Sunday 3 October 2021

Teacher's Diary : dt.03.10.2021


1)*🔊ఈ నెల 23, 24న అంబేడ్కర్‌ వర్సిటీ పరీక్షలు*

*🍥వాయిదా వేసిన అన్ని పరీక్షలను ఈ నెల 23, 24న నిర్వహిస్తామని డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఇతర వివరాలు www.braouoline.in  వెబ్‌సైటులో ఉన్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్‌ 28, 29న జరగాల్సిన పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే.*
@@@@@
2).చూపున్నమాట
*🔊పదోన్నతులు కల్పించాలి: టీఎ్‌సజీహెచ్‌ఎంఏ*



*🍥కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుకూలంగా నూతన సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి పదోన్నతులు కల్పించాలని తెలంగాణ స్టేట్‌ గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్స్‌ అసోసియేషన్‌(టీఎస్‌జీహెచ్‌ఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శనివారం జరిగిన జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్టు అధ్యక్షుడు రాజభాను చంద్ర ప్రకాష్‌ తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీచేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా ఉపాధ్యాయ పోస్టుల్ని మంజూరు చేయాలి వంటి తీర్మానాలు చేశామన్నారు.*
@@@@@
3)*🔊నాడు 212.. నేడు 92..*

*🔶ఆరేళ్లలో గణనీయంగా తగ్గిన డీఎడ్‌ కళాశాలలు*

*🔷సీట్లే తక్కువ.. చేరేవారు మరీ స్వల్పం*

 డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఈడీ) కోర్సులను అందించే కళాశాలల మూసివేత పరంపర కొనసాగుతోంది. గత ఆరేళ్ల కాలంలో సగానికిపైగా కళాశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో 212 డీఎడ్‌ కళాశాలలు (12,500 సీట్లు) ఉంటే గత ఏడాది 100కి (6,250 సీట్లు) తగ్గిపోయాయి. ఈసారి 92 కళాశాలలే దరఖాస్తు చేశాయి. ఈ కోర్సుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. 2016-17లో 7,689 సీట్లు భర్తీ కాగా గత ఏడాది 2,830 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. ప్రాథమిక విద్య(1-5 తరగతులు)లో బోధించేందుకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) కొలువులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) పాసైనవారూ పోటీపడవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీఎడ్‌ కోర్సులకు గిరాకీ తగ్గిపోయింది. గత 15 ఏళ్లుగా దీని వార్షిక ఫీజు పెరగలేదు. కేవలం రూ.12 వేలుగా ఉంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. తర్వాత నాలుగేళ్లయినా మరొకటి రాలేదు. ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉన్నందున కొత్తగా ఉపాధ్యాయ పోస్టులు ఉండవని విద్యార్థులు భావిస్తున్నారు. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) మౌలిక సదుపాయాలు, అర్హులైన అధ్యాపకుల నియామకంపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇవన్నీ యాజమాన్యాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 90 శాతం డీఎడ్‌ కళాశాలలు బీఈడీ కళాశాలల్లోనే కొనసాగుతుంటాయి. ‘ఫీజు పెంచాలని అడిగితే ఆ కోర్సుల్లో చేరేది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులని, అందువల్ల పెంచడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఆ రుసుములతో నాణ్యమైన విద్య అందించడం ఎలా వీలవుతుంది’ అని కళాశాల యజమాని ఒకరు ప్రశ్నించారు.*

*🌀2019లో డీఈఈసెట్‌కు 25 వేల మంది దరఖాస్తు చేయగా 2020లో ఆ సంఖ్య 14,036కు తగ్గిపోయింది. ఈ ఏడాది 7,591కు పడిపోయింది. అందులో పరీక్ష రాసింది 5,818 మంది. వారిలో ఉత్తీర్ణులైంది 3,911 మందే. డీఈఈసెట్‌ ఫలితాలు సెప్టెంబరు 15న వెల్లడికాగా.. ఇప్పటివరకు ప్రభుత్వం ఆయా కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. జాతీయ నూతన విద్యావిధానంలో ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో డీఈడీ కోర్సు మనుగడ దాదాపు కోల్పోయినట్లేనని కళాశాల యజమాని ఒకరు అభిప్రాయపడ్డారు.*
@@@@@

