Monday 10 May 2021

Teacher's Diary : 10.05.2021



1).🔊వ‌చ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవ‌లు*

న్యూఢిల్లీ : వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి గూగుల్ ఉచిత సేవ‌లు నిలిచిపోనున్నాయి. ఒక‌వేళ ఎవ‌రైనా వినియోగ‌దారులు గూగుల్ సేవ‌ల‌ను పొందాల‌నుకుంటే జూన్ 1 నుంచి డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగ‌దారుల‌కు విష‌యం తెలియ‌డానికి గాను తొలుత గూగుల్ ఫొటో ఉచిత క్లౌడ్ నిల్వ సౌకర్యాన్ని నిలిపివేస్తున్న‌ది. గూగుల్ ఫొటో క్లాట్ స్టోరేజ్‌లో ఫొటోలు సేవ్ చేసుకోవాలంటే ఇక‌పై గూగుల్ సంస్థ పేర్కొన్న విధంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం, గూగుల్ సంస్థ త‌మ వినియోగదారులకు అపరిమిత ఉచిత నిల్వ సేవ‌ల‌ను అందిస్తున్న‌ది. దీని వ‌ల్ల‌ వినియోగదారులు వారి ఫొటోలు, ఇతర పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేసుకునే వీలుండేది. వీటిని ఇంటర్నెట్ ద్వారా ఎక్కడైనా అందుబాటులో తీసుకోవ‌చ్చేది. అయితే, ఈ సేవ‌ల‌కు ఛార్జీలు చెల్లించిన మీద‌ట వ‌చ్చే జూన్ నెల నుంచి వాడుకోవ‌చ్చ‌ని గూగుల్ సంస్థ స్ప‌ష్టం చేసింది. అయితే, వ‌చ్చే నెల నుంచి వినియోగదారులకు 15 జీబీ ఉచిత క్లౌడ్ నిల్వను మాత్రమే అందించ‌నున్న‌ది. వినియోగదారులు దీని కంటే ఎక్కువ ఫొటోలు లేదా పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేయాలనుకుంటే మాత్రం వారు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

*ఎంత ఛార్జీలు వసూలు చేస్తారు..*

వినియోగదారులకు 15 జీబీ క‌న్నా అదనపు డాటా అవసరమైన ప‌క్షంలో.. నెలకు 1.99 డాల‌ర్లు (రూ.146) చెల్లించాలి. సంస్థ తరపున దీనికి గూగుల్ వన్ అని పేరు పెట్టారు. దీని వార్షిక చందా ఛార్జీ 19.99 డాల‌ర్లు (దాదాపు రూ.1,464). అయితే, కొత్త ఫొటోలు, వీడియోల నిల్వ కోసం మాత్ర‌మే వినియోగదారులు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పాత ఫొటోలు మునుపటిలా సురక్షితంగా నిల్వ చేయబడతాయి. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు ఉచిత అధిక నాణ్యత గల ఫొటో బ్యాకప్‌ను ఉపయోగించుకోవ‌చ్చు. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 2,3,4,5 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఉచిత ఫొటో, వీడియో స్టోరేజ్ సౌకర్యం కూడా లభిస్తుంది.

@@@@@

2).*💠🦠గాలిలో వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం?*

*📜అమెరికా సీడీసీ తాజా మార్గదర్శకాలు*

*⏺️వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి గాలి ద్వారాను వ్యాప్తి చెందుతుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు వెల్లడించడం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. అయితే, గాలిలో వైరస్‌ కణాలు ఎంత దూరం వ్యాప్తి చెందుతాయనే విషయంపై అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) మరోసారి స్పష్టతనిచ్చింది. వైరస్‌ సోకిన వ్యక్తినుంచి 3 నుంచి 6 అడుగులలోపు వ్యాప్తి అధికంగా ఉంటుందని.. వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో ఆరు అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాప్తికి అవకాశం ఉంటుందని అమెరికా సీడీసీ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.*

*⭕మూడు విధాల్లో వైరస్‌ వ్యాప్తి*

 *వైరస్‌ సోకిన వ్యక్తులనుంచి శ్వాసించినప్పుడు వెలువడే స్వల్ప శ్వాసబిందువుల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని ఇప్పటికే వెల్లడైంది. ఇది 3 నుంచి ఆరు అడుగుల లోపల ఈ సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని  సీడీసీ స్పష్టంచేసింది. వైరస్‌ వ్యాప్తి మూడు విధాలుగా సీడీసీ వర్గీకరించింది.*

*1 అతిచిన్న శ్వాసకోస కణాలను నేరుగా పీల్చడం,*

*2 వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు నేరుగా ఇతరుల ముక్కు, నోరు వంటి శ్లేష్మ పొరలపై వైరస్‌ కణాలు చేరడం* 

*3. వైరస్‌తో కలుషితమైన ప్రదేశాలను నేరుగా చేతులతో తాకడం వల్ల వైరస్‌ మరొకరికి సంక్రమించే అవకాశాలను సీడీసీ విశ్లేషించింది.*

*💢వెంటిలేషన్‌ లేని ప్రాంతాల్లోనే..*

*🔷శ్వాసించినప్పుడు లేదా తుమ్మడం, దగ్గడంవల్ల విడుదలయ్యే సూక్ష్మబిందువుల్లో కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నవి అత్యంత తొందరగా(సెకన్ల నుంచి నిమిషాల్లోనే) నేలపై పడిపోతాయి. కానీ, అత్యంత స్వల్ప పరిమాణంలో మిగిలిపోయిన కణాలు మాత్రం ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు గాలిలోనే క్రియాశీలంగా ఉంటాయి. అవి గాలిలో ఎంత సమయం ఉంటాయనే దానిపై ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, తేమ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి భౌతికంగా దూరంగా ఉన్నప్ప్పుడు వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుందని సీడీసీ మరోసారి స్పష్టం చేసింది. భౌతిక దూరం ఆరు అడుగుల కన్నా ఎక్కువగా ఉంటే వైరస్‌ సంక్రమణ చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా గాలి బయటకు వెళ్లలేని (వెంటిలేషన్‌) లేని ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. వైరస్‌ సోకిన వ్యక్తి ఇండోర్‌ ప్రదేశాల్లో 15 నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు ఉన్నట్లయితే వైరస్‌ వ్యాప్తి ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇక కొన్ని కేసుల్లో వైరస్‌ సోకిన వ్యక్తి వెళ్లిన మార్గంలో వెంటనే వెళ్లిన వాళ్లలో వైరస్‌సోకే ప్రమాదం ఉంటుందని సీడీసీ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.*

*😷అందుకే మాస్కు, భౌతిక దూరాలే కీలకం..*

 *🔸కరోనా వైరస్‌ గాలిలోనూ వ్యాపిస్తుందని తేలిన నేపథ్యంలో మాస్కులు ధరించడం, ఆరు అడుగుల దూరం పాటించడం, సరిపడ వెంటిలేషన్‌ ఉండేటట్లు చూసుకోవడం, ఇండోర్‌ ప్రాంతాల్లో గుంపులుగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండడం కొవిడ్‌ వ్యాప్తిని నిర్మూలించడంలో ఉత్తమమైన మార్గాలు అని అమెరికా సీడీసీ మరోసారి స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో కీలకమని సూచించింది.

@@@@@

3). *🔊రాష్ట్రంలో త్వరలో మిశ్రమ విద్యావిధానం🖥️*

🌍విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి మిశ్రమ విద్యా విధానం తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. అందుకోసం ప్రభుత్వపాఠశాలల విద్యార్థులకు అందించే విద్యా బోధనలో సాంకేతికతను జోడించాలని నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లలో ప్రతి విద్యార్ధికి ప్రత్యక్ష బోధనతో పాటు డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి మిశ్రమ విద్యా విధానాన్ని కొనసాగిం చడానికి రాష్ట్ర విద్యాశాఖ డిజిటల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించినట్లు తెలిసింది. తద్వారా విద్యార్థులు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో పోటీని ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉంది.
 పాఠశాలలతో పాటు ఉన్నత విద్యలోనూ డిజిటల్ విద్యకు సంబంధించి ప్రత్యేకంగా పాలసీని విద్యాశాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ డిజిటల్ ఎడ్యుకేషన్ డ్రాఫ్ట్ పాలసీని రూపొందించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా బోధనకు అవసరమైన డిజిటల్ క్లాస్ట్రూమ్స్, ల్యాబ్స్, ఈ-కంటెంట్, కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ కనెక్టెడ్ లెర్నింగ్, టీచర్ ఫోరం తదితర సదుపాయాలను దశలవారిగా కల్పించనుంది.

