Monday 27 September 2021

Teacher's Diary: dt.27.9.2021

1)*🔊పంచాయతీ కార్యదర్శులకు బడి పిల్లల బాధ్యత*

*✍️రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం*

*🍥 గ్రామాల్లో పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లేలా ఆయా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సూచించింది. నూరుశాతం హాజరు, సున్నా డ్రాపవుట్లు లక్ష్యంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కోరింది. అక్షరాస్యత, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కేంద్రాలైన పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలంది. గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికే అందుబాటులో గల 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు త్వరలో విడుదల చేయనున్న 15వ ఆర్థిక సంఘం నిధులనూ ఖర్చుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్‌కుమార్‌ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తులు, భవనాల నిర్వహణ చేపట్టాలని, ఆర్థిక సంఘం నిధులతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఎరువుల కేంద్రాలకు వాడుకోవాలని కేంద్రం తెలిపింది.*

*🌀‘‘విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పాఠశాలకు ప్రాధాన్యమివ్వాలి. పాఠశాలల భవనాల నిర్వహణ, తాగునీటి సరఫరా, చేతులు కడుక్కునే స్థలాలు, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, క్రీడామైదానాల అభివృద్ధికి ఖర్చుచేయాలి. గ్రామ విద్యా కమిటీల సహాయంతో గ్రామాభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా పాఠశాలల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించాలి. విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకానికి అవసరమైన సహాయాన్ని కమిటీలు చేయాలి. వైద్యఆరోగ్యశాఖలతో కలిసి ఆరోగ్యశిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యస్థితిని తెలుసుకోవాలి. పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించి, పనితీరు నివేదికను పంచాయతీరాజ్‌, విద్యాశాఖలకు పంపించాలి’’ అని కేంద్రం సూచించింది.*
@@@@@
2).*🔊సత్వరమే ఉద్యోగుల విభజన*

*🔶నగదు రహిత ఆరోగ్య సేవల పథకం*  

*🔶టీఎన్జీవో నేతలకు సీఎం కేసీఆర్‌ హామీ*

*🍥ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే 95 శాతం స్థానిక రిజర్వేషన్ల కోసం కొత్త జోనల్‌ విధానం తెచ్చామని, దాంతో నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కొత్త విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తిస్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు నగదురహిత ఆరోగ్య పథకం అమలు కోసం అధికారులు, సంఘాల నేతలు సమావేశమై విధివిధానాలను రూపొందించాలన్నారు. టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, సహఅధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్‌, మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చిలక నరసింహారెడ్డి ఆదివారం దిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై విన్నవించారు. రాష్ట్ర ఉద్యోగులకు ఆదాయపు పన్ను వార్షిక రాయితీని రూ. 2.50 లక్షల నుంచి రూ. 10 లక్షలను పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. గచ్చిబౌలిలో భాగ్యనగర్‌ హౌసింగ్‌ సొసైటీ సంబంధించిన స్థలాన్ని త్వరలో ఉద్యోగులకు కేటాయించాలని కోరారు. ఆదాయపు పన్ను రాయితీ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని సీఎం తెరాస ఎంపీలకు సూచించారు.*
@@@@@
3)*🔊మెడికల్ కౌన్సెలింగ్ అక్టోబర్ రెండో వారంలో?*


*🌀నీట్ ఫలితాలు మొదటివారంలో వెలువడే అవకాశం*

*🍥రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ రెండవ వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. వైద్య విద్యలో ప్రవేశాలకు దేశవ్యాప్ంతగా నిర్వహించిన నీట్ 2021 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఫలితాలు మొదటి వారంలో వెలువడే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన వారం పది రోజుల వ్యవధిలో కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అందులో ప్రభుత్వ కాలేజీలు 289 ఉంటే, వాటిలో 43,435 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి. 269 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 39,840 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటో ఉన్నాయి. మెడికల్ కౌన్సిలింగ్‌లో ముందు అఖిల భారత కోటాలో 15 శాతం సీట్లు, తర్వాత రాష్ట్ర కోటాలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. ఆ తర్వాత యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం అంటే, 6,515 సీట్లను అన్ని రాష్ట్రాల నేషనల్ పూల్‌కు ఇస్తాయి. వాటిని జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేటాయిస్తారు. జాతీయస్థాయిలో రెండుసార్లు కౌన్సెలింగ్ జరిగాక, నేషనల్ పూల్‌లో మిగిలిన సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు.*

*💥ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు…విద్యార్థుల్లో ఆందోళన*

*🥏ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలు మరో రెండు వారాలలో వెలువడే అవకాశం ఉంది. మన రాష్ట్రం నుంచి మొత్తం 55 వేల మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో 34 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 5,240 ఎంబిబిఎస్ సీట్లున్నాయి. అందులో 11 ప్రభుత్వ కాలేజీల్లో 1,790 సీట్లు, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,450 ఎంబిబిఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని సీట్లల్లో 15 శాతం అంటే 268 సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్తాయి. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లల్లో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన 35 శాతం బీ కేటగిరీ కింద నిర్ణీత ఫీజుతో భర్తీ చేస్తారు.*

*💠15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద తమకు ఇష్టమైన వారికి ప్రైవేట్ యాజమాన్యాలు కేటాయించుకునే వెసులుబాటుంది. విద్యార్థులందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది..? ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం విద్యార్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్‌లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్‌లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబిబిఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది.*

 Ad:
Smart Online Shop :
@    బెస్ట్ ఎగ్ బాయిలర్ - అనేక మోడల్స్ విశ్లేషించిన తర్వాత బెస్ట్ మోడల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది!

@    AGARO Crown Instant Egg Boiler మోడల్ 360 వాట్స్ విద్యుత్‌తో పనిచేస్తుంది. ఆకర్షణీయంగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఇది కలిగి ఉంటుంది. ఎక్కడైనా సులభంగా అమర్చవచ్చు.

@    దీంట్లో ప్రధానంగా మూడు విభిన్నమైన బాయిలింగ్ మోడ్స్ ఉంటాయి.

    1. గుడ్లు గట్టిగా ఉండేలా బాయిల్ చేయొచ్చు.
    2. బాగా మెత్తగా ఉడికేలా బాయిల్ చేయొచ్చు
    3. మీడియం గా ఉండేలా బాయిల్ చేయొచ్చు

@    మిగతా వాటితో పోలిస్తే ఒకేసారి 7 ఎగ్స్ బాయిల్ చేసే సదుపాయం ఇది కలిగి ఉంటుంది.

@    అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఓవర్‌హీట్ అవకుండా, దానంతట అదే ఆగిపోయే ఏర్పాటు ఉంటుంది.

@    ఒకే ఒక టచ్ తో మొత్తం మిషన్ ఆపరేట్ చేయవచ్చు. అదే బటన్ ద్వారా మిషన్ ఆన్ చేయడం, ఆఫ్ చేయటం, లేదా బాయిలింగ్ మోడ్స్ మార్చడం చేయొచ్చు

@    దీనితోపాటు ఎగ్స్ వేసుకోవడానికి గిన్నె, వాటర్ మెజరింగ్ కప్ కూడా అందించబడతాయి.

@    ఇప్పుడు డిస్కౌంట్‌తో కేవలం రూ. 799 లకే లభిస్తోంది.

@    కొనుగోలు చేసే లింక్: https://amzn.to/3nQiDZM