Friday 24 September 2021

Teachers Diary: 24.9.2021



1)*🔊దసరా తర్వాత గురుకులాలు షురూ!*

*🔶అన్ని జాగ్రత్తలు పాటిస్తూ తెరిచే అవకాశం*

*🔷హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న అధికారులు*

*🍥గురుకుల విద్యాసంస్థలను దసరా పండగ తర్వాత తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యికిపైగా విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతులు చదువుతున్నారు. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో... 2020-21 విద్యా సంవత్సరం మధ్యలో ఇతర సంస్థల మాదిరిగానే గురుకులాల్లో కూడా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. కరోనా సద్దుమణిగిన నేపథ్యంలో... 2021-22 సంవత్సరానికి సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే గురుకుల విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు క్లాసులకు హాజరవ్వాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ హాస్టళ్లలో ఉండాలి.*

*🌀దీన్ని దృష్టిలో ఉంచుకొని... విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ గురుకుల విద్యాలయాల్ని తెరిచేందుకు హైకోర్టు అనుమతించలేదు. ఫలితంగా జూమ్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు కార్పొరేట్‌ విద్యాసంస్థలు, హాస్టళ్లు యధావిధిగా కొనసాగుతున్నాయి. పేద విద్యార్థులు చదువుకోడానికి అవకాశం కల్పిస్తూ గురుకులాలను, హాస్టళ్లను తెరవాలని ఇప్పటికే పలు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో... కరోనా పరిస్థితులు ఇప్పటిలాగే అదుపులో ఉంటే గురుకులాలను తెరవడానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థల్ని తెరవడంపై దృష్టి సారిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.*
@@@@
2)*🔊త్వరలో డిజిటల్‌ హెల్త్‌ కార్డులు*

🌍వచ్చే సోమవారం(27న)నాడు ప్రజారోగ్యానికి సంబంధించి నూతనంగా ‘ప్రధాన మంత్రి డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌’ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. ఆ పథకం కింద ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డు ఇస్తామన్నారు. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ దగ్గరి నుంచి సదరు వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య, వైద్య సమాచారమంతా దానిలో ఎప్పటికప్పుడు నిక్షిప్తమవుతుందని చెప్పారు.*

*🌀కాగా.. దేశ ప్రజలకు అత్యంత నాణ్యమైన వైద్యం.. ఆరోగ్య సంరక్షణ అందించడంలో తాము మాటకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌(ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన-పీఎం జేఏవై) పథకాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తైంది.*
@@@@@
3).*🔊30న పీఈసెట్*

*🍥బీపీఈడీ,యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 30న టీఎస్ పీఈసెట్ నిర్వహించనున్నట్టు కన్వీనర్* *ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. పరీక్షలో భాగంగా* *విద్యార్థులకు పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తామని, ఇందుకు 14 కేంద్రాలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 5,055 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,006 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపారు.*
@@@@@@
Ad:
Smart Teachers Online Shop:

@ బైక్ రైడింగ్ ఇష్టపడే వారికి సాలిడ్‌గా ఉండే ఓ హెల్మెట్, గాలి నుండి రక్షణ కల్పించే జాకెట్ పై డీల్స్



👇Steelbird SB-45 OSKA Flip Up Helmet with Reflective Graphics (X-Large 620 MM, Matt Black with Clear Visor)👇

✅అసలు ధర రూ. 1,899 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 1,699కి లభిస్తోంది 

👉కొనుగోలు చేసే లింకు: https://amzn.to/3nL8ygC

👇Royal Enfield Streetwind Riding Jacket ( Black , XXL , 46 cm , RRGJKK000005)👇

✅డిస్కౌంట్‌తో కేవలం రూ. 4,497కి లభిస్తోంది

👉కొనుగోలు చేసే లింకు:  https://amzn.to/3Evfuo8


✅🛒HAPPY SHOPPING ON AMAZON🛒✅