Thursday 23 September 2021

Teachers Diary : dt.23.09.2021

1.*🔊విద్యార్థుల అభ్యసనా సామర్థ్యంపై సర్వే*


*🌀3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు నవంబరు 12న పరీక్ష*

*🍥విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. ఎన్సీఈఆర్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ సర్వేను ఈ ఏడాది సీబీఎ్‌సఈ చేపట్టనుంది. దీని కోసం జిల్లాల వారిగా కో-ఆర్డినేటర్లను నియమించాలని సీబీఎ్‌సఈ ఆదేశించింది. తెలంగాణలోని 33 జిల్లాలకు కో-ఆర్డినేటర్లను ఎస్సీఈఆర్టీ అధికారులు నియమించారు. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో భాగంగా దేశంలోని 733 జిల్లాల్లో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు నవంబరు 12న పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, కేంద్ర ప్రభుత్వ పాఠశాల్లో నిర్వహించే ఈ సర్వే కోసం డైట్‌ లెక్చరర్లు, బీఈడీ, ఎంఈడీ కాలేజీల అధ్యాపకులు, ట్రైనీ విద్యార్థులను ఇన్వెస్టిగేటర్లుగా నియమిస్తారు*
@@@@@
2.*🔊రేపు ఎడ్‌సెట్ ఫలితాలు*

*🍥రాష్ట్రంలో బి.ఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆగస్టు 24, 25 తేదీలలో నిర్వహించిన ఎడ్‌సెట్ పరీక్షకు 34,185 మంది హాజరయ్యారు*
@@@@@@

3.*🔊‘ఇంటర్‌’లో ప్రవేశ పరీక్ష రెండో జాబితా విడుదల*

*🍥మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లోని జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాల రెండో జాబితాను బుధవారం విడుదల చేశారు. ఫలితాలను mjptbewreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలతోపాటు విద్యార్థులకు సీట్లు కేటాయించిన కాలేజీ వివరాలు, ప్రిన్సిపాల్‌ ఫోన్‌ నెంబరును వెబ్‌ సైట్‌లో ఉంచామని  వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 23 నుంచి 28 వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించామని ఆయన చెప్పారు.*
@@@@@@

4.*🔊"ఇక 10, 12 తరగతులకు కాగిత రహిత ధ్రువపత్రాలు*
*🥏‘ఏబీసీడీ’కి సీబీఎస్‌ఈ ఏర్పాట్లు*
దిల్లీ: *🌍కాగిత రహితంగా.. ఎవరూ ట్యాంపర్‌ చేయడానికి వీల్లేని విధంగా 10, 12 తరగతుల బోర్డు పరీక్ష ఫలితాల ధ్రువపత్రాల (సర్టిఫికెట్ల) జారీకి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సమాయత్తమైంది. ఇందుకు గాను బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని వినియోగించనుంది. ఈ మేరకు ‘అకడమిక్‌ బ్లాక్‌ చెయిన్‌ డాక్యుమెంట్‌ (ఏబీసీడీ)’ పేరిట ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల జారీకి ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా ధ్రువపత్రాలను సురక్షితంగా పదిలపరచడానికి వీలవుతుంది. 10, 12 తరగతులకు సంబంధించి 2019 నుంచి 2021 వరకు ‘డిజిటల్లీ సైన్డ్‌’ ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. క్రమేపీ అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన వాటిని కూడా అందుబాటులోకి తెస్తుంది. బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను ఉపయోగించి అదనపు భద్రతతో కూడిన లింక్‌ ద్వారా ఈ ధ్రువపత్రాలను జారీ చేస్తారు.*

*💫ఈ ‘ఏబీసీడీ’ని వివిధ విద్యాసంస్థలు ప్రవేశాల సమయంలోను, కంపెనీలు ఉద్యోగాలిచ్చేటప్పుడు ధ్రువీకరణకు వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు కూడా వీటిని వాడుకోవచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది. బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు విద్యా రుణాలు, ఉపకార వేతనాలు వంటివాటిని మంజూరు చేసేటప్పుడు కూడా ఈ విధానంలో ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవచ్చని వెల్లడించింది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవచ్చు. సర్టిఫికెట్లలో అవసరమైన మార్పులు చేయాల్సి వచ్చినా భవిష్యత్తులో వీలు కలుగుతుంది. పారదర్శకంగా ధ్రువపత్రాల వినియోగానికి వీలవుతుందని.. దీనిద్వారా పలు సందర్భాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు సమయం ఆదా అవుతుందని సీబీఎస్‌ఈ తెలిపింది."*
@@@@@

Advt:
Smart  Online Shop:
@ లాప్టాప్ ఆన్ చేసిన తర్వాత కేవలం 10 సెకండ్స్ లో విండోస్ డెస్క్టాప్ ప్రత్యక్షమైతే అంతకన్నా కావల్సిందేముంది?

@ SSD లభించటం వలన ఈ లాప్టాప్ కేవలం 10 సెకండ్స్ లో బూట్ అవుతుంది.

@ ఎక్కువసేపు వాడినా కూడా ల్యాప్టాప్ వేడెక్కకుండా ఉంటుంది. 

@ 15.6 అంగుళాల Full HD డిస్ప్లే ఉండటం వలన, ఒకేసారి రెండు విండోలు పక్కపక్కన అమర్చుకొని మల్టీటాస్కింగ్ చేయొచ్చు.

@ పలు పోగ్రామ్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా, ఎక్కడ స్లో అయిన భావన కలగదు, దీనికి కారణం 8GB RAM లభించడం!

@ 1TB భారీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన హార్డ్ డిస్క్ దీంట్లో ఉంటుంది.

@ శక్తివంతమైన AMD Ryzen 3-3250 ప్రాసెసర్‌తో ఈ లాప్టాప్ పనిచేస్తుంది.

@ Windows 10, MS Office ఉచితంగా లభిస్తాయి.

✅ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 42,499 లకే లభిస్తోంది.

✅కొనుగోలు చేసే లింక్:  https://amzn.to/3hMf3fg


💐💐💐💐💐💐💐💐💐💐💐💐