Tuesday 18 May 2021

Teacher's Diary:18.05.2021


1) *🔊పాలిసెట్‌ ర్యాంకులతో  IIITబాసర’ ప్రవేశాలు? ఆర్‌జీయూకేటీ యోచన...

 *🌍బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ)లో సీట్లను ఈసారి పాలిసెట్‌ ఆధారంగానే భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏటా పదో తరగతిలో గ్రేడ్ల ఆధారంగా ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (ఇంటర్‌ రెండు సంవత్సరాలు, బీటెక్‌ నాలుగేళ్లు) సీట్లను భర్తీ చేస్తున్నారు. బాసరలో మొత్తం 1,500 సీట్లు ఉన్నాయి. 2019 వరకు 10 జీపీఏ విద్యార్థుల సంఖ్య తొమ్మిది వేలు దాటలేదు. గత ఏడాది అంతర్గత పరీక్షల ఆధారంగా పదో తరగతిలో గ్రేడ్లు ఇవ్వడంతో 10 జీపీఏ వారి సంఖ్య 1.41 లక్షలు దాటింది. ఫైనల్‌ పరీక్షలు లేనందున ఈ విధానంలో భర్తీ చేస్తే నిజమైన ప్రతిభావంతులకు సీట్లు దక్కవన్న అభిప్రాయం విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. అందుకే ఈసారి ప్రవేశ పరీక్ష జరపాలన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షకు బదులు ఇప్పటికే పాలిటెక్నిక్‌ డిప్లొమా సీట్ల భర్తీకి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రతి ఏటా పాలిసెట్‌ను నిర్వహిస్తున్నందున దాని ఆధారంగా ఆర్‌జీయూకేటీ సీట్లను భర్తీ చేయవచ్చన్న ప్రతిపాదనపై వర్సిటీ అధికారులు చర్చించినట్లు తెలిసింది. దీనిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.*

*🌀వెటర్నరీ డిప్లొమా సీట్లకూ పాలిసెట్‌: ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా సీట్లను కూడా గత ఏడాది నుంచి పాలిసెట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఈసారి  పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిప్లొమా సీట్లను కూడా పాలిసెట్‌ ఆధారంగానే భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ వారంలో పాలిసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది.*

@@@@@

2). *🔊జీతాలపెంపు లేనట్లే! ఇంకా జారీ కాని ఉత్తర్వులు ఈ నెలకూ పాత వేతనాలే!

 *🌏ఉద్యోగులకు ఈ నెలలో కూడా వేతనాలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. అంటే జూన్‌ 1న తీసుకునే జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదన్నమాట. వేతనాల్లో పెరుగుదల కోసం ఉద్యోగులు మరో నెల ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన జీతాలను ఏప్రిల్‌ నుంచి వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. అంటే.. మే 1న తీసుకునే జీతాన్ని పెంచి చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో సీఎం కేసీఆర్‌కు కరోనా వైరస్‌ సోకడం వంటి కారణాలతో ఉద్యోగుల జీతాల పెంపు నిర్ణయాన్ని అమలు చేయలేదు. దాంతో ఈ నెలలో అమల్లోకి వస్తుందని అంతా భావించారు. కానీ, ఈ నెలలో కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఫిట్‌మెంట్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం కూడా చేయలేదు. అలాగే ఈ అంశంపై ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటికే 17 రోజులు గడిచిపోయాయి*

*🌻సాధారణంగా ఉద్యోగుల జీతాల బిల్లులను తయారు చేయడం, వాటిని ట్రెజరీలకు పంపడం వంటి పనులు 20 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి ఇప్పటి వరకూ ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో మే నెలకు సంబంధించి ఉద్యోగులకు పాత జీతాల బిల్లులను రూపొందిస్తున్నారు. అంటే జూన్‌లోనూ పాత వేతనాలే తీసుకోవాలి. ప్రస్తుతం కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌ అమల్లో ఉండడం వంటి కారణాలతో ఉద్యోగులు కూడా జీతాల పెంపుపై పట్టుబట్టే వీలు లేకుండా పోయింది.*
@@@@@

3)*🔊ఎంసెట్‌ దరఖాస్తు గడువు 26వరకు పెంపు..

