Wednesday 19 May 2021

Teacher's Diary:19.05.20211)*🔊మంత్రి ఆమోదానికి ‘పది’ ఫలితాల దస్త్రం*

* పదో తరగతి ఫలితాల దస్త్రాన్ని అధికారులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం కోసం పంపారు. మంత్రి పచ్చజెండా ఊపితే వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు.
@@@@@
2)*మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు..

*⏺️తెలంగాణ మైనారిటీ గుకుకుల పాఠశాల, కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ నెల 20 లోపు అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షేక్‌ మహమూద్‌ ప్రకటనలో పేర్కొన్నారు.* 

*🖥️పాఠశాలల్లో 5,6,7,8 తరగతుల్లో, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు www.tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో గడువు లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.* 

_🌀పాఠశాలల్లో ఎంపిక కోసం జూన్‌ 1 నుంచి 3 వరకు, కళాశాలల్లో ఎంపిక కోసం జూన్‌ 3 నుంచి 5 వరకు *లక్కీ విధానం* నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తామన్నారు. జూన్‌ 8 నుంచి 12 వరకు పాఠశాల, జూన్‌ 7 నుంచి 12 వరకు కళాశాలల్లో ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
@@@@@
3).*💠💥ఇంటి నుంచే ప్రతిభ చాటండి*
*⏺️కొవిడ్‌ కాలంలో ఇంటికే పరిమితమైన జిల్లాలోని విద్యార్థులు వివిధ రంగాల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పోటీల్లో తమ ప్రతిభను, సృజనాత్మకతను ప్రదర్శించి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు గెలుచుకోవడానికి తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది.* 

*🔰అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు జీవ వైవిధ్యం దాని పరిరక్షణపై చైతన్యాన్ని కలిగించేందుకు వివిధ అంశాల్లో పోటీలను ఎన్‌జీసీ, టీఎస్‌కాస్ట్‌ సహకారంతో నిర్వహిస్తోంది. రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఆయా పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ పోటీలకు ఎంట్రీలను పంపేందుకు ఈ నెల 20, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. ఆయా పోటీల నియమ నిబంధనలు.. పూర్తి వివరాలకు తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు వెబ్‌సైట్‌ను వీక్షించి విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు.*
@@@@@

4).*💠🖥️అంతరిక్ష పరిజ్ఞానంపై.. అంతర్జాలంలో శిక్షణ*

*👨‍🏫ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవకాశం*

*🖥️ఐఐఆర్‌ఎస్‌ ద్వారా తరగతులు*

*⏺️సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మానవుడు అంతరిక్షంలో అడుగుపెట్టేలా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేపట్టారు. ఇందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే ఎన్నో ఉపగ్రహాలను పంపించి విజయం సాధించింది. ఇలా అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న ప్రయోగాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. శాస్త్రవేత్తలు చేసే ప్రయోగాలపై కేవలం కొంత మందికి మాత్రమే అవగాహన ఉండగా దాన్ని విస్తృతం చేయాలని ఇస్రో సంకల్పించింది. రేపటి పౌరులైన విద్యార్థులు అంతరిక్ష పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ముందు అవగాహన ఉండాలని భావించింది. లాక్‌డౌన్‌, సెలవుల నేపథ్యంలో ఉపాధ్యాయులు ఇంటిపట్టునే ఉంటున్నందున వారికి ఆన్‌లైన్‌లో అంతరిక్ష పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.*

*💥విద్యాశాఖ ఏటా విజ్ఞాన మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సాయంతో ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శిస్తుంటారు. ఇందులో పలువురు విద్యార్థులు అంతరిక్షానికి సంబంధించిన ప్రదర్శనలను సైతం ఏర్పాటు చేసి సహచర విద్యార్థుల మన్ననలతో పాటు, అవార్డులు సైతం సాధిస్తుంటారు. అంతరిక్షం గురించి మరింత పట్టు సాధించేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గణితం, భౌతిక, భౌగోళిక శాస్త్రాలు బోధించే వారు శిక్షణకు అర్హులుగా ప్రకటించింది.*
*🔰పలు విషయాలపై అవగాహన*

*♻️2007 నుంచి ఇస్రో ఆన్‌లైన్‌ కోర్సులు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 76 పర్యాయాలు చేపట్టగా దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే తరహాలో ఈసారి కూడా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. దేశాభివృద్ధి, ప్రజల అవసరాలు, రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, దూరవిద్య, పర్యావరణం, శీతోష్ణస్థితి, రుతుపవనాలు, ఆహారం, నీటిభద్రత, ప్రకృతి వైపరీత్యాలు తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో మొత్తం వేయి మంది వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు. వీరందరికీ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, వాటి అనువర్తనాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.*
*🖥️ఐఐఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కోర్సు*

*🔶ఇస్రో పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఐఐఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో అంతరిక్ష పరిజ్ఞానంపై ఉపాధ్యాయులకు ప్రత్యేక కోర్సును ప్రారంభించారు. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఈనెల 30 లోపు www.iirs.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్ఛు చరవాణి నంబరు, ఈ-మెయిల్‌, పేరు తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 70 శాతం హాజరు, ప్రతిభ ఆధారంగా శిక్షణ పూర్తి చేసిన ఉపాధ్యాయులకు ఈ-మెయిల్‌ ద్వారా ధ్రువపత్రాలు అందించనున్నారు.
@@@@@

@    Today's Service Info : 

        #    Family Planning Leave

@    Today's TRT & TET Material Info :

        #    10th Class English