4)🔊బీటెక్‌లో బ్రేక్‌ స్టడీ!*

*🔶ఏడాది ఆపేసి మళ్లీ చదువుకొనే అవకాశం*

*🔷స్టార్టప్స్‌ ప్రోత్సాహానికి నూతన నిర్ణయం*

*📜మార్గదర్శకాలు వెల్లడించిన జేఎన్టీయూ*

*🍥విద్యార్థి ఫ్రెం డ్లీ విధానాలు తీసుకొనే జేఎన్టీయూ .. మరో కొత్త విధానానికి శ్రీకా రం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్‌ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది. స్టార్టప్స్‌లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్టు జేఎన్టీయూ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఇది వరకు బీటెక్‌లో చేరితే నాలుగేండ్లపాటు వరుసగా చదువాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్లపాటు తాత్కాలిక విరామం తీసుకోవచ్చు. బీటెక్‌ విద్యార్థులు కొందరు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు స్టార్టప్స్‌లో రాణిస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ దశలో అటు చదువా.. ఇటు స్టార్ట ప్పా.. అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మధ్యలో చదువులు ఆపేస్తే పట్టా చేతికి అందదని.. చదువులకు ప్రాధాన్యమిస్తే మొగ్గదశలోనే నవ ఆలోచనలను తుంచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ బ్రేక్‌ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.*

*💥మార్గదర్శకాలు..*

*➡️స్టార్టప్స్‌ వెంచర్లు, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నవారే ఇందుకు అర్హులు.*

*➡️తొలి నాలుగు సెమిస్టర్లు పూర్తిచేసినవారికే అవకాశం. బ్యాక్‌ల్యాగ్స్‌ ఉన్నవారికి, హాజరుశాతంలేనివారికి ఈ అవకాశం ఉండదు.*

*➡️ఆయా విద్యార్థులు జేఎన్టీయూ వీసీకి రిపోర్ట్‌చేసి, అనుమతి పొందాలి. ఏ కారణం చేత బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నారో వెల్లడించాలి.*

*➡️తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ నుంచి సైతం అనుమతి పొందాల్సి ఉంటుంది.*

*➡️సంవత్సరం పూర్తికాగానే మరలా తిరిగి కోర్సులో చేరాలి.*
 Ad:

Smart Online Shop : 

More & More Unisex-Adult Cotton Hooded Neck Don’t Quit Printed Hoodie



    సౌకర్యం మరియు స్టైల్: మీరు ఇప్పటి వరకు ధరించిన వాటిలో ఫ్యాషన్ పరంగా ఉత్తమంగా సౌకర్యవంతమైనది, ఫ్యాబ్రిక్ చర్మంపై చాలా మృదువుగా ఉంటుంది. మీరు జాగింగ్ కోసం ఈ స్వెట్‌షర్ట్‌ను ఉపయోగించవచ్చు.

ఫ్యాబ్రిక్‌: 100% స్వచ్ఛమైన కాటన్; పురుషుల కోసం ప్రీమియం ఎగుమతి నాణ్యత గల బ్రాండెడ్ ఫుల్ స్లీవ్ స్వెట్‌షర్ట్; మీ వార్డ్‌రోబ్ క్యాజువల్స్‌కు ప్రత్యేకమైన సేకరణ, ఉత్తమంగా కనిపించే ఈ స్వెట్‌షర్ట్‌తో చాలా సులువుగా అందంగా కనిపించండి

స్లీవ్ రకం: ఫుల్ స్లీవ్; పాకెట్స్: మీకు చలి వేసినప్పుడు మీ అరచేతిని కవర్ చేయడానికి సరిపోయే కంగారు పాకెట్స్ ఉన్నాయి; స్టైల్: ఫ్యాషనబుల్ రౌండ్ నెక్ హూడీ. అధునాతన స్టైలిష్ రూపం కోసం సరైనది.

Price: ₹799.00

@   కోనుగోలు చేసే లింకు :  https://amzn.to/3mb6z2X