Saturday 11 September 2021

How to Change Name in Aadhar Card ?

 Aadhar card | పెళ్లి త‌ర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?




🌀Aadhar card | ఆధార్ ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తిదానికి ఆధార్ అవ‌స‌ర‌మే. అందుకే ఆధార్ కార్డులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూసుకోవాలి. ఒక‌వేళ త‌ప్పులు వ‌చ్చినా వాటిని స‌రిదిద్దుకునేందుకు యూఐడీఏఐ వెసులుబాటు క‌ల్పించింది. అలాగే పెళ్లి త‌ర్వాత అమ్మాయి ఇంటిపేరు మార్చుకునేందుకు కూడా ఆధార్ అవ‌కాశం అవ‌కాశం క‌ల్పించింది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్ల‌య్యాక అమ్మాయి ఇంటి పేరు మార‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఒక్కోసారి అమ్మాయి పేరు కూడా మారుతుంది. ఈ సంగ‌తిని దృష్టిలో ఉంచుకుని పెళ్లి త‌ర్వాత అమ్మాయి పేరును ఎలాంటి రుసుము లేకుండా అప్‌డేట్ చేసుకునే అవ‌కాశాన్ని యూఐడీఏఐ క‌ల్పించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ఆధార్ కార్డులో పేరు మార్చుకోవ‌చ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..


💥ఆన్‌లైన్‌లో పేరు మార్చ‌డ‌మెలా..

➡️ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.

➡️హోం పేజిలోని My aadhaar సెక్ష‌న్‌లో Update your aadharపై క్లిక్ చేయాలి

➡️ఆ త‌ర్వాత Update Demographics Data Online పై క్లిక్ చేయాలి.

➡️అప్పుడు ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంది. అందులో Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.

➡️ఆధార్ నంబ‌ర్‌, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.

➡️మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని అక్క‌డ ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి.

➡️అందులో నేమ్ చేంజ్ ఆప్ష‌న్ ఎంచుకుని మారిన పేరు, ఇంటి పేరు వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి.

➡️ఆ త‌ర్వాత అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి స‌బ్‌మిట్ చేయాలి.

➡️అప్పుడు మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్‌కు ఒక ఓటీపీ వ‌స్తుంది. ఆ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి వెరిఫై చేయాలి.

➡️ఈ మొత్తం ప్రాసెస్‌కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

➡️ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయ‌గానే ఒక స‌ర్వీస్ రిక్వెస్ట్ నంబ‌ర్(SRN) వ‌స్తుంది.‌ ఈ SRN నంబ‌ర్ ద్వారా అడ్ర‌స్ అప్‌డేష‌న్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు.

💥ఆఫ్‌లైన్‌లో పేరు మార్చ‌డ‌మెలా..

➡️ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చ‌డానికి ముందుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

➡️ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు నేరుగా వెళ్లొచ్చు.. లేదా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని నిర్ణీత స‌మ‌యానికి వెళ్లొచ్చు.

➡️ఆధార్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. మ‌న ఆధార్ నంబ‌ర్ ద్వారా మ‌న‌కు అందుబాటులో ఉన్న ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌లో.. మ‌న‌కు వీలైన టైంకు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవ‌చ్చు.

➡️ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లేప్పుడు త‌ప్ప‌నిసరిగా కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఒరిజిన‌ల్స్‌ను తీసుకెళ్లాలి.

➡️ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్ సిబ్బంది ఒరిజిన‌ల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని తిరిగి ఇచ్చేస్తారు.

➡️ఆధార్‌లో కొత్త పేరు, ఇంటి పేరు ఎలా ఉండాలో సిబ్బందికి చెప్పి మార్పించుకోవాలి.

➡️అవ‌స‌ర‌మైతే బ‌యోమెట్రిక్ డేటాను కూడా అప్‌డేట్ చేస్తారు.

➡️ఈ ప్రాసెస్‌కు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

💥ఏ డాక్యుమెంట్లు అవ‌స‌రం?

🥏సాధార‌ణంగా పెళ్లి త‌ర్వాత‌ ఆధార్ కార్డులో పేరు మార్చ‌డానికి మ్యారేజి స‌ర్టిఫికెట్‌ను ప్రూఫ్‌గా స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓట‌ర్ ఐడీ, రేష‌న్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ప్ర‌భుత్వ గుర్తింపు కార్డు(ఫొటోతో ఉన్న‌వి), విద్యాసంస్థ‌ల ఐడీ కార్డులను కూడా ప్రూఫ్‌గా స‌బ్‌మిట్ చేయొచ్చు. కాక‌పోతే వీటిల్లో పెళ్లి త‌ర్వాత మారిన పేరు, ఇంటిపేరు ఉండాలి.

* * * * * *  * *

Advt: 

@    ఇప్పటి వరకు పవర్ బ్యాంకులు జేబులో పెట్టుకోవాలంటే ఇంత లావున కనిపించేవి. చాలా బరువు కూడా ఉండేవి.

@    అయితే Mi సంస్థ పరంగా జేబులో పెట్టుకోవడం కోసం రూపొందించిన ఈ 10000 mAh కెపాసిటీ కలిగిన పవర్ బ్యాంక్ చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది.

@    చాలా సౌకర్యవంతంగా జేబులో పెట్టుకోవచ్చు. పాకెట్ సైజులో ఉంటుంది.

@    22.5W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో ఉంటుంది.

@    దీన్ని వాడిన వారు మరో ప్రోడక్ట్ జోలికి వెళ్లరు

@    ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 1,199 లకే లభిస్తోంది.

@    కోనుగోలు చేసే లింకు: https://amzn.to/3hGqjKh