Friday 21 May 2021

TS Teacher's Diary: 21.05.2021



1) *🔊పది విద్యార్థులకు గ్రేడింగులు నేడే!*

*♻️ఫీజు చెల్లించిన 5,21,392 మంది పాస్‌*

*♦️25,473 మంది విద్యార్థులు ఫెయిల్‌*

*📝పేరు, పుట్టిన తేదీతో మెమోలు*

*🛍️2 లక్షల మందికి ఏ1 గ్రేడ్‌?*

హైదరాబాద్‌, *🏆పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ల వివరాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. కరోనా కారణంగా గతేడాది మాదిరిగానే ఈసారి సైతం వార్షిక పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యక్ష తరగతులు నిర్వహించిన 44 రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ ఫార్మెటివ్‌ అసెస్మెంట్‌ (ఎఫ్‌ఏ-1) పరీక్ష నిర్వహించారు. 20 మార్కుల ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ఐదింతలు పెంచి (100 మార్కులకు) ఫలితాలు సిద్ధం చేశారు.  ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షలకోసం ఫీజు చెల్లించిన వారందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.*

*💫ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతిలో 5,46,865 విద్యార్థులు ప్రవేశాలు పొందారు. పరీక్ష ఫీజు రూ.150గా నిర్ణయించగా.. రూ.50 ఆలస్య రుసుముతో మార్చి-16 వరకు గడువు ఇచ్చారు. రూ.200తో మార్చి-18, రూ.500తో మార్చి-22 వరకు గడువు ఇచ్చారు. అయినప్పటికీ ప్రవేశాలు పొందిన మొత్తం విద్యార్థుల్లో 5,21,392 (95.34ు) మంది ఫీజు చెల్లించగా.. 25,473 (4.65ు) మంది గడువులోపు ఫీజు చెల్లించలేదు. దీంతో వారిలో కొందరు ఎఫ్‌ఏ-1 పరీక్షకు హాజరైనా ఫలితాల్లో పరిగణలోకి తీసుకోలేదు. ఫీజు చెల్లించని వారంతా ఫెయిల్‌ అయినట్టేనని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.*

*🌍రికార్డుస్థాయిలో ఏ1 గ్రేడ్‌..*

*🍥91-100 మార్కులకుఏ1 గ్రేడ్‌, 81-90 ఏ2, 71-80 బీ1, 61-70 బీ2,51-60సీ1,41-50 ిసీ2,35-40డీ,0-34ఈగ్రేడ్‌చొప్పునకేటాయిస్తారు. ఈలెక్కనఈసారిపరీక్షఫీజుచెల్లించిన5,21,392విద్యార్థుల్లోదాదాపు2లక్షలవిద్యార్థులుఏ1గ్రేడ్‌సాధించినట్టు తెలిసింది.* 

*🌀గతేడాదిపదోతరగతిలో 5,34,903 మంది ఉత్తీర్ణులు కాగా, వీరిలో రికార్డుస్థాయిలో 1,41,382 (26.43ు) మంది 10/10 జీపీఏ సాధించారు. ఈసారి వీరి సంఖ్య మరింతగా పెరగనుంది.*

*✍️పేరు నమోదు చేస్తే మెమో.. *

*📜ప్రతిసారి పదోతరగతి ఫలితాల కోసం వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్‌ నమోదు చేస్తుండేవారు. గతేడాది సైతం పరీక్షలు జరగకపోయినా హాల్‌ టికెట్‌ ద్వారానే మెమోలు పొందారు. కానీ ఈసారి హాల్‌ టికెట్‌ నెంబర్లు కేటాయించక ముందే పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఈసారి విద్యార్థులు హాల్‌టికెట్‌ స్థానంలో తమ పేరు, పుట్టిన తేదీ, పాఠశాల పేరు నమోదు చేసి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్థులు వెబ్‌సైట్‌* www.bse.telangana.gov.in *నుంచి మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.*
@@@@@

2).*_🔊సెప్టెంబరు 30 వరకు ఐటీ రిటర్నులు_*

*_💠2 నెలల గడువు పొడిగింపు_*

* 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల (ఐటీఆర్‌) సమర్పణకు 2 నెలల గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-4 పత్రాలు సమర్పించేందుకు వ్యక్తులకు జులై 31 వరకు గడువుండగా, దాన్ని సెప్టెంబరు 30 వరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పొడిగించింది. ఆడిటింగ్‌ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు ఫైలింగ్‌ గడువును నవంబరు 30 వరకు (గతంలో అక్టోబరు 31) పొడిగించింది. యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఫామ్‌-16లను జులై 15 వరకు (నెల రోజులు పొడిగింపు) ఇవ్వొచ్చని తెలిపింది._*

*_🌀7 నుంచి కొత్త ఇ-ఫైలింగ్‌ వెబ్‌ పోర్టల్‌:  పన్ను చెల్లింపుదార్లు తమ ఐటీఆర్‌లు సమర్పించడంతో సహా ఇతర పన్ను సంబంధిత పనుల కోసం వినియోగించే ఇ-ఫైలింగ్‌ వెబ్‌ పోర్టల్‌ సరికొత్తగా రాబోతోంది. జూన్‌ 7 నుంచి కొత్త రూపులో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వెబ్‌పోర్టల్‌  (www.incometaxindiaefiling.gov.in) జూన్‌ 1-6 తేదీల మధ్య ఆగిపోతుందని, పన్ను చెల్లింపుదార్లు మరింత సులువుగా వినియోగించుకునేలా కొత్త వెబ్‌పోర్టల్‌ (www.incometaxgov.in) రూపొందించామని తెలిపింది._*
@@@@@

