Wednesday 29 September 2021

Teachers Diary : dt.29.09.2021


1).
*🔊నవోదయ ఫలితాలు విడుదల*
  *🌍జవహార్ నవోదయ విద్యాలయాలలో 6, 11వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2021-22 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఈమేరకు మంగళవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆరో తరగతి పరీక్షను ఆగస్టు 11, 2021లో నిర్వహించారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 644 జిల్లాలో 11,152 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 14 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా 47,320 మంది ఎంపికైనట్లు సమాచారం. 11వ తరగతి ప్రవేశ పరీక్షలో ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.*
@@@@@
2). 
*🔊ఒప్పంద అధ్యాపకుల సేవలు పొడిగింపు*

 *🌍ఇంటర్మీడియెట్ కళాశా లల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, మినిమమ్ టైమ్ స్కేల్ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి పొడిగిం చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 3,696 మంది కాంట్రాక్టు, 78 మంది ఔట్ సోర్సింగ్, 272 మంది కనీస టైమ్స్కేల్ ఉద్యో గుల సేవలు అందుబాటులోకి రానున్నాయి.*
@@@@@
3) 
*🔊పీజీ ప్రవేశ పరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల*

*🌍ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 18 నుంచి 27 వరకు నిర్వహించిన వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల ప్రథమిక 'కీ' విడుదల చేసినట్లు సీపీజీఈటీ-2021 కన్వీనర్ ప్రొ.పాండురంగా రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయా సబ్జెక్టుల ప్రాధమిక ‘కీ’లో అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో మెయిల్ ద్వారా పంపాలన్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలని సూచించారు.*
@@@@@
4) *🔊విద్యాశాఖలో డిజిటల్ రిసోర్స్ బృందాలు*
 *🌍రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్, డిజిటల్ పాఠాలను కొత్తపుంతలు తొక్కించేందుకు ఎస్సీఈఆర్టీ అధికారులు జిల్లాస్థాయిలో డిజిటల్ రిసోర్స్ బృందాలను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు టీచర్ల చొప్పున ఆరు సబ్జెక్టులకు ప్రత్యేక బృందాలను నియమిం చనున్నారు. ఆన్లైన్ పాఠ్యాంశాల తయారీతోపాటు మూల్యాం కనం తదితర అంశాల్లో వీరికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణసంస్థ వర్చువల్ గా శిక్షణనివ్వనున్నది. వరుసగా వర్క్స్లను నిర్వ హింది, శిక్షణనిచ్చి వీరి సేవలను వినియోగించుకోనున్నది.*
@@@@@

5)*🔊బడి పుస్తకాల్లో రోడ్డు భద్రతా పాఠాలు*

*📚ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠ్యాంశాల్లో చేరనున్న ట్రాఫిక్‌ రూల్స్‌*

*🌍దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రపంచ దేశాల కింద తలవంపులు తెస్తున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉన్నా, వాటిని పాటించని దేశంగా భారతదేశానికి అవమానాలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఏటా లక్షలాది మంది చనిపోతుండడంతో కుటుంబాలు క్షోభ పడుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో పలు దేశాలు రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూసుకుంటున్నాయి. దేశంలో మాత్రం రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని పూర్తిగా తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ.7,270 కోట్లతో ప్రత్యేక ప్రణాళికను అమలుచేయనుంది. దేశంలో జరుగుతున్న మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో 85 శాతం మరణాలు సంభవిస్తున్న 14 రాష్ట్రాల్లో రోడ్డు భద్రతను బలోపేతం చేయనుంది. మొదటగా ఆ పద్నాలుగు రాష్ట్రాల్లో రోడ్డు భద్రత కోసం నిధులు వెచ్చించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తోపాటు తమిళనాడు, కర్నాటక, ఒడిశా, బీహార్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా, అసోంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు రోడ్డు భద్రత ప్రణాళికను పంపించింది. ఈ పథకం కింద రోడ్డు భద్రతపై విస్తతంగా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేయబోతుంది. 2022-23లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలను పాఠ్యాంశాలుగా పెట్టనున్నారు. దీంతో పాటు ఇంటర్మీడియెట్‌ లోనూ రోడ్డు భద్రతపై ఒక అధ్యాయాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇవే కాకుండా నాలుగు లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాల రోడ్లపై స్పీడ్‌ మేనేజ్‌మెంట్‌ పరికరాలను ఉంచనున్నారు. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాలను నివేదించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర రహదారులు, పట్టణ రహదారులపై ద్విచక్ర వాహనాల కోసం ప్రాధాన్య కారిడార్లను గుర్తించనున్నారు. అడ్వాన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టాన్ని విస్తరిస్తూ, వాహనాల భద్రత, డ్రైవర్ల శిక్షణపై ప్రచారాలు చేయనున్నారు. అంబులెన్స్‌ల కోసం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ (డేటా) సెంటర్‌తో పాటు ఆటోమేటెడ్‌ వెహికల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.*

 Ad

Smart  Online Store :


@    తిరుగులేని క్వాలిటీ కలిగిన సన్ గ్లాసెస్ ఇవి!

@    బైక్ రైడింగ్, కార్ డ్రైవింగ్, ఇతర అన్ని సందర్భాల్లో కళ్ళ మీద ఒత్తిడి పడి అలసటకు గురి కాకుండా ఇవి కాపాడతాయి.

@    100 శాతం యాంటీ-గ్లేర్ UV ప్రొటెక్షన్ ఉండటం మాత్రమే కాకుండా..

@    గీతలు పడకుండా, పగిలిపోకుండా, వంగిపోకుండా ఇవి రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి.

@    చాలా తక్కువ బరువు ఉండటం వల్ల ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఇబ్బంది అనిపించదు.

@    అన్ని రకాల ఫేస్ షేప్‌లకు ఇది సరిపోతుంది.

@    అన్ని వయసుల వారికి చాల స్టైలిష్ గా ఉంటుంది.

@    దీని అసలు ధర రూ. 2,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 749కి పొందొచ్చు.

@    కొనుగోలు చేసే లింక్https://amzn.to/3hM26lE