Thursday 20 May 2021

TS Teacher's Diary: 20.05.2021



1).🔊🔊రేపు పదోతరగతి ఫలితాలు!*

*🏆విద్యార్థులందరూ పాస్.*

 *🌀ఎఫ్ఎ-1లో వారు సాధించిన మార్కులను బట్టి గ్రేడ్లు*

*🌍పదోతరగతి విద్యార్థుల ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం.. ఈ నెల 21న వాటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఒకవేళ వీలు కాకపోతే 22న విడుదల చేయనుంది.*
  *🍥పదోతరగతి విద్యార్థుల ఫలి తాలను ఈ నెల 21న (శుక్రవారం) విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. వాటిని మరోసారి పరిశీలిస్తోంది. ఒకవేళ ఆ రోజు వీలుకాకపోతే 22వ తేదీన విడుదల చేయనుంది. కరోనా కార గా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఫార్మే టివ్ అసెస్మెంట్ (ఎఫ్ఎ-1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఆయా సబ్జెక్టులకు ఎఫ్ఎ-1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లోసాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వ నుంది. ఎఫ్ఎ-1 పరీక్షలకు 5.21 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదిం తలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు 3 కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ఖరారు చేసి ప్రకటించనుంది. దీంతో ఈసారి 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది.
@@@@@

2)*💠💰ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల రుసుము*

*⏺️తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జులైలో జరిగే పరీక్షల రుసుము చెల్లించడానికి అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 24 వరకు అవకాశం కల్పించారని డీఈవో దుర్గాప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్‌ ఆన్‌లైన్‌, ఏపీ ఆన్‌లైన్‌, మీసేవలో ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఇంతకు ముందు అనుత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారని తెలిపారు.
@@@@@

3)*💠✍️వీసీల నియామక ఫైల్‌పై సీఎం సంతకం*

*📃రాజ్‌భవన్‌కు చేరిన దస్త్రం..*

*📢నేడు నిర్ణయం ప్రకటించనున్న గవర్నర్‌!*

 దాదాపు రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీలు) నియామకంపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. పది వర్సిటీలకు వీసీల నియామకంపై సీఎం కేసీఆర్‌ బుధవారం సంతకం చేశారు. అనంతరం ఆ ఫైల్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. అయితే గవర్నర్‌ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. టీఎ్‌సపీఎస్సీ పాలకవర్గానికి సంబంధించిన ఫైల్‌ బుధవారం రాజ్‌భవన్‌కి వచ్చిన వెంటనే గవర్నర్‌ ఈ-మెయిల్‌ ద్వారా ఆమోదం తెలిపారు. అలాగే వీసీల జాబితాను కూడా ఈ-మెయి ల్‌ ద్వారా ఆమోదం తెలుపుతారని భావించగా.. బుధవారం రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
@@@@@

4).మాడల్ స్కూళ్ల ప్రవేశపరిక్ష వాయిదా 

 మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతుల్లో సీట్ల ఖాళీల భర్తీకి జూన్‌ 5, 6న నిర్వహించాలనుకున్న ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం తెలిపారు. దరఖాస్తు గడువును కూడా పొడిగించామని, జూన్‌-20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
@@@@@

@    Today's Service Info:

        #    Child Care Leave

@    Today's TET & TRT Material Info:

        #    10th Class Maths TM