Sunday 30 May 2021

TS Teacher's Diary: 30.05.2021




1)🔊ఎంసెట్‌ వాయిదా_*

*_🔶ఇంటర్‌ సెకండియర్‌ పరీక్ష తేదీలు ఖరారయ్యాక తాజా షెడ్యూల్‌_*

*_🍥ఎంసెట్‌ పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూలై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ మెడికల్‌.. 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మే-2 నుంచి జరగాల్సిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదాపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెకండియర్‌ పరీక్షలను జూలై 15 తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష తేదీలు ఖరారైన తర్వాత ఎంసెట్‌ తాజా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. కాగా, ఈనెల 28వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష కోసం 1,37,554, మెడికల్‌ కోసం 67,548 చొప్పున మొత్తం 2,05,102 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుము లేకుండా జూన్‌ 3 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది._*
@@@@@
2).*_🔊15 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు!_*

*_🔶ప్రారంభానికి విద్యాశాఖ సన్నాహాలు_త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు_*

*_🔶బ్రిడ్జికోర్సులతోనే విద్యాసంవత్సరం షురూ_*

*_🍥నూతన విద్యాసంవత్సరాన్ని జూన్‌ 15వ తేదీనుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. కరోనా దృష్ట్యా ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులను మొదలుపెట్టాలని భావిస్తున్నా రు. ఇందుకు అనుమతి కోరుతూ త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. నూతన విద్యాసంవత్సరం బ్రిడ్జికోర్సులతో ప్రారంభంకానున్నది. జూన్‌నుంచి ఆగస్టు వరకు విద్యార్థులకు బ్రిడ్జికోర్సుల్లోని పాఠ్యాంశాలనే బోధించనున్నారు. గత విద్యాసంవత్సరంలోని ముఖ్యమైన పాఠ్యాంశాలను తిరిగి నేర్పించడం, పునశ్చరణ చేయడంలో భాగంగా ఈ బ్రిడ్జికోర్సులను నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. అభ్యసన నష్టాన్ని నివారించడంలో భాగంగా ఈ ఏర్పాట్లుచేయాలని సూచించింది. ఈ కోర్సుల పాఠ్యాంశాల రూపకల్పన బాధ్యతను ఎస్సీఈఆర్టీకి అప్పగించారు. జూన్‌ మొదటివారంలోగా మెటీరియల్‌ ముద్రణను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు 15 తర్వాతే తమ తరగతికి సంబంధించిన కొత్త పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ క్లాసుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బ్రిడ్జికోర్సుల మెటీరియల్‌ను సిద్ధంచేసి, విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు.
@@@@@

3) *_💥ఇంటర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు వాయిదా!_*

*_🌀షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 1 నుంచి ఇంటర్‌ ఆన్‌లై తరగతులు ప్రారంభంకావాల్సి ఉండగా.. లాక్‌డౌ న్‌, కరోనా దృష్ట్యా క్లాసులను వాయిదావేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
@@@@@

4). 💥ఐదోతరగతి గురుకుల ప్రవేశపరీక్ష వాయిదా_*

*_💠ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 30న జరిగే రాత పరీక్షను వాయిదా వేసినట్టు గురుకుల సెట్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
@@@@@

5). 🔊మధ్యాహ్న భోజనానికి నగదు బదిలీ

*♻️ప్రతి విద్యార్థికి నెలకు రూ.100 - నేరుగా బ్యాంకు ఖాతాలో జమ* 

*🍥కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: *🌍చిన్నారి విద్యార్థుల పౌష్టికాహార భద్రతకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వేళ వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టింది. కొవిడ్తో నెలల తరబడి పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో స్కూళ్లలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో 1-8 తరగతి విద్యార్థులకు పౌష్టికాహార సమస్య తలెత్తకుండా ఉండాలని భావించింది. మధ్యాహ్న భోజన పథకం నిధులను నేరుగా విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. ఇందుకు నగదు బదిలీ పథకాన్ని జోడించడం ద్వారా, అర్హులైన ప్రతి ఒక్క విద్యార్ధి బ్యాంకు ఖాతాలో సొమ్మును జమ చేయాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రాయాల్ తెలిపారు. ప్రదాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నిరుపేదలకు అందిస్తున్న 5 కేజీల ఆహార ధాన్యాలకు ఇది అదనంగా కొనసాగుతుందని పేర్కొ న్నారు. ప్రత్యేక సంక్షేమ చర్యల కింద అదనంగా రూ. 1200 కోట్ల ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇవ్వనుంది. వన్ టైమ్ స్పెషల్ వెల్ఫేర్ కార్యక్రమం ద్వారా 11.8 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజం కలగనుంది. దేశంలోని 11.2 లక్షల ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్ధులకు ఈ ప్రయోజనాలు అందుతాయి. అయితే పోషకాహార భద్రతను అందించడానికి ఈ మొత్తం సరిపోదని ఆహారహక్కు కార్యకర్తలు అంటున్నారు.*

*🌀వంటఖర్చు కేటాయింపు*

*💫2021-22లో మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం రూ.11,500 కోట్లు కేటాయించింది. పప్పుధాన్యాలు, కూరగాయలు, వంటనూనె, ఉప్పువంటి పదార్థాల ధరలతో కూడిన వంట ఖర్చులో ఇది అతిపెద్దభాగం. రోడుకు ఒక విద్యార్థికి (1-5 తరగతి) వంట ఖర్చుకు రూ. 1.97, 6-8 తరగతులకు రూ. 7.45గా నిర్ధారించారు. ఇందులో కేంద్రం 60 శాతం చెల్లిస్తుంది. దీనిపై నిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి. నెలకు రూ. 100 అంటే సగటున రోజుకు రూ.4 కంటే తక్కువని, పైగా బ్యాంకు లావాదేవీలకు కొంత వ్యయం అవుతుందని పేర్కొంటున్నారు. పోషకాహార భద్రతను నిర్ధారించడానికి గుడ్లు, కూరగాయలు, పండ్లు, పప్పు, నూనెతో సహా మెరుగైన టెకోమ్ రేషన్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏడాదికి సుమారు 200 పాఠశాల రోజుల లెక్కన ఒక్కో విద్యార్థికి - రూ.1300 వంట ఖర్చు అవుతుంది. గతేడాది కూడా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూతబడ్డాయి. అందుచేత గతేడాది బకాయిలను కూడా చెల్లిస్తే కొంతవరకు ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.*
@@@@@
6).*🔊ఎన్రోల్ మెంట్ వ్యత్యాసాన్ని సవరించండి*

హైదరాబాద్, *📚విద్యా ర్థుల ఎన్రోల్మెంట్లోని లోటును పూర్చడంతో పాటు వ్యత్యాసాన్ని సవరించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 2020- 21 విద్యాసంవత్సరానికి 3,53,120 మంది విద్యార్థుల వివరాలను స్టూడెంట్ ఇన్ఫోలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈ వోలు, హెచ్ఎంలను ఆదేశించారు.*
@@@@@

@    Today' Service Info : 

        #        Fundamental Rules