Monday 20 September 2021

CTET Notification 2021


*💁🏻‍♂️ సీటెట్‌ (Central Teacher Eligibility Test-CTET)డిసెంబర్ 2021: నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం -  పరీక్ష తేదీలు మరియు ముఖ్యమైన వివరాలు ఇవే*
〰〰〰〰〰〰〰〰
ఈ ఏడాదికి  సీటెట్  ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సి‌బి‌ఎస్‌ఈ  తెలిపింది. ఇందుకు సంబంధించిన  నోటిఫికేష‌న్‌లో సెప్టెంబర్ 20 విడుదల అయ్యింది.  దర‌ఖాస్తుల‌ను సెప్టెంబ‌ర్ 20, 2021 నుంచి ప్రారంభించారు. ఈ ఏడాది సీటెట్ ను 16 డిసెంబర్ 2021 నుంచి 13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు.  పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

*ముఖ్య‌మైన తేదీలు..*

• నోటిఫికేషన్ విడుదల: సెప్టెంబర్ 20, 2021
• ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 20, 2021
• దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 19, 2021
• ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2021
• అడ్మిట్ కార్డుల విడుదల: డిసెంబర్ మొదటి వారం
• పరీక్ష తేదీలు: డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 13, 2022 వరకు

*సీటెట్ వల్ల ఉపయోగాలు*
సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

*ఎవ‌రు రాయొచ్చు సీటెట్‌..*
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. 

పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్లు ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. 

*WEBSITE*

Advt:

Smart Teachers Online Shop : 



@ మొత్తం ఐదు టీ షర్ట్ లు..  ఇప్పుడు డిస్కౌంట్ లో!

Amazon Brand - Symbol Men's Regular T-Shirt

✅ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 879 లకే లభిస్తోంది.

@ 100% కాటన్ తో తయారు చేయబడిన టీ-షర్ట్‌లు ఇవి.

@ మెషీన్ వాష్‌కి కూడా  అనుకూలంగా, చాలా సౌకర్యవంతంగా ఉంటాయి

❇️కొనుగోలు చేసే లింక్:  https://amzn.to/2ZdgvRF

💐💐💐💐💐💐💐💐💐💐💐💐