Friday 14 May 2021

Teacher's Diary : 14.05.2021



1). *🔊 టీచర్లకు రెండునెలల సాయం ఒకేసారి*

*💰రెండోవిడత ఎంపిక పూర్తి.. రూ.48 కోట్లు విడుదల*

*🍥ప్రైవేటు స్కూల్‌ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే సాయానికి రెండోవిడత లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ప్రైవేటు, ఎయిడెడ్‌ కలుపుకొని మొత్తంగా 83 వేల పైచిలుకు లబ్ధిదారులను విద్యాశాఖ అధికారులు ఎంపికచేశారు. వీరికి ఏప్రిల్‌, మే నెలల సాయాన్ని ఒకేసారి ఇవ్వనున్నారు. మొదటి విడతలోనే వీరంతా దరఖాస్తు చేసుకున్నా, పలు కారణాలతో సహాయం పొందలేకపోయారు. ఏప్రిల్‌ సహాయం నష్టపోరాదని భావించిన అధికారులు, మొదటివిడత వారితో కలుపుకొని రెండు నెలలకు చెందిన బియ్యం, నగదును అందజేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.48 కోట్లు విడుదలచేసింది. జిల్లాలవారీగా ఎంపికైన లబ్ధిదారుల జాబితా గురువారానికి విద్యాశాఖ డైరెక్టరేట్‌కు చేరింది. వివరాలను సోమవారం ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపించనున్నారు. ఆమోదం లభించగానే వీరికి నగదు, బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. మొదటి, రెండు విడతలు కలుపుకొని మొత్తంగా 2 లక్షల పైచిలుకు మంది సాయం అందుకోనున్నారు.*

@@@@@

2).*🔊ఆన్‌లైన్‌లో కరోనా ఉచిత వైద్య సేవ*

* భారత్‌లో కరోనా బాధితులకు ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సహాయం అందజేసేందుకు ప్రవాస భారతీయ వైద్య నిపుణుల బృందం ముందుకు వచ్చింది. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఏఏపీఐ) ఆధ్వర్యంలో యూకేకి చెందిన ప్రవాస భారత వైద్యులు  www.eglobaldoctors.com అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా భారతీయులందరికీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ‘ఈగ్లోబల్‌డాక్టర్స్‌.కామ్‌’ వెబ్‌సైట్‌ లేదా coviddoctorhelp@gmail.com కు ఈ-మెయిల్‌ చేస్తే వైద్యుల బృందం ఆన్‌లైన్‌ ద్వారా సూచనలు అందజేస్తుందని నిర్వాహకులు తెలిపారు.*
@@@@@

3).*🔊హిందీ పండిత్‌ పోస్టులకు 260 మంది ఎంపిక*

*🍥హిందీ పండిత్‌ పోస్టులకు మొత్తం 260 మంది అభ్యర్థులను టీఎ్‌సపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ ప్రక్రియ పూర్తిగా ముగిసిందని, దీంతో జాబితాను ప్రకటించామని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు 25 మంది ఏజెన్సీ అభ్యర్థుల ధ్రువపత్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ధ్రువీకరించారని టీఎ్‌సపీఎస్సీ పేర్కొంది.*

*💥22న పీహెచ్‌ కేటగిరీ టీచర్ల ధ్రువపత్రాల పరిశీలన*

*🌀హిందీ పండిత్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పీహెచ్‌ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి  ఈ నెల 22న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన చేస్తామని టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. అర్హుల జాబితాన వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించింది. అభ్యర్థులు 22న ఉదయం 10.30కు హాజరుకావాలని సూచించింది.*
@@@@@

4).*🔊ఎస్సెస్సీ బోర్డు ఇచ్చే గ్రేడ్లే ఫైనల్‌!*

*🔷పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవు*
*🔶సంతృప్తిగా లేకున్నా సర్దుకోవాల్సిందే*

*🍥పదో తరగతి విద్యార్థులకు త్వరలో ఎస్సెస్సీ బోర్డు ఇచ్చే గ్రేడ్లే ఫైనల్‌ కానున్నాయి. ఈ గ్రేడ్లపై సంతృప్తిలేకపోయినా సర్దుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశాలు తక్కువని చెప్తున్నారు. కరోనా రెండోదశ నేపథ్యంలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ పాస్‌చేస్తూ, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1 ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే విద్యార్థులు ఈ మార్కులపై సంతృప్తికరంగా లేకపోతే పరిస్థితులు కుదుటపడ్డ తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈని అనుసరిస్తూ మన రాష్ట్ర అధికారులు సైతం మార్కులపై అసంతృప్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యపడదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. కరోనా రెండోదశ తీవ్రత నేపథ్యంలో పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని చెప్తున్నారు. తాము జారీచేసే గ్రేడ్లు విద్యార్థులకు నష్టం కలిగించవని, విద్యార్థులంతా సంతోషపడేలా గ్రేడ్లు జారీచేయబోతున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. పరీక్షలు మాత్రం నిర్వహించే అవకాశాల్లేవని అభిప్రాయపడ్డారు.*

*💥పరీక్షలంటే ప్రహసనమే..*

*🌀మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటే పరిస్థితి మొదటికొచ్చినట్టే. పరీక్షలు రాయాలనుకునేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం, హాల్‌టికెట్ల జారీ, పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల విడుదల చేయాలంటే కష్టమని అధికారులు అంటున్నారు. అది తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని, పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు.*
@@@@@

5).*🔊సివిల్స్‌ ప్రిలిమ్స్‌అక్టోబర్‌ 10కి వాయిదా*

* దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో సివిల్స్‌ ప్రిలిమినరీ -2021 పరీక్షలను యూపీఎస్‌సీ వాయిదా వేసింది. జూన 27న జరగాల్సిన ఈ పరీక్షను అక్టోబర్‌ 10వ తేదీన నిర్వహించనున్నట్లు గురువారం జారీచేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
@@@@@

@    Today's Service Info : 

            #    Surrender Leave 

@    Today's TRT & TET Study Material Info :

            #    Hindi  Methodology