 *💫 ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్‌ కన్వీనర్‌, జేఎన్‌టీయూ రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. కాగా, సోమవారం సాయంత్రం వరకు మొత్తం 1,56,526 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌ 1,06,506, మెడికల్‌ 50,020 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అగ్రికల్చర్‌, మెడికల్‌ విద్యార్థులకు జూలై 5, 6న మూడు విడతల్లో, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు జూలై 7, 8, 9 తేదీల్లో ఐదు విడతల్లో ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు*
@@@@@
4) SSC Grade Points 10/10.. ఈసారి 2 లక్షల మందికి!

*గత ఏడాది కంటే భారీగా పెరగనున్న ఆ గ్రేడ్‌ విద్యార్థుల సంఖ్య

*రెండు, మూడు రోజుల్లోనే ఫలితాల వెల్లడికి సమాయత్తం: 
:రాష్ట్రంలో ఈసారి పదో తరగతి పరీక్షల్లో దాదాపు 40 శాతం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కనుంది. మొత్తం 5.21 లక్షల మందిలో సుమారు 2 లక్షల మంది 10/10 జీపీఏతో ఉత్తీర్ణులు కానున్నారని సమాచారం. అంటే గత ఏడాది కంటే ఈ సంఖ్య దాదాపు 60 వేలు ఎక్కువ. పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ-1) ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఆ ప్రకారం విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఈ నెల 11న ఉత్తర్వులిచ్చారు. ఈ క్రమంలో పరీక్ష రుసుం చెల్లించిన 5,21,393 మందికి గ్రేడ్లు ఇచ్చేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ప్రక్రియను దాదాపు పూర్తిచేశారు. ఫలితాలను రెండు, మూడు రోజుల్లో విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు.

*_💥గత ఏడాది 1.41 లక్షల మందే..

*_🌀గత విద్యా సంవత్సరంలో(2019-20) వార్షిక పరీక్షలు జరగకపోవడంతో నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చారు. అప్పుడు 5.34 లక్షల మందిలో మొత్తం 1,41,382 మంది విద్యార్థులు 10 జీపీఏ దక్కించుకున్నారు.ఈసారి(2020-21) కేవలం 40 రోజులే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. ఆ సమయంలోనే ఒక ఎఫ్‌ఏ జరిపారు. మరొకటి నిర్వహించాల్సి ఉండగా మళ్లీ పాఠశాలలను మూసివేశారు. దాంతో ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగానే గ్రేడ్లు ఇస్తున్నారు. దానివల్ల ఈసారి 10 జీపీఏ విద్యార్థుల సంఖ్య రెండు లక్షలు దాటనుందని విశ్వసనీయంగా తెలిసింది. అంటే గత ఏడాది కంటే 60 వేల మంది అధికంగా ఉండనున్నారు. ఈ సంఖ్య పెరగడానికి ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగా గ్రేడ్లు ఇవ్వడమే కారణమని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
@@@@@

5).*🔊కేయూ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

* కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను wwwkakatiya.ac.in లో చూసుకోవచ్చని తెలిపారు.*

*రివాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ ఫస్టియర్‌ రెండో సెమిస్టర్‌లో 76.11 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. డిగ్రీ సెకండియర్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌లో 85.71 శాతం, రెండో సెమిస్టర్‌లో 82.79 శాతం, డిగ్రీ మూడో సంవత్సరం సెకండ్‌ సెమిస్టర్‌లో 85.68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు.
@@@@@

@        Today's Service Info :

            #    Casual Leave

@        Today's TRT & TET Material Info :

            #    10th Class Hindi