Monday 17 May 2021

Teacher's Diary : 17.05.2021

 

Today's Updates : 

1). అన్ని స్కూళ్లలో టాయిలెట్లు


📝పీఏబీ భేటీలో ప్రతిపాదించనున్న అధికారులు నిధులు కేటాయించాలని కేంద్రానికి విన్నపం
     🌍రాష్ట్రంలోని అన్ని పాఠ శాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి విద్యాశాఖ అధికారులు చర్యలు చేప ట్టారు. 100% స్కూళ్లల్లో టాయిలెట్లు, నీటివసతి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల 21న వర్చువల్గా నిర్వహించే సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (ఎస్ఎస్ఏ పీఏబీ) సమావేశం మందు ఈ ప్రతిపాదనలు ఉంచనున్నారు. తెలంగాణలో మొత్తం 26,062 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 7,544 పాఠశాలల్లో కొత్తగా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నది. వీటితోపాటు, గతంలో నిర్మించిన వాటిలో శిథిలావస్థకు చేరిన మరో 7వేలకుపైగా పాఠశాలల్లోనూ టాయిలెట్లు నిర్మించాలి. ఆయా స్కూళ్లలో టాయిలెట్లతోపాటు నీటివసతి కూడా కల్పించేలా సమగ్ర నివేదికను రూపొందించారు. వీటి నిర్మాణానికి నిధులు కేటా యించాలని కేంద్రాన్ని కోరనున్నారు.
@@@@@

2). జేఈఈ మెయిన్‌ వాయిదా.. 

🌀ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండు వాయిదా పడ్డాయి. 2021–22 విద్యా సంవత్సరం కోసం జేఈఈ మెయిన్‌ను కరోనా కారణంగా నాలుగు దఫాలుగా నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గత డిసెంబర్‌లోనే ప్రకటించింది. అందులో భాగంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొదటి, రెండో దఫా పరీక్షలను నిర్వహించింది. ఇక ఏప్రిల్‌ 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సి మూడో దఫా పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ప్రకటించింది.

💠ఈ నెల 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన నాలుగో విడత పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఇటీవల ప్రకటన జారీ చేసింది. మళ్లీ ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనేది విద్యార్థులకు 15 రోజుల ముందుగా తెలియజేస్తామని ప్రకటించింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడితేనే జూన్‌లో (వచ్చే నెలలో) ఆ రెండు జేఈఈ మెయిన్‌లను నిర్వహించే అవకాశం ఉంటుంది. లేదంటే జూలైలో నిర్వహించాల్సి వస్తుంది. అదే జరిగితే ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3వ తేదీన నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కూడా వాయిదా వేయకతప్పదని అధికారులు పేర్కొంటున్నాయి.
@@@@@

3). గ్రేడ్లపైనే అందరి దృష్టి

🍥కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిస్తూ జీవో జారీ చేసింది. ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1(నిర్మాణాత్మక మూల్యాంకనం) ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జిల్లాలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులంతా పాస్‌ కాగా, ఎవరికి ఏ గ్రేడ్లు వస్తాయనే దానిపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే జిల్లా మానిటరింగ్‌ బృందాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల ఎఫ్‌ఏ-1 అంతర్గత మార్కులను పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదించాయి. వాటి ఆధారంగా పరీక్ష ఫీజులు చెల్లించిన విద్యార్థులందరికీ గ్రేడ్లు కేటాయించడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

@@@@@

4). పరీక్షకు రెండు వారాల ముందే ఆలస్య రుసుం

🍥 రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలకు ముందు రెండు వారాలు మాత్రమే దరఖాస్తులకు ఆలస్య రుసుములను వసూలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అప్పటి వరకు గడువును పెంచుతూ అపరాధ రుసుం లేకుండానే దరఖాస్తులు స్వీకరిస్తారు.

🌀 కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా జూన్‌లో జరగాల్సిన పీజీఈసెట్‌, పీఈసెట్‌ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
@@@@@

5). 20 నుంచి ఆర్‌ఐఈ దరఖాస్తుల స్వీకరణ

 దేశవ్యాప్తంగా ఉన్న అయిదు ప్రాంతీయ విద్యా సంస్థ(రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌-ఆర్‌ఐఈ)లతోపాటు మరికొన్ని జాతీయ సంస్థల్లో బీఈడీ, ఎంఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ప్రకటన జారీ చేసింది. ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుంచి జూన్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 18వ తేదీన పరీక్ష నిర్వహించి ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మైసూరులోని ఆర్‌ఐఈలో కొన్ని సీట్లను ప్రత్యేకంగా కేటాయిస్తారు.

@@@@@

6). 28న జరగాల్సిన TSRJC పరీక్ష వాయిదా....

🌀రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా టీఎ్‌సఆర్జేసీ పరీక్షను వాయిదా వేసినట్లు గురుకుల విద్యాలయాల సంస్థ తెలిపింది. గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్ష ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 28న  జరగాల్సి ఉంది. వాయిదా పడడంతో పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించామని పేర్కొంది.
@@@@@

@    Today's Service Info : 

        #    Special Casual Leave

@    Today's TRT & TET Material Info:

        #    10th Class Telugu