3).*_🔊‘నిష్ఠ’గా శిక్షణ.. బోధన ప్రమాణాలకు రక్షణ_*

*_🥏అంతర్జాలంలో నిర్వహణకు ఏర్పాట్లు_*

*_🍥ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను బలోపేతం చేయడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకు విద్యాశాఖ ప్రతి ఉపాధ్యాయుడికి ‘నిష్ఠ 2.0’ పేరుతో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. మారుతున్న కాలానుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని బోధనల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఎన్‌సీఈఆర్టీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  గతేడాది అందించిన శిక్షణలో పాఠశాల స్థాయి బోధనల్లో విభిన్న పద్ధతులు ఉండడం ఉపాధ్యాయులను ఆకర్షించింది. దీంతో రెండోవిడత కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ సారి అంతర్జాలంలో నిర్వహించనున్నారు._*

*_🌀ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో సమగ్ర అత్యున్నత శిక్షణకు అంకురార్పణ కార్యక్రమం (నేషనల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌ టీచర్స్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌) పేరిట దీన్ని రూపొందించారు. గతేడాది ప్రత్యక్ష పద్ధతుల్లో శిక్షణ అందించారు. నిష్ఠ పేరిట యాప్‌ను అభివృద్ధి చేసి వారు నేర్చుకున్న అంశాలను అందులో నమోదు చేశారు. మొదటి విడతలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఆరోగ్య విద్య, అభ్యాసానికి నూతన సమాచార సాంకేతికతను జోడించడం. పోక్సోచట్టం, విభిన్న పద్ధతుల్లో బోధించడం తదితర అంశాలపై దృష్టి సారించారు. నేర్చుకున్న అంశాలపై మూల్యాంకనం సైతం ఉండటంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. పాఠశాల విద్యలో సమూల మార్పులకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, జాతీయ విద్యా పరిశోధన సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల నుంచి ఉపాధ్యాయుల వివరాలు రాష్ట్ర విద్యాశాఖ సేకరించింది. పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచే ప్రధాన లక్ష్యంగా శిక్షణ ఇవ్వనున్నారు_*
@@@@@
4). *_🔊రవాణా భత్యానికి అర్హులు 40,598 మంది_*

*_🌀9, 10 తరగతుల విద్యార్థులకూ వర్తింపు_*

* వచ్చే విద్యా సంవత్సరం(2021-22) నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకూ రవాణా భత్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో ఈ పథకానికి అర్హులైన విద్యార్థుల సంఖ్య 40,598కి పెరిగింది. అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలు లేకుంటే వాహనాల్లో వెళ్లేందుకు గత ఏడాది వరకు 1 నుంచి 8 తరగతుల వారికి రవాణా భత్యం కింద నెలకు రూ.300 చొప్పున 10 నెలలకు రూ.3 వేలు అందజేసేవారు. వచ్చే ఏడాది నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా ఈ భత్యాన్ని వర్తింపజేస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా గురువారం జీఓ జారీ చేశారు. అలానే భత్యాన్ని రూ.300 నుంచి రూ.600కు పెంచారు. ప్రత్యక్ష తరగతులు జరిగితేనే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు._*
@@@@@

5).*_🔊మైనార్టీ విద్యాసంస్థ‌ల్లో ప్ర‌వేశానికి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు_*

 తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూష‌న్స్ సొసైటీ (టీఎంఆర్ఈఎస్)లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు గురువారం పొడిగింప‌బ‌డింది. V, VI, VII, VIII, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 2021-22 విద్యా సంవత్సర ప్ర‌వేశాలకుగాను ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గ‌డువును మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణ‌యం వెలువ‌రించింది. ఈ అవ‌కాశాన్ని విద్యార్థులు, త‌ల్లిదండ్రులు స‌ద్వినియోగం చేసుకోవాల్సిందిగా టీఎంఆర్ఈఎస్ కార్య‌ద‌ర్శి బి. ష‌ఫీయుల్లా కోరారు._*

*_🌀ద‌ర‌ఖాస్తుల‌ను టీఎంఆర్ఈఎస్ మొబైల్ యాప్ ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ http://www.tmreis.telangana.gov.in/ లేదా టీఎంఆర్ జూనియర్ కళాశాలలు, పాఠ‌శాల‌ల్లో దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల కోసం టీఎంఆర్ఈఎస్ వెబ్‌సైట్ లేదా డీఎండ‌బ్ల్యూఓ కార్యాల‌యం లేదా టీఎంఆర్ కాలేజీలు, స్కూల్స్ లేదా టీఎంఆర్ఈఎస్ ప్ర‌ధాన కార్యాల‌యం, హైద‌రాబాద్ లేదా 040-23437909 లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు._*

@@@@@@

@    Today's Service Info :

            #    Paternity Leave

@    Today's TRT & TET Info :
 
            #    10th Class Bio Science TM