Tuesday 28 September 2021

Teachers Diary : dt.28.9.2021

1) *🔊చెట్ల కింద చదువులు మేలు*

*🔶పాఠశాలలు క్రమంగా తెరవాలి*

*📜కరోనా దృష్ట్యా ఐసీఎంఆర్‌ సిఫార్సులు*

*🍥 రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రకృతి ఒడిలో పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారి కాలంలో పాఠశాలలు దీర్ఘకాలం మూసేయడం పిల్లల సంపూర్ణ వికాసంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటిని క్రమంగా తెరవడానికి ప్రయత్నించాలని సూచించింది. ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ, శాస్త్రవేత్తలు తను ఆనంద్‌, సమీరన్‌ పాండాలు రాసిన పరిశోధన పత్రం ఇండియన్‌ జర్నల్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. పిల్లల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దశలవారీగా పాఠశాలలు తెరవడంతోపాటు, మంచి గాలీవెలుతురు, కొవిడ్‌ జాగ్రత్తల మధ్య తరగతులు నిర్వహించాలని సిఫార్సు చేసింది. తొలుత ప్రాథమిక పాఠశాలలు, ఆ తర్వాత మాధ్యమిక పాఠశాలలు, ఆ తర్వాత ఆపైస్థాయి విద్యాసంస్థలను తగిన ముందు జాగ్రత్తలతో తెరవాలని సూచించింది.*

*♦️దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రాధాన్య వర్గంలో ఉపాధ్యాయులు లేకపోయినా వారితోపాటు బోధనేతర సిబ్బంది, రవాణా సిబ్బందికి అత్యవసర ప్రాతిపదికన టీకాలు అందించాలి.*

*♦️ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా చూడాలి.*

*♦️ తరగతిలోని పిల్లలను తరచూ పరిశీలిస్తూ ఉండటంవల్ల వైరస్‌ సోకిన వారిని గుర్తించి వెంటనే వేరు చేయొచ్చు. అందువల్ల పాఠశాల సిబ్బంది, పిల్లలకు తరచూ పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలి. దానివల్ల వైరస్‌ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అరికట్టడానికి వీలవుతుంది.*

*♦️ సాధారణంగా ఉష్ణోగ్రతలు చూడటం, లక్షణాలను గమనించడం లాంటి చర్యలవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి వెంటనే దాన్ని పరిహరించాలి. దానికి బదులు ప్రతి పాఠశాలలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసుకోవడం మంచిది.*

*♦️ స్థానికంగా వైరస్‌ వ్యాప్తి పెరిగినప్పుడు తాత్కాలికంగా పాఠశాలలు మూసేయాలి.*

*♦️ వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి తగిన వెలుతురు ముఖ్యం. అందువల్ల తరగతి గదుల్లోకి తగిన విధంగా గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఎయిర్‌ కండీషన్ల వినియోగాన్ని మానేయాలి.*

*♦️ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతినికేతన్‌లో పిల్లలకు చెట్ల పాఠాలు బోధించినట్లుగా ప్రకృతి ఒడిలో పిల్లలకు చదువులుచెప్పే విధానాన్ని అనుసరించాలి. నెదర్లాండ్స్‌, అమెరికా, డెన్మార్క్‌లాంటి చాలా దేశాల్లో పాఠశాలలు బహిరంగ స్థలాల్లో నిర్వహిస్తున్నారు.*

* ♦️పిల్లలను విశాలమైన చోట కూర్చోబెట్టాల్సి ఉన్నందున అసెంబ్లీ హాళ్లు, ఇతర విస్తృతమైన స్థలాలను తరగతుల కోసం ఉపయోగించుకొనే ప్రయత్నం చేయాలి.*

*♦️ పిల్లలు భోజనాలను పరస్పరం మార్చుకోవడం, క్యాంటీన్లు, భోజనశాలల్లో సుదీర్ఘంగా కూర్చోవడం లాంటివి చేయకుండా చూడాలి.*

*♦️ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌తో కూడిన హైబ్రిడ్‌ మోడల్‌ను కచ్చితంగా కొనసాగించాలి.*

* ♦️కొందరు పిల్లలకు రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలి.*

* ♦️మిగతా పిల్లలు రోజు విడిచి రోజు పాఠశాలలకు వచ్చేలా చూసుకోవాలి.*
@@@@@
2).*🔊మరోసారి పీఈసెట్‌ పోటీల వాయిదా*

*🍥వ్యాయామ విద్య(బీపీఎడ్‌, డీపీఎడ్‌) అభ్యసించేందుకు నిర్వహించే పీఈసెట్‌ మరోసారి వాయిదా పడింది. పీఈసెట్‌లో భాగంగా నిర్వహించే క్రీడా పోటీలు ఈ నెల 23న జరగాల్సి ఉండగా వాయిదా వేసి 30న నిర్వహించాలని గతంలో పీఈసెట్‌ కమిటీ నిర్ణయించింది. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సమావేశమైన కమిటీ క్రీడా పోటీలను మరోసారి వాయిదా వేసింది. వాటిని అక్టోబరు 23న జరపాలని నిర్ణయించినట్లు కన్వీనర్‌ ఆచార్య వి.సత్యనారాయణ తెలిపారు.*
@@@@@
3)*🔊ప్రతి పౌరుడికీ ఆరోగ్య గుర్తింపు కార్డు*

