Wednesday 12 May 2021

Teacher's Diary : 12.05.2021



*1).🔊లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్‌ తరగతులు ఆలస్యం*

 *🌍రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి అమలు కానున్న లాక్‌డౌన్‌ ఇంజినీరింగ్‌ తరగతులపై ప్రభావం చూపనుంది.  ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వెంటనే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని జేఎన్‌టీయూ ఇటీవలే అన్ని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఇవి కాస్త జాప్యం అయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 15 నుంచి దాదాపు సగానికి పైగా కాలేజీలు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాల్సి ఉందని జేఎన్‌టీయూ వర్గాలు తెలిపాయి. అయితే లాక్‌డౌన్‌తో తరగతుల ప్రారంభం పది రోజులు ఆలస్యం కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
@@@@@

2)*🔊వారంలో టెన్త్ ఫలితాలు*

*📜విడుదల చేసేందుకు ప్రభుత్వపరీక్షల విభాగం కసరత్తు* 

*🏆'ఎఫ్ఎ' మార్కుల ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు గ్రేడింగ్... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*

 *🍥వచ్చే వారం రోజుల్లో విద్యార్థులందరికీ గ్రేడ్లను, గ్రేడ్ పాయిం ట్లను, జీపీఏను కేటాయించి ఫలితాలు విడు దల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కాగా,పదోతరగతివిద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్-1 (ఎఫ్ఎ) ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనుంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీపక్కు మార్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్ర సిలబస్ కలిగిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర అన్ని యాజమాన్యాల్లోని పాఠశా లల పదో తరగతి విద్యార్థులకు ఈ ఉత్త వర్తిస్తాయని పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా నాలుగు ఫార్మేటివ్ అసెస్మెం ట్లకు బదులు రెండు ఎఫ్ఎలను నిర్వహిం మెంట్) నిర్వహించారని పేర్కొన్నారు.
*🌀20శాతంమార్కులతోనిర్వహించినఆఇంటర్నల్అసెస్మెంట్మార్కులఆధారంగానేచాలనివిద్యాశాఖనిర్ణయించినట్లు పేర్కొన్నారు.అయితేప్రస్తుతపరిస్థితుల్లోఒకటేఫార్మేటివ్ అసెస్మెంట్ (ఇంటర్నల్ అసెస్మెంట్ )విద్యార్థులకువచ్చిన మార్కులను బట్టిగ్రేడింగ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 20శాతంమార్కులను 100శాతానికిలెక్కించిగ్రేడ్లుఖరారు చేయాలని స్పష్టం చేశారు. ఒక విద్యార్థికిఎఫ్ఎ-1 ఒకసబ్జెక్టులో20మార్కులకువచ్చినమార్కులకుఐదింతలుచేసికేటాయిస్తారు. దీని ప్రకారం ఒక సబ్జె క్టులో 20 మార్కులు వస్తేఆవిద్యార్థికి ఆ సబ్జెక్టులో 100 మార్కులు వచ్చినట్లు పరిగణనలోకితీసుకుంటారు. ఇలా ప్రతి సబ్జె క్టులో వచ్చిన మార్కుల పరిధి ఆధారంగా ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో వచ్చిన గ్రేడు, ఆ గ్రేడ్క ఇచ్చే గ్రేడ్ పాయింట్ను కేటాయి స్తారు. చివరకు అన్నీ కలిపి జీపీఏ ఇస్తారు. హిందీ సబ్జెక్టులో పాస్ మార్కులు తక్కువ కాబట్టి మార్కుల పరిధి మిగతా సబ్జెక్టుల కంటే వేరుగా ఉంటుంది.
@@@@@

3). *🔊10 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్‌*

*💫రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా పది రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికి రీషెడ్యూల్‌ అవకాశం కల్పిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తాసిల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లకు రావొద్దని సూచించారు.*
@@@@@

4) *🔊ఇక పిల్లలపై ‘కొవాగ్జిన్‌’ ప్రయోగ పరీక్షలు!*

దిల్లీ: *🌍దేశీయ ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన ‘కొవాగ్జిన్‌’ను... రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల యువతపై ప్రయోగించి పరీక్షించనున్నారు. రెండు, మూడో దశ ప్రయోగ పరీక్షల్లో వారిపై కొవాగ్జిన్‌ను పరీక్షించవచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.
@@@@@

5) *🔊బ్యాంకులు రోజంతా పనిచేస్తాయి: ఎస్బీఐ*

*🍥లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ బ్యాం కులు మాత్రం పనిచేయనున్నాయి. అత్యవసర సేవల విభాగంలో ఉన్నందున బ్యాంకులు, ఏటీఎంలకు మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల్లో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,200 బ్రాంచిలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని హైదరాబాద్‌లోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ప్రాంతీయ కార్యాలయం తెలిపింది.*
@@@@@

@    Today's Service Info : 


@    Today's TRT & TET Study Material Info :