@@@@@

4) *🔊ఎన్వోసీ ఉంటేనే అఫిలియేషన్‌  - నిరభ్యంతర పత్రాలుంటేనే కాలేజీలకు గుర్తింపు: ఇంటర్‌బోర్డు*

*🌀ఈ ఏడాది ఆటో అఫిలియేషన్‌ ఇవ్వండి: టీపీజేఎంఏ*

హైదరాబాద్‌, *🌍కాలేజీలు అనుబంధ గుర్తింపు పొందాలంటే నిరభ్యంతర పత్రాలు తప్పనిసరి అని ఇంటర్‌బోర్డు అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఎన్వోసీలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అఫిలియేషన్‌ ఇవ్వమని చెప్తున్నారు. ఇంటర్‌ ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చేందుకు బోర్డు ఇటీవలే నోటిఫికేషన్‌ను విడుదల చేయగా.. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానున్నది. గుర్తింపు కోసం దరఖాస్తు చేసే కాలేజీలు.. శానిటరీ సర్టిఫికెట్‌, ఫైర్‌సేఫ్టీ ఎన్వోసీ, స్ట్రక్చరల్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్‌ కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలేజీల యాజమన్యాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా కాలేజీలు హాస్టళ్లను నిర్వహిస్తుండగా.. ఆయా కాలేజీలు ఇంటర్‌బోర్డు నుంచి గుర్తింపు పొంది ఉండాలని మూడేండ్ల కిందట మార్గదర్శకాలిచ్చారు. ఈ అంశం ప్రస్తుతానికి హైకోర్టు పరిధిలో ఉన్నది. హాస్టళ్లకు అనుమతుల ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడంలేదని బోర్డు అధికారులు వెల్లడించారు. కోర్టు తీర్పు వచ్చాకే హాస్టళ్లకు గుర్తింపు ప్రక్రియను చేపడతామని చెప్తున్నారు.*

*🍥ఆటో రెన్యూవల్‌ చేయండి: టీపీజేఎంఏ*
*కరోనా నేపథ్యంలో ఇంటర్‌కాలేజీలకు గుర్తింపు ప్రక్రియలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ మేనేజ్‌మెంట్ల అసోసియేషన్‌ (టీపీజేఎంఏ) కోరింది. ఎన్వోసీలు లేకుండా ఆటోరెన్యూవల్‌ ద్వారా గుర్తింపును ఏడాదిపాటు పొడగించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. తాజా పరిస్థితుల్లో కార్యాలయాల చుట్టూ తిరిగి ఎన్వోసీలు, సర్టిఫికెట్లను పొందడం సవాల్‌తో కూడుకున్న అంశమని, ఇప్పటికే చాలామంది కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.*

@@@@@

5). *🔊ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు డీఎంఈ ఆదేశం*

*🍥హైద‌రాబాద్ : ఏప్రిల్ 2021 కాళోజీ నారాయ‌ణ‌రావు యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప‌రిధిలో ప్రాక్టిక‌ల్ అండ్ థియ‌రీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులంద‌రూ సంబంధిత టీచింగ్ హాస్ప‌ట‌ల్స్‌లో విధుల‌కు హాజ‌రు కావాల్సిందిగా మెడిక‌ల్ ఎడ్యూకేష‌న్ డైరెక్ట‌ర్‌(డీఎంఈ) డాక్ట‌ర్ కె.ర‌మేశ్ రెడ్డి ఆదేశించారు.*

*🌀కొవిడ్ మహమ్మారి సమయంలో వైద్య సిబ్బంది అత్యవసర అవసరాన్ని పరిష్కరించేందుకు ఈ చర్య అని పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు హౌస్ సర్జన్‌లుగా పనిచేయడం కొనసాగించవచ్చ‌న్నారు. అధికారికంగా చేరిన మొద‌టి రోజు నుండే వారికి స్టైఫండ్ చెల్లించబడుతుంద‌ని డీఎంఈ పేర్కొంది.

@@@@@

6)  పేదలకు 5 కిలోల చొప్పున రెండు నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ🍚

🍚మరో 80 వేల మంది ప్రైవేట్ టీచర్లు , సిబ్బందికి కూడా రూ రెండు వేల ఆర్ధిక సాయం , బియ్యం పంపిణీ

💦ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన

🍚రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి  ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి కూడా వారికి అందిస్తున్న విధంగా 2000 వేల రూపాయాలను 25 కిలోల బియ్యాన్ని అందచేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

@@@@@

@    Today's Service Info: 

        #    Job Chart

@    Today's  TRT & TET Material Info :

        #    Physical Science Methodology

@@@@@@