*🔶రికార్డులన్నీ డిజిటల్‌ రూపంలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ప్రారంభం*

*🔷ఇది విప్లవాత్మక మార్పులు తేనుందని మోదీ ఉద్ఘాటన*

*🍥 వైద్య, ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ విప్లవాత్మక మార్పులు తేనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికీ డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపు కార్డు(ఐడీ)ను అందివ్వనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి పౌరులు తమ ఆరోగ్య రికార్డులను భౌతిక రూపంలో భద్రపరచుకోనక్కర్లేదని, ఈ కార్డులోనే డిజిటల్‌ రూపంలో సురక్షితంగా ఉంటాయని వెల్లడించారు. దేశంలో ఏ ప్రాంతంలో నివసించే పౌరులైనా అత్యుత్తమ వైద్యసేవలు అందుకొనే అవకాశం ఈ కార్డుతో లభించనుందని పేర్కొన్నారు. దేశ ఆరోగ్యరంగ ముఖ చిత్రాన్ని.. ఈ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) మార్చనుందని ప్రధాని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న ఈ మిషన్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రం అమలు చేసింది. దీన్ని సోమవారం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ‘‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌.. దేశంలోని ఆస్పత్రులను, వైద్య, ఆరోగ్య సదుపాయాలను  అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా దేశవాసులకు ఒక డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపు కార్డు లభించనుంది. ఇందులో ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులు డిజిటల్‌ రూపంలో సురక్షితంగా ఉంటాయి. ఈ మాధ్యమం ద్వారా రోగి, వైద్యుడు కూడా పాత వైద్య చరిత్రను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితో పాటు.. ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, ఆరోగ్య కేంద్రాలు కూడా ఇందులో నమోదై ఉంటాయి’’ అని మోదీ తెలిపారు. ఈ కార్డుతో దిగువ మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు.*

*💥పెద్ద దేశాలకే సాధ్యం కాలేదు*

*💠డిజిటల్‌ సాంకేతికను భారత్‌ చాలా మెరుగ్గా ఉపయోగించుకుంటోందని.. ఇది పెద్ద పెద్ద దేశాలకే సాధ్యం కాలేదని ప్రధాని చెప్పారు. కరోనా సంక్రమణను ఆరోగ్య సేతు యాప్‌ అద్భుతంగా నిరోధించిందని, కొవిన్‌ యాప్‌ సాయంతో దేశంలో 90 కోట్ల టీకాలను దిగ్విజయంగా వేయగలిగామని తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనతో దేశంలో దాదాపు రెండు కోట్ల మంది ఉచితంగా వైద్యసేవలు పొందారని.. ఇది తనకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు. భారత్‌లో 130 కోట్ల ఆధార్‌ కార్డు, 118 కోట్ల మొబైల్‌, 43 కోట్ల జన్‌ధన్‌ బ్యాంక్‌ వినియోగదారులు ఉన్నారని.. ఇంతటి అనుసంధాన వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదని చెప్పారు. ఆరోగ్య రంగానికి పర్యాటకంతో ఉన్న సంబంధాలు గురించి కూడా ప్రధాని మాట్లాడారు. మెరుగైన వైద్య సదుపాయాలున్న దేశాల్లో పర్యటించడానికే పర్యాటకులు ఉత్సాహం చూపుతారని వివరించారు. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా సురక్షితంగా ఉంటామన్న భావనే దీనికి కారణమని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇది మరింత పెరిగిందని చెప్పారు. డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ విధానం ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిందో, ఈ ఆరోగ్య గుర్తింపు కార్డు కూడా అలాంటి మార్పులే తేనుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఒక క్లిక్‌తో పౌరులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.*
4)


Ad:

Smart  Online Store:



@    మీ ఇంట్లో వాడుకోటానికి శక్తివంతమైన వేక్యూమ్ క్లీనర్ కోసం చూస్తున్నారా?

@    బలమైన సక్షన్ కెపాసిటీ ఉండి, అటు సక్షన్‌కీ, బ్లోయర్‌గానూ ఉపయోగించగలిగే మోడల్ ఇది.

@    చాలా తక్కువ బరువు ఉంటూ, ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. వెట్/ డ్రై మోడ్స్ కూడా లభిస్తున్నాయి.

@    సులభంగా మూవ్ చెయ్యడానికి వీల్స్ కూడా ఉంటాయి.

@    ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 4,299 లభిస్తోంది.

@    కోనుగోలు చేసే లింకు: https://amzn.to/3EyrYeE