Monday 10 May 2021

Change Your SBI Branch through Online Net Banking

 

SBI ఖాతాదారులు ప్ర‌స్తుతం ఉన్న ఖాతాను మ‌రొక శాఖ‌కు బ‌దిలీ చేయాల‌నుకుంటే ఈ క్రింది విధానంను అనుసరించండి .
💥ఒక శాఖ‌కు నుంచి మ‌రొక శాఖ‌కు ఆన్‌లైన్ ద్వారా ఖాతాను బ‌దిలీ చేసుకునే విధానం..

1. ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి.

2. మీ యూస‌ర్ నేమ్, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించి 'ప‌ర్స‌న‌ల్ బ్యాంకింగ్‌'ను తెర‌వండి.

3. ఇప్పుడు టాప్ మినూ బార్‌లో అందుబాటులో ఉన్న‌ 'ఇ-స‌ర్వీసెస్' టాబ్‌ను క్లిక్ చేయాలి.

4. ఇందులో 'ట్రాన్స‌ఫ‌ర్ ఆఫ్ సేవింగ్స్ అక్కౌంట్' ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

5. ఇప్పుడు మీరు బ‌దిలీ చేయాల‌నుకుంటున్న ఖాతాను సెల‌క్ట్ చేసుకోవాలి. ఒక‌వేళ సీఐఎఫ్‌(క‌స్ట‌మ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఫైల్‌) కింద ఒక‌టే ఖాతా ఉంటే.. ఆ ఖాతా డిఫాల్ట్‌గా సెల‌క్ట్ అవుతుంది. 

6. ఇప్పుడు, మీరు ఏ బ్రాంచ్‌కి అయితే ఖాతాను బదిలీ చేయాలనుకుంటున్నారో.. ఆ బ్రాంచ్ కోడ్‌ను నమోదు చేయాలి. నిబంధనలు, షరతులను పూర్తిగా చదివి అంగీకారం తెలిపే బాక్స్‌లో టిక్ చేసి, స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి.

7. ఇప్ప‌టికే ఉన్న బ్రాంచ్ కోడ్‌, కొత్త బ్రాంచ్ కోడ్‌తో పాటు మీ ఖాతా బ‌దిలీ వివ‌రాల‌ను మ‌రోసారి స‌రిచూసుకుని 'క‌న్ఫ‌ర్మ్‌'పై క్లిక్ చేయ‌డం ద్వారా ధృవీక‌రించాల్సి ఉంటుంది.

8. మీరు వివ‌రాల‌ను ధృవీక‌రించిన త‌రువాత మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది. 

9. ఓటీపీని ఎంట‌ర్ చేసి మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్‌పై క్లిక్ చేయాలి. 

10.  మీ బ్రాంచి బ‌దిలీ రిక్వ‌స్ట్ విజ‌య‌వంతంగా రిజిస్ట‌ర్ అయిన‌ట్లు మీ మొబైల్‌కి సందేశం వ‌స్తుంది.

💠ఆన్‌లైన్ ఎస్‌బీఐ ద్వారా మాత్ర‌మే కాకుండా యోనో ఎస్‌బీఐ, యోనో లైట్ ద్వారా కూడా ఖాతాల‌ను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. మీ బ్యాంకు వ‌ద్ద మొబైల్ నెంబ‌రు రిజిస్ట‌ర్ చేసుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఆన్‌లైన్ ద్వారా ఈ సేవ‌ల‌ను పొంద‌గ‌లుగుతారు.