Tuesday 11 May 2021

Teacher's Diary : 11.05.2021

1) *_🔊ఎఫ్‌ఏ-1 ఆధారంగానే పది గ్రేడ్లు_ దస్త్రంపై సంతకం చేసిన విద్యాశాఖ కార్యదర్శి.

*_🥏వారం పది రోజుల్లో ఫలితాల వెల్లడి

* పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ-1) ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా దస్త్రంపై సంతకం చేశారు. దీనిపై త్వరలో జీఓ వెలువడనుంది. ప్రభుత్వ ఆమోదం లభించడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) అధికారులు గ్రేడ్లు ఇచ్చేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించారు. మరో వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆ ప్రకారం పరీక్ష రుసుం చెల్లించిన 5,21,393 మందిని ఉత్తీర్ణులుగా నిర్ణయించి గ్రేడ్లు ఇస్తారు. గత విద్యా సంవత్సరం(2020-21) కూడా ఎఫ్‌ఏ పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చారు._*

*_💥గ్రేడ్లు ఎలా ఇస్తారంటే?

*_🌀ఎఫ్‌ఏ-1కు 20 మార్కులు కేటాయించారు. అందులో వచ్చిన మార్కులను 100కి లెక్కిస్తారు.  ఉదాహరణకు 20కి 18 మార్కులొస్తే 100కి..90 వచ్చినట్లుగా పరిగణించి ఆ మేరకు గ్రేడ్లు ఇస్తారు. హిందీ మినహా మిగిలిన అయిదు సబ్జెక్టులో 91-100 మధ్య మార్కులు వస్తే ఏ1 గ్రేడ్‌ ఇస్తారు. హిందీలో మాత్రం 90 వచ్చినా ఏ1 ఇస్తారు. అప్పుడు 10కి 10 గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) సాధించినట్లుగా పరిగణిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 10 పాయింట్ల చొప్పున మొత్తం 60 పాయింట్లకు ఎన్ని వచ్చాయో లెక్కించి గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. ఉదాహరణకు అయిదు సబ్జెక్టుల్లో ఏ1 వస్తే 50 పాయింట్లు, ఒక దాంట్లో 8 పాయింట్లు వస్తే మొత్తం 58 వచ్చినట్లు. అప్పుడు సగటున ఆ విద్యార్థికి జీపీఏ 9.6 వచ్చినట్లుగా నిర్ధారిస్తారు.
@@@@@

2) *🔊9, 10 తరగతి విద్యార్థులకూ రవాణా భత్యం

*🔶అర్హులైన విద్యార్థులందరికీ ఇకపై రూ.600

*🔷వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

*🍥 విద్యాహక్కు చట్టం కింద చిన్నారులకు ఇచ్చే ప్రయోజనాలను ప్రభుత్వం విస్తరించింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలు వచ్చే విద్యా సంవత్సరం (2021-2022) నుంచి అమలు కానున్నాయి. వీటి ప్రకారం ఆవాస ప్రాంతాలకు అందుబాటులో ప్రభుత్వ బడి లేకుంటే ఇచ్చే రవాణా భత్యాన్ని వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకూ ఇస్తారు. దీనికింద విద్యార్థులందరికీ ప్రస్తుతం నెలకు రూ.300 ఇస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ.600కి పెంచారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాస ప్రాంతాలకు ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటరు, ప్రాథమికోన్నత పాఠశాలలు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలు 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. సర్కారుబడులు అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే ఆటోలు, ఇతర వాహనాల్లో పాఠశాలకు వచ్చి చదువుకోవడానికి ఒక్కో విద్యార్థికి నెలకు రూ.300 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. దాన్ని 1-8 తరగతుల వారికే ఇప్పటివరకు అమలుచేశారు. విద్యా హక్కు చట్టాన్ని 12వ తరగతి వరకు విస్తరించినందున రవాణా భత్యాన్ని 9, 10 తరగతులకు కూడా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాయి. త్వరలో ఆన్‌లైన్‌లో జరగనున్న సమగ్ర శిక్షాభియాన్‌ ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ)కి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సమర్పించనున్నాయి.*

*💥జీఓ ఇచ్చినా రవాణా భత్యం ఇవ్వలేదు

*🌀తెలంగాణలో 4,500 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. వారిలో ఎంత మంది రవాణా భత్యానికి అర్హులన్నది మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఉన్నత పాఠశాలలు అధికంగా ఉన్నందున అదనంగా లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్య 5 వేల లోపే ఉండొచ్చని అంచనా. 2020-21 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 2243 ఆవాస ప్రాంతాల్లో బడులు లేనందున 1-8 తరగతుల విద్యార్థులు 21,964 మందికి రవాణా భత్యం కింద రూ.13.17 కోట్లు అందజేస్తామని పేర్కొంటూ విద్యాశాఖ 2020 జూన్‌ 6వ తేదీన జీఓ జారీ చేసింది. అయితే 2021 జనవరి వరకు ప్రత్యక్ష తరగతులు జరగలేదు. ఫిబ్రవరి 1 నుంచి బడులు తెరుచుకున్నా 9, 10 తరగతులకు మాత్రమే పాఠాలు జరిగాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23వ తేదీ వరకు 6, 7, 8 తరగతులకు పాఠాలు జరిగాయి. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం 6, 7, 8 తరగతుల విద్యార్థులు 17,738 మందికి నెలకు రూ.300 చొప్పున రూ.53.21 లక్షలు చెల్లించాలి. పాఠశాల విద్యాశాఖ మాత్రం వాటిని చెల్లించకపోవడం గమనార్హం.
@@@@@

3).*🔊లక్ష దాటిన ఎంసెట్‌ దరఖాస్తులు
 రాష్ట్రంలో ఎంసెట్‌ దరఖాస్తులు లక్ష దాటాయి. సోమవారం నాటికి ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 67,635 మంది, అగ్రికల్చర్‌కు 33,585 మంది దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 18 వరకు దరఖాస్తు గడువు ఉంది.
@@@@@

4). *🔊ఒప్పంద అధ్యాపకులకు వేతనాలు విడుదల*

*🍥రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద (కాంట్రాక్టు) అధ్యాపకులకు ఏప్రిల్‌, మే నెల వేతనాలకు రూ.26.59 కోట్లు విడుదల చేస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వేతనాల విడుదలపై కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నేతలు రమణారెడ్డి, సురేష్‌, శోభన్‌బాబులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
@@@@@

5). *🔊ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష వాయిదా*

*🍥 హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేపట్టిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సంబంధించి ఈ నెల 30న ఆర్టీ సెంటర్‌లో నిర్వహించతలపెట్టిన రాత పరీక్షను కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు రక్షణశాఖ పౌర సంబంధాల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీని ‌www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థులు సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో కొత్త అడ్మిట్‌ కార్డులను పొందాలని సూచించారు.
@@@@@

6) *🔊రెండు విడతల్లో ‘ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ’*

*🍥: ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో వివిధ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికిగాను ‘ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ-2021’ను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి. మొదటి విడత పరీక్ష ఈ నెల 23, 24న, రెండో విడత జులై 25, 26వ తేదీల్లో ఉంటుందని వెల్లడించాయి. పరీక్షలు రిమోట్ ప్రాక్టోర్డ్‌ ఆన్‌లైన్‌ మోడ్‌ (ఆర్‌పీఓఎం)లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. వివరాలకు ‌www.srmist.edu.in వెబ్‌సైట్లో చూడాలని సూచించాయి.
@@@@@

@ Today's Service Info :


@ Today's TRT&TET Study Material Info: