Thursday 13 May 2021

Teacher's Diary : 13.05.2021



1)*🔊గురుకులాలకు ‘నావా’ సహకారం  - కరోనాపై ఆన్‌లైన్‌లో అవగాహన*

 రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు కరోనాపై సహకరించేందుకు నాగార్జున విద్యాశ్రమం పూర్వవిద్యార్థుల సంఘం (నావా) ముందుకొచ్చింది. పూర్వవిద్యార్థులుగా గురుకుల టీచర్లు, విద్యార్థులకు ప్రతిరోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 7.40 వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లకు సందేహాలను నివృత్తి చేస్తామని, అవసరమైన వారికి టెలీ వైద్యం అందిస్తామని తెలిపింది. జూమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎవరైనా పాల్గొనవచ్చు. జూమ్‌ ఐడీ : 6251248389, పాస్‌వర్డ్‌ 112233. గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు సాధారణ ప్రజలు వైద్యుల సూచనలు, సలహాలు జూమ్‌ ద్వారా తీసుకోవచ్చని బీసీ గురుకుల సొసైటీ వెల్లడించింది.‘గురుకుల విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాన్ని కరోనా అదుపులోకి వచ్చే వరకు కొనసాగిస్తాం. 1986లో ఎన్టీఆర్‌ హయాంలో నాగార్జున సాగర్‌లో తొలిసారి ఏర్పాటైన బీసీ గురుకుల పాఠశాల మొదటిబ్యాచ్‌ విద్యార్థిని. ఎంబీబీఎస్‌ పూర్తయిన వెంటనే సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో నావాను 2000 సంవత్సరంలో నమోదు చేశా. ఇందులో సాగర్‌లో చదువుకున్న 150 మంది వైద్యులు ఉన్నారు’ అని నావా వ్యవస్థాపకులు డాక్టర్‌ చక్రపాణి తెలిపారు.
@@@@@

2) *🔊ఉదయం 8 నుంచి 12 వరకు బ్యాంకులు*

*🌀రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయం*

*: రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల శాఖలు రోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ వినియోగదారుల కోసం సేవలందించాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తరవాత ఎప్పుడు మూసేస్తారనేది ఆ శాఖ సిబ్బంది సొంతంగా నిర్ణయించుకోవాలి. 12 తరవాత పని చేసినా సిబ్బంది శాఖాపరమైన పనులు నిర్వహిస్తారే తప్ప వినియోగదారులకు సేవలు అందించరు.  12 గంటల వరకు మాత్రం వినియోగదారులకు అన్ని రకాల సేవలు అందించాలని సమితి సూచించింది. మంగళవారం సమితి వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాలను చర్చించింది. అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. బ్యాంకుల సిబ్బందిని ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్లు’గా గుర్తించి ప్రభుత్వం పాసులు ఇవ్వాలని సమితి సిఫారసు చేసింది. సిబ్బందికి ప్రాధాన్యతనిచ్చి కరోనా టీకాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

@@@@@

3) *🔊🏠మీ ఇల్లే పరీక్ష కేంద్రం*

*🔶వర్క్‌ ఫ్రం హోం తరహాలో ఎగ్జామ్‌ ఫ్రం హోం*

*🔷పలు వర్సిటీల సన్నాహాలు*

    పరీక్ష అంటే పొద్దునే లేచి... హాల్‌టికెట్లు, పెన్నులు, పుస్తకాలు చేత పట్టుకొని పరీక్ష కేంద్రాన్ని వెతుక్కుంటూ వెళ్లడం సర్వ సాధారణం. ఇప్పుడు అంత గాభరా అవసరం లేదు. కాలు బయట పెట్టకుండానే ఇంటి నుంచే ప్రవేశ పరీక్షలు, సెమిస్టర్‌లు రాయొచ్చు.  ఇలాంటి మార్పులకు కారణం కరోనా. ఆ వైరస్‌ మహమ్మారి విసురుతున్న సవాల్‌కు విద్యార్థులు బయటకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో వివిధ విశ్వవిద్యాలయాలు వర్క్‌ ఫ్రం హోం తరహాలో ఎగ్జామ్‌ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. గత ఏడాది  కొన్ని వర్సిటీలు దీనికి శ్రీకారం చుట్టాయి. ఈసారి దాన్ని పెద్ద ఎత్తున అమలు చేయనున్నాయి.*

*💥ఎలా నిర్వహిస్తారంటే...*

*🌀విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్‌/ల్యాప్‌టాప్‌/డెస్కుటాప్‌ ఉండాలి. వాటికి కెమెరా తప్పనిసరి. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం. ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం పంపిస్తారు. ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ అయితే బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు కాబట్టి పెన్ను, కాగితాలతో పనిలేదు. సెమిస్టర్‌లకైతే వివరణాత్మక ప్రశ్నలుంటాయి. కాగితంపై జవాబులు రాసి.. వాటిని స్కాన్‌ చేసి.. పీడీఎఫ్‌గా మార్చి అప్‌లోడ్‌ చేయాలి. గత ఏడాది ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఈ తరహాలోనే పరీక్ష నిర్వహించింది.*

*💥సన్నద్ధత ఇలా...*

*👉 జేఎన్‌టీయూహెచ్‌ గత ఏడాది విద్యార్థి సమీపంలోని కళాశాలలకు వెళ్లి పరీక్ష రాసే వెసులుబాటు ఇచ్చింది. ఈసారి ఇళ్ల నుంచే రాయించేందుకు సమాయత్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే సంస్థకు నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలా? మరిన్ని సంస్థలకు అప్పగించాలా? అని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతకు ముందు నిర్ణయించిన కాలపట్టిక ప్రకారం ఆగస్టు/సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించాలి.*

* 👉ఈ కొత్త పద్ధతివైపే ఇటీవల జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొగ్గుచూపింది. టైమ్‌టేబుల్‌ను ప్రకటించాల్సి ఉంది.*

* 👉జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ పరిధిలోని పలు స్వయం ప్రతిపత్తి హోదా(అటానమస్‌) ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలలు కూడా ఇలాగే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు విద్యార్థి గదిలో మరో మొబైల్‌ కెమెరా ద్వారా నిఘా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నాయని జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య కామాక్షి ప్రసాద్‌ చెప్పారు. కొత్త విధానానికి మారేటప్పుడు మొదట్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయని, 100 శాతం పారదర్శకంగా జరగాలంటే ఒకటీరెండు సంవత్సరాలు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.*

* 👉గీతం, వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం తదితర డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు కూడా ఈ నవీన పద్ధతిలోనే ముందుకెళ్లాలని నిర్ణయించాయి. గత ఏడాది కొన్ని వర్సిటీలు జేఈఈ మెయిన్‌, ఇంటర్‌/12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు ఇవ్వగా ఈసారి ఇంటి పరీక్షలకు శ్రీకారం చుడుతున్నాయి.*

*💥కాపీ కొట్టకుండా పర్యవేక్షణ ముఖ్యం*

*💠గీతం విశ్వవిద్యాలయం గత ఏడాది కూడా ఇళ్ల నుంచే ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. కాపీలు కొట్టకుండా పర్యవేక్షణ ముఖ్యం. ఈసారి కూడా కో-క్యూబ్స్‌ అనే సంస్థ సహకారంతో రిమోట్‌ ప్రోక్టోర్డ్‌ ఆన్‌లైన్‌ మోడ్‌(ఆర్‌పీఓఎం)లో చేపడతాం. ప్రతి 10 సెకన్లకు కెమెరా ద్వారా పరీక్ష రాసే విద్యార్థి ఫొటోలు వస్తుంటాయి. తరగతి గదిలో ఇన్విజిలేటర్‌ మాదిరిగానే ప్రతి 30 మందికి ఒక ప్రోక్టర్‌(పర్యవేక్షకుడు) ఉంటారు. విద్యార్థులను ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తుంటారు. విద్యార్థుల బాడీ లాంగ్వేజ్‌, కళ్ల కదలికలు లాంటి వాటిని గమనిస్తారు. అనుమానం వస్తే హెచ్చరిస్తారు. మూడు సార్లు చెప్పినా మారకుంటే పరీక్ష రాయకుండా లాగ్‌ఔట్‌ చేస్తారు.* 

@@@@@

@    Today's Service Info : 

        #    Study Leave

@    Today's TRT & TET Study Material Info :

        #    Telugu Methodology