాశాఖ ఇంచార్జి డైరెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో 10 ప్రభుత్వ, మరో 167 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలోని డీఎడ్ కాలేజీలన్నింటికీ సోమవారమే చివరి పనిదినంగా ప్రకటించడమే కాకుండా, వీటిని తెరవడంపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.*
@@@@
*🔊బీసీ గురుకులాల్లో అడ్మిషన్లకుమే 31 వరకు గడువు*


*🍥బీసీ గురుకులాల ఇంగ్లీష్ మీడియం జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లకు దరఖాస్తులు తీసుకుంటున్నామని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. అర్హత ఉన్న స్టూడెంట్లు mjptbcwreis.telangana. gov.in వెబ్సైట్లో మే 31వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.*

@@@@

*🔊పరీక్ష ఫీజు చెల్లించిన వారే పాస్*

*💫ఎస్సెస్సీలో విద్యార్థుల ఉత్తీర్ణతపై విద్యాశాఖ స్పష్టత*


హైదరాబాద్, *🌀ఎస్సెస్సీలో విద్యా ర్థుల ఉత్తీర్ణతపై విద్యాశాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. పరీక్ష ఫీజు చెల్లించినవారు మాత్రమే ఉత్తీర్ణులని వెల్లడించారు. ఈ లెక్క ప్రకారం 5,21,392 విద్యార్థులు పాస్ అయినట్టని చెప్తున్నారు. విద్యాశాఖ రికా ర్డుల ప్రకారం రాష్ట్రంలో 5,46,865 మంది విద్యార్థులు ఎస్సెస్సీలో ప్రవేశాలు పొందారు. వీరిలో 5,21,392 మంది మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించారు. మిగతా 25,473 మంది విద్యార్థులు పలు కారణాలతో పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లించనివారు తమ పరిస్థితి ఏమిటని అధికారులను కలిసి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అధికారి స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించినవారు మాత్రమే పాస్ అయినట్టని వెల్లడించారు. విద్యార్థుల కు గ్రేడ్లు కేటా యింపుపై ఎస్సెస్సీ బోర్డు అధికారులు కసరత్తుచేస్తున్నారు.*
@@@
*🔊పాఠ్యపుస్తక ముద్రణాసంస్థలో పదోన్నతులకుకమిటీ*

హైదరాబాద్, *📚ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణా సంస్థలో మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పాఠ్యపుస్తక ముద్రణా సంస్థ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ వ్యవహా రాలు చూసే డిప్యూటీ సెక్రటరీ/ జాయింట్ సెక్రట రీ/అడిషనల్ సెక్రటరీలను సభ్యులుగా ముగ్గురితో కూడిన కమిటీని నియమించారు. 2020-21, 2021-22 ప్యానల్ ఇయర్లకు పదోన్నతులు కల్పిం చేందుకు వీలుగా దీనిని ఏర్పాటుచేశారు.*